పెళ్లికి వేళాయె | Winter Wedding For Sushmita Sen And Rohman Shawl | Sakshi
Sakshi News home page

పెళ్లికి వేళాయె

Published Sun, Aug 4 2019 2:00 AM | Last Updated on Sun, Aug 4 2019 2:00 AM

Winter Wedding For Sushmita Sen And Rohman Shawl - Sakshi

రోహమాన్‌ షా, సుస్మితాసేన్‌

గత ఏడాది బాలీవుడ్‌లో పెళ్లి బాజా 70 ఎమ్‌ఎమ్‌ డీటీఎస్‌ సౌండ్‌లో మోగినట్లు మోగింది. బాలీవుడ్‌ కథానాయికలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్, నేహా ధూపియాలతో పాటు మరికొందరు మెట్టినింట అడుగుపెట్టారు. తాజాగా సుస్మితాసేన్‌ పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయని తెలుస్తోంది. మోడల్‌ రోహమాన్‌ షా, సుస్మితా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు నెటిజన్లకు బాగానే దర్శనమిస్తున్నాయి. త్వరలో ఈ ఇద్దరూ ఏడడుగులు వేయాలని నిర్ణయించుకున్నారట. ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రోహమాన్‌ షా వయసురీత్యా సుస్మితా కన్నా దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడు కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement