
శివరాజ్ కుమార్
ఏకంగా ఆరుగురు గోపికలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు స్టార్ హీరో శివరాజ్‌కుమార్. సుదీప్, శివరాజ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో సీఆర్ మనోహర్ నిర్మిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. ఆల్రెడీ సుదీప్ వంతు టాకీపార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు శివరాజ్ కుమార్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. అదిరిపోయే లెవల్‌లో శివరాజ్‌కుమార్‌పై ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్లాన్ చేశారు ప్రేమ్.
ఈ సాంగ్‌లోనే ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఆల్రెడీ రచితా రామ్, శ్రద్ధా శ్రీనాథ్, రాధికా చేతన్‌లను ఈ సాంగ్ కోసం ఎంపిక చేశారని శాండిల్‌వుడ్ సమాచారం. మరో ముగ్గురి ఎంపిక జరుగుతోందట. అంతేకాదు.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నారు. ‘ది విలన్’ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment