the villain
-
చైనా ది విలన్!
-
దసరాకు విలన్
రెండున్నరేళ్ల క్రితం ‘ది విలన్’ సినిమా కోసం కొబ్బరికాయ కొట్టారు టీమ్. ఇందులోని యాక్టర్స్ డేట్స్ కుదరకపోవడం, అమీ జాక్సన్ విసా ప్రాబ్లమ్, వర్షం తాకిడికి లొకేషన్లో ఇబ్బంది కలగడం వంటి కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌లు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉప శీర్షిక. సీఆర్ మనోహర్ నిర్మించారు. శ్రీకాంత్, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ప్రేమ్ పేర్కొన్నారు. ‘‘కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయబోతున్నాం. సహకరించిన టీమ్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ప్రేమ్. యాక్టర్ కావాలని కలలు కనే ఓ పల్లెటూరి యువకుడి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని శాండిల్‌వుడ్ టాక్. -
ఆరుగురు హీరోయిన్లు... ఒక హీరో
ఏకంగా ఆరుగురు గోపికలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు స్టార్ హీరో శివరాజ్‌కుమార్. సుదీప్, శివరాజ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో సీఆర్ మనోహర్ నిర్మిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. ఆల్రెడీ సుదీప్ వంతు టాకీపార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు శివరాజ్ కుమార్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. అదిరిపోయే లెవల్లో శివరాజ్‌కుమార్‌పై ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్లాన్ చేశారు ప్రేమ్. ఈ సాంగ్‌లోనే ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఆల్రెడీ రచితా రామ్, శ్రద్ధా శ్రీనాథ్, రాధికా చేతన్‌లను ఈ సాంగ్ కోసం ఎంపిక చేశారని శాండిల్‌వుడ్ సమాచారం. మరో ముగ్గురి ఎంపిక జరుగుతోందట. అంతేకాదు.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నారు. ‘ది విలన్’ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్లీజ్... నన్ను బాధపెట్టొద్దు
.... అంటున్నారు కన్నడ హీరో సుదీప్. అసలేం జరిగిందంటే... ఈ హీరో ఫ్యాన్ ఒకరు చేతిపై ‘కిచ్చా’ అని పచ్చబొట్టు పొడిపించుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సుదీప్.. ‘‘ఫ్యాన్స్ ఇలా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలో లేక సారీ చెప్పాలో తెలియడం లేదు. నువ్వు ఆ పచ్చబొట్టు వేయించుకుంటున్నప్పుడు ఎంత బాధ భరించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను (పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమానిని ఉద్దేశిస్తూ). ఇలాంటివి చేసి మీరు బాధపడొద్దు. నన్ను బాధపెట్టొద్దు. నా సినిమా చూడడానికి ఫ్యాన్స్ టిక్కెట్స్ కొని, నన్ను సపోర్ట్ చేస్తే అదే చాలు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నాపై అభిమానాన్ని చాటుకోవడానికి ఫ్యాన్స్ ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అంతులేని మీ అభిమానానికి థ్యాంక్స్’’ అన్నారు సుదీప్. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘ది విలన్’. ‘‘వారం రోజుల తర్వాత శుక్రవారం ‘ది విలన్’ సినిమా సెట్లోకి ఎంటర్ అయ్యాను’’ అన్నారు సుదీప్. ప్రస్తుతం సుదీప్, అమీ పాల్గొనగా ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇందులో అమీ పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే అజయ్‌వర్మ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా రూపొందుతోన్న ‘నీరళి’ చిత్రంలో సుదీప్ కీ రోల్ చేస్తున్నారట. సుదీప్ కన్నడ సినిమాలు మలయాళంలో డబ్ అయ్యాయి. అయితే ఆయన చేయనున్న ఫస్ట్ స్ట్రైట్ మలయాళ మూవీ ఇది. -
అయినా మంచి భర్తే!
భార్య కాలికి దెబ్బతగిలి హస్పిటల్లో జాయిన్ అయితే.. ఏ భర్త అయినా చూడకుండా ఉంటాడా? పోనీ.. రెండేళ్లుగా ఇంటిని పట్టించుకోకపోవడమే కాకుండా.. ఒక్క పండగని కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చేసుకోలేకపోతే.. ఆ భర్త ‘మంచివాడు’ అవుతాడా? కాదు కదా. అయినా ఇప్పుడు చెప్పబోతున్న దర్శకుడు ప్రేమ్ మాత్రం మంచివాడే. భార్యను పట్టించుకునే తీరిక అతనికి లేదు. ఫ్యామిలీతో పండగలు చేసుకునే ఖాళీ లేదు. ఎందుకలా? అంటే.. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది విలన్’ కోసం. శివరాజ్ కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. న్యూ ఇయర్ స్పెషల్‌గా టీజర్‌ను లాంచ్ చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల వీలుపడలేదట. ఇందుకు ప్రేమ్∙సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు చెప్పారాయన. ‘‘బ్యాలెన్స్ టాకీ పార్ట్‌ను, ఫోర్ సాంగ్స్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం ఫోర్ డిఫరెంట్ స్టూడియోస్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశాం. ఏప్రిల్ కల్లా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. మల్టీస్టారర్ సినిమా కావడంతో రెండు టీజర్స్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘నా భార్య రక్షిత కాలికి గాయమైనప్పుడు నేను హస్పిటల్‌కి వెళ్లలేదు. ఇంట్లో పండగ సంబరాలు జరుపుకుని రెండేళ్లయింది. ఒక్కరోజు కూడా హాలీడే తీసుకోకుండా ‘ది విలన్’ సినిమా కోసం వర్క్ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రేమ్ మంచి భర్త అంటే ఒప్పుకుంటారు కదా. -
ఐ యామ్ సారీ!
... అని చెప్పారట హీరోయిన్ అమీ జాక్సన్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్ కీలకపాత్రల్లో ‘ది విలన్’ అనే కన్నడ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు కిరణ్‌కుమార్ (స్క్రీన్ నేమ్ ప్రేమ్). ఈ ఏడాది జూలైలో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేశారు. ఆ షూట్లో అమీ జాక్సన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెలలో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట డైరెక్టర్ ప్రేమ్. ఆ షెడ్యూల్ షూట్ స్టార్ట్ కాకపోయే సరికి ఇండస్ట్రీలో ఈ సినిమాపై రూమర్లు వచ్చాయి. వీటిపై దర్శకుడు స్పందిచారు. ‘‘సినిమా లేట్ అవ్వడంలో నా ప్రమేయం ఏమీ లేదు. అమీ జాక్సన్ వీసా పాబ్లమ్స్ వల్ల ఫిక్స్ చేసిన షెడ్యూల్ టైమ్‌కి రాలేనని చెప్పారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వెంటనే షూట్లో జాయిన్ అవుతానన్నారు. రాలేకపోయినందుకు ఆమె సారీ కూడా చెప్పారు. అలాగే హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్‌లు బాగా సహకరిస్తున్నారు. షూటింగ్‌ను డిసెంబర్ కల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్. -
ప్రతినాయకుడిగా డాక్టర్ శరవణన్
నిజ జీవితంలో ఎందరో రోగుల ప్రాణాల్ని కాపాడుతున్న వైద్యుడిని తన చిత్రంలో విలన్‌గా చూపించానని దర్శకుడు శ్రీ మహేశ్ తెలిపారు. ఇంతకుముందు శరత్‌కుమార్ హీరోగా చత్రపతి చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం చరిత్తిరం పేసు. అయ్యనార్ ఫిలింస్ పతాకంపై యోగేశ్వరన్ బోస్ నిర్మిస్తూ ఒక కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా పసంగ చిత్రం ఫేమ్ ధరణి నటించారు. మరో యువ జంటగా కృప, కన్నిక నటించారు. డాక్టరు శరవణన్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ చరిత్తరం పేసు కమర్షియల్ అంశాలతో కూడిన విభిన్న కథా చిత్రం అన్నారు. ఈ చిత్రంలో గౌరవం కోసం క్రూరంగా హత్యలు చేసే విలన్ పాత్రలో డాక్టర్ శరవణన్ నటించారన్నారు. నిజ జీవితంలో ఎందరో రోగుల ప్రాణాలకు కాపాడుతూ హీరోగా పేరొందిన డాక్టర్ శరవణన్ ఇందులో విలన్‌గా చూపించడం విశేషం అన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం తుది ఘట్ట సన్నివేశాల చిత్రీకరిస్తున్న సమయంలో తాను అనారోగ్యానికి గురవ్వగా చెన్నై నుంచి మదురైకి అంబులెన్స్‌లో తీసుకెళ్లి తన వైద్యంతో ప్రాణాలను కాపాడిన గొప్ప మానవతావాది శరవణన్ అని తెలిపారు. అలా ఆయన ఎందరో రోగులకు ప్రాణభిక్ష పెట్టారన్న విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఇక చరిత్తిరం పేసు చిత్రం విషయానికొస్తే ఒక యువతి ప్రేమ కారణంగా హీరోకు, విలన్‌కు జరిగే పోరాటమే చిత్ర కథ అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగాయి. నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు పేరరసు అందుకున్నారు.