రాముడా? రావణుడా? | The Villain teaser to be out on June 28 | Sakshi
Sakshi News home page

రాముడా? రావణుడా?

Published Sun, Jun 24 2018 12:52 AM | Last Updated on Sun, Jun 24 2018 12:52 AM

The Villain teaser to be out on June 28 - Sakshi

శివరాజ్‌కుమార్

రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కన్నడలో ‘ది విలన్‌’ సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే టైమ్‌ వచ్చింది. ఆల్రెడీ టాకీపార్ట్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా టీమ్‌ ప్రజెంట్‌ సాంగ్స్‌ను షూట్‌ చేసే పనిలో పడింది. శివరాజ్‌కుమార్, సుదీప్, అమీజాక్సన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘ది విలన్‌’. రామ్‌ ఆర్‌ రావణ్‌ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్, బాలీవుడ్‌ నటుడు మిధున్‌ చక్రవర్తి కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్‌గా హీరో శివరాజ్‌ కుమార్‌పై ఓ మాస్‌ సాంగ్‌ను షూట్‌ చేశారు. ఈ సాంగ్‌తో ఈ సినిమాలో శివరాజ్‌కుమార్‌ వంతు చిత్రీకరణ పూర్తయ్యింది. ‘‘శివన్న డ్యాన్సింగ్‌ ఎనర్జీ సూపర్‌. నగేశ్‌ మాస్టర్‌ కంపోజ్‌ చేశారు’’ అన్నారు దర్శకుడు ప్రేమ్‌. ఆల్రెడీ హీరోల లుక్స్‌ రిలీజ్‌ అయ్యాయి. ఈ నెల 28న  టీజర్‌ను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement