sudheep
-
'మధుమతి'గా శ్రియా కొత్త లుక్.. నెట్టింట వైరల్
Shriya Saran First Look Released From Kabzaa Movie: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. సుమారు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందుతూనే ఉంది. అయితే వివాహం అనంతరం మాత్రం అరకొర సినిమాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రస్తుతం బడా హీరోలా సరసన నటించికపోయిన పెద్ద చిత్రాల్లో మాత్రం కనిపించి అలరిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ 'దృశ్యం 2'లోనూ అజయ్ దేవగణ్‌కు జంటగా యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రియా మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రియా లీడ్ రోల్లో అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. 'కబ్జా' సినిమాలో శ్రియా మధుమతి అనే పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించి మహరాణిలా సింహాసనంలో కూర్చున్న శ్రియా మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, కబీర్ సింగ్ దుహా, బోమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో పాన్ ఇండియాగా త్వరలో విడుదల కానుంది. Unveiling the first look of our 1’st queen..Welcoming Shirya Saran aboard.. happy to have you on set @shriya1109 💐✨#Kabzaa#Indianrealstarupendra#KichchaSudeepa#Rchandru#ShriyaSaran#Panindiamoviekabzaa pic.twitter.com/vP2z6eW81i — R.Chandru (@rchandru_movies) March 7, 2022 -
నా జీవితంలో ఈగను మర్చిపోలేను
‘‘ఒకప్పుడు సౌత్ ఫిల్మ్స్.. నార్త్ ఫిల్మ్స్ అని ఒక వ్యత్యాసం ఉండేది. కానీ ఈ రోజు నార్త్.. సౌత్ అనేది లేదు. మొత్తం ఇండియన్ ఫిల్మే అయ్యింది. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అక్కడివాళ్లు ఇక్కడ, ఇక్కడివాళ్లు అక్కడ చేస్తున్నారు. ఇది శుభపరిణామం. తెలుగు సినిమాల డబ్బింగ్ రైట్స్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇలా అన్ని రాష్ట్రాల మధ్య సంబంధాలు ఒకేలా కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఎస్. కృష్ణ దర్శకత్వంలో సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటించారు. స్వప్న కృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘జీవితంలో మనం అందరం మన కోసం సాధించుకుంటాం. కానీ దేశం కోసం సాధించిన సింధుగారిని అభినందించాలి. ఈ మధ్య భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయం, విషయం ఏంటంటే చంద్రయాన్. ‘చంద్రయాన్’ అనే రాకెట్‌ని క్షక్ష్యలోకి ప్రవేశపెట్టి దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు. బ్యాడ్మింటన్ రాకెట్‌తో దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు సింధుగారు. ఇక కన్నడ ప్రజలు, తెలుగు ప్రజలు కవల పిల్లలులాంటివారు. తెలుగు పరిశ్రమకు కన్నడ రాష్ట్రం ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను కూడా కన్నడ సినిమాలానే ఫీల్ అవుతారు. మనవాళ్లు కూడా ఒక మంచి కన్నడ చిత్రం వచ్చిందంటే తెలుగు సినిమా కన్నా ఎక్కువగా నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి ఉదాహరణ ‘కేజీఎఫ్’. అలాగే ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. సుదీప్ ఏ భాషలో నటించినా అక్కడి ప్రజల మనసును పరిపూర్ణంగా చూరగొనే ఆర్టిస్ట్. సుదీప్ ఆల్రెడీ సర్టిఫైడ్ హీరో. కానీ ఆయన ఆ బౌండరీలో లేడు. ఏ రాష్ట్రం వారు పిలిచినా ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందంటే ఆ రాష్ట్రానికి వెళతాడు. నటిస్తాడు. ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేసి వస్తాడు. ఈ సినిమా కోసం సుదీప్ బాడీ షేపప్ చేశాడు.. చాలా తగ్గాడు. అఫ్కోర్స్... మన ఇండియన్ హీరోలంతా అంతే. మన తెలుగు వాళ్లలో ఉదాహరణకు... ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్.. ఇలా అందరూ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తగ్గుతారు. ఇప్పుడు బాలకృష్ణ 11 కేజీలు తగ్గారు. ‘సరైనోడు’ కోసం బన్నీ, ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్.. ఇలా ఎవరికి వారు డైరెక్టర్ని బాడీ ఎలా కావాలి? ఒక కథకు ఏం కావాలి? అని అడిగి తమను తాము మౌల్డ్ చేసుకుంటున్నారు. ఈ కోవలో సుదీప్ కూడా ఉన్నారు. సాయి కొర్రపాటిగారు మంచి మూవీ లవర్. మన సినిమాలను ఇతర భాషల్లో, ఇతర భాషల్లోని సినిమాలను మనకు చూపించాలని తాపత్రయపడుతుంటారు. అందుకు ఓ ఉదహరణ ఈ ‘పహిల్వాన్’ సినిమా. ఇంతకుముందు ఆయన తెలుగులో విడుదల చేసిన ‘కేజీఎఫ్’ చిత్రానికి మంచి రెవెన్యూ వచ్చింది. ‘పహిల్వాన్’ కూడా అంత మంచి సినిమా అవ్వాలి. దర్శకుడు కృష్ణగారు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సింధు గోల్డ్ మెడల్ కొట్టినట్లే ఈ సినిమా కూడా అంతటి స్థాయిలోకి వెళ్లాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు చాలామందికి స్ఫూర్తిని ఇస్తాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ట్రైలర్ చూశాను. సుదీప్‌గారు చాలా కష్టపడ్డారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనపై నమ్మకం ఉంచి ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. కష్టపడితేనే పైకి రాగలం. ముందు ముందు దేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి కష్టపడతాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వేదికపై ఉండటం హ్యాపీ. ‘పహిల్వాన్’ సినిమా చూడండి’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ‘‘ఈ వేదికపై సింధుగారు ఉండటం మాకు చాలా గౌరవంగా ఉంది. సింధుని ఇండియాకి ఇచ్చిన ఆమె తల్లిదండ్రులకు థ్యాంక్స్. వేదికలపై నేను అంతగా మాట్లాడలేను. నెక్ట్స్ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాను. గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడతాను. తెలుగు ప్రేక్షకులు నాకు చాలా గౌరవాన్ని, ప్రేమను అందిస్తున్నారు. నా జీవితంలో ‘ఈగ’ చిత్రాన్ని, రాజమౌళిగారిని, తెలుగు ప్రేక్షకులను మర్చిపోలేను. నిర్మాత సాయిగారు నాకు వెరీ స్పెషల్. మంచి మానవతావాది ఆయన. నన్ను అభినందించిన బోయపాటిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణ నిర్మాతగా మారారు. చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌లో సింధు మేడమ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుదీప్. ‘‘పహిల్వాన్’ సినిమాతో హైదరాబాద్‌కు స్పెషల్ కనెక్షన్ ఉంది. సినిమా చిత్రీకరణ ఇక్కడే మొదలైంది. మేజర్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ సినిమాను తెలుగులో ఈ స్థాయిలో విడుదల చేస్తున్న సాయిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు కృష్ణ. ‘‘ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అన్నారు’’ చాముండేశ్వరీనాథ్. ‘‘తెలుగు రాష్ట్రాల్లో సుదీప్‌గారికి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. ‘పహిల్వాన్’ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. బ్రహ్మాండమైన ఆల్బమ్ కుదరింది. ఈ చిత్రం ద్వారా అర్జున్ జన్యలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రామజోగయ్య శాస్త్ర్రి. ‘‘ఈ సినిమాలో రుక్మిణి పాత్ర చేశాను. నాది రొటీన్ హీరోయిన్ పాత్ర కాదు’’ అన్నారు ఆకాంక్షా సింగ్. కబీర్ దుహాన్ సింగ్, కార్తీక్, రామారావు, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు
‘బలం ఉందన ్న అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ అనే డైలాగులతో ప్రారంభమైన ‘పహిల్వాన్’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఈ సినిమాను అదే పేరుతో వారాహి చలన చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. సెప్టెంబర్ 12న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. చిరంజీవిగారు ఇటీవల విడుదల చేసిన ‘పహిల్వాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం విడుదలైన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ‘‘కె.జి.యఫ్’ని తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం అందుకున్న వారాహి చలన చిత్రం సంస్థ ఇప్పుడు ‘పహిల్వాన్’ను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: కరుణాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. దేవరాజ్. -
శాండల్‌వుడ్‌కు షాక్.. పెద్దమొత్తంలో బంగారం, నగదు
శాండల్‌వుడ్‌ను శాసిస్తున్న నలుగురు హీరోలు, అందులో ఇద్దరు అన్నదమ్ములు, మరో ముగ్గురు నిర్మాతలు.. గురువారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐటీ అధికారులు ఉరుములేని పిడుగులా ఊడిపడే వరకు ఏం జరగబోతోందో అర్థం కానంత గుట్టుగా ఐటీ శాఖ ఆపరేషన్ చేపట్టింది. హీరోల ఇళ్లల్లో రాత్రి పొద్దుపోయేవరకు సోదాలు సాగాయి. తదుపరి పరిణామాలేమిటో అని శాండల్‌వుడ్ హీరోల అభిమానుల్లో కలవరం నెలకొంది. సాక్షి,బెంగళూరు: రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన ఐటీ శాఖ రూటు మార్చి శాండల్‌వుడ్‌పై భారీ దాడులకు నాంది పలికింది. ప్రముఖ హీరోలు శివరాజ్‌కుమార్, ఆయన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తాజా హిట్ మూవీ కేజీఎఫ్ హీరో యశ్, మరో సీనియర్ హీరో కిచ్చ సుదీప్‌ల నివాసాలు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచే దాడులు చేపట్టారు. శాండల్‌వుడ్ నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, విజయ్ కిరంగదూరు, డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం, వాటి కలెక్షన్లు, పన్ను ఎగవేత అనుమానాల వల్లే ఐటీ అధికారులు సోదాలకు పాల్పడినట్లు శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. బుధవారమే సెర్చ్ వారంట్ సోదాల నిమిత్తం బుధవారమే కోర్టు నుంచి ఐటీ అధికారులు సెర్చ్ వారంట్ తెచ్చుకున్నారు. 15 రోజుల క్రితమే బెంగళూరు, పణజి, చెన్నై, హైదరాబాద్, అమరావతితదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 200 మంది ఐటీ అధికారులు ఈ దాడులకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎక్కడా కూడా ఈ విషయం లీక్ కాకుండా పక్బందీ ప్రణాళికలు రచించారు. అనూహ్య దాడులతో సినీరంగంలో గుబులు నెలకొంది. పునీత్ రాజ్‌కుమార్ నివాసంలో సదాశివనగరలోని పునీత్ రాజ్‌కుమార్ నివాసంపై సోదాలు జరిపి కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తెలిసింది. ఇటీవల పునీత్ రాజ్‌కుమార్ నటించిన అన్ని చిత్రాలు దాదాపుగా విజయవంతం అయ్యాయి. దీనికితోడు ఆయన పీఆర్కే అనే ఆడియో కంపెనీ కూడా ప్రారంభించారు. కొద్ది రోజుల్లో నటసార్వభౌమ అనే చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోదాల సమయంలో భారీగా వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు లభించినట్లు ఈ నేపథ్యంలో వాటిని లెక్క గట్టేందుకు ముగ్గురు బంగారు పరిశోధకులను పిలిపించారు. సుమారు నలుగురు అధికారులు బృందం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు పునీత్ సమాధానాలిచ్చారు. శివరాజ్‌కుమార్ నివాసంలో మాన్యత టెక్‌పార్కు సమీపంలోని శివరాజ్‌కుమార్ ఇంటిలో సోదాలు జరిపారు. ఒక మహిళా అధికారి చేత శివరాజ్‌కుమార్ సతీమణి గీతను కూడా విచారించినట్లు తెలిసింది. ఉదయం 8 గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి. ఆరుగురు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సంభావనే, విలన్ చిత్రాలకు సంబంధించిన వివరాలు అధికారులు తెలుసుకున్నారు. యశ్, భార్య, బంధువుల ఇళ్లలో కేజీఎఫ్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన యశ్‌కు చెందిన నాగరభావిలోని నివాసంపై, కత్రిగుప్పేలో ఉన్న మరో ఇంటిపై కూడా సోదాలు చేశారు. ఆయన సోదరి, మామ ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించారు. యశ్ మామను అధికారులు రహస్య ప్రాంతానికి కారులో తీసుకెళ్లి మరీ విచారణ చేపట్టారు. యశ్ సతీమణి రాధిక పండిత్‌కు చెందిన గాయత్రి నగర్ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఎన్జీఈఎఫ్లోని ఆ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ ఇళ్లలోనూ గాలింపు జరిపారు. ముంబయి నుంచి యశ్ రాక తాను నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రమోషన్లో భాగంగా ముంబై వెళ్లిన యశ్.. ఐటీ సోదాల విషయం తెలుసుకుని హుటాహుటినా బెంగళూరుకు చేరుకున్నారు. సోదాలు వల్ల తన ఇంట్లో ఫోన్లు అన్నింటిని అధికారులు స్విచ్ఛాఫ్ చేశారు. ఇంట్లో పరిస్థితి ఏంటో ఎలా ఉందో కూడా తనకు తెలియదని చెప్పారు. టీవీల ద్వారానే తన ఇంట్లో ఐటీ అధికారులు దాడి చేసినట్లు తెలుసుకున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ చట్టానికి తలొంచాల్సిందేనని తెలిపారు. మైసూరు నుంచి సుదీప్ మైసూరు నుంచి షూటింగ్‌ను రద్దు చేసుకుని వచ్చి న సుదీప్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాం టి తప్పు చేయలేదని తెలిపారు. తనపై వ్యక్తిగత కక్షతో ఎవరూ దాడులు చేయడం లేదని, కేవలం మూడు సినిమాలకు సంబంధించి మాత్రమే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. నిర్మాతల నివాసాల్లో = నగరంలోని మహాలక్ష్మి లేఔట్లో ఉన్న బడా నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంటిని, కారును కూడా క్షుణ్ణంగా వెతికారు. 8 మంది అధికారుల బృందం ఆయనను ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన ఇంట్లో లభించిన బంగారాన్ని కొలిచేందుకు ప్రత్యేకంగా తూక పరికరాన్ని తెప్పించారు. ఆయన సతీమణి, కుమారుడు, కోడలు, మనమవళ్లను కూడా ప్రశ్నించారు. = చిత్ర నిర్మాత, జేడీఎస్ ఎమ్మెల్సీ సీఆర్ మనో హర్ ఇళ్లు, ఆఫీసులపై సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. =జేపీ నగరలోని సుదీప్ ఇంట్లో అధికారులు ఉదయం 8 గంటల నుంచి సోదాలు చేశారు. ఆ సమయంలో సుదీప్ మైసూరులో సినిమా షూటింగ్లో ఉన్నారు. అధికారులు సూచనల మేరకు హుటాహుటిన మైసూరు నుంచి తిరిగి వచ్చారు. ఆయన నివాసంలో పలు రికార్డులు, బ్యాంకు స్టేట్మెంట్ల వివరాలను పరిశీలించారు. -
దసరాకు విలన్
రెండున్నరేళ్ల క్రితం ‘ది విలన్’ సినిమా కోసం కొబ్బరికాయ కొట్టారు టీమ్. ఇందులోని యాక్టర్స్ డేట్స్ కుదరకపోవడం, అమీ జాక్సన్ విసా ప్రాబ్లమ్, వర్షం తాకిడికి లొకేషన్లో ఇబ్బంది కలగడం వంటి కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దీంతో రిలీజ్ డేట్ విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌లు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉప శీర్షిక. సీఆర్ మనోహర్ నిర్మించారు. శ్రీకాంత్, మిధున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు ప్రేమ్ పేర్కొన్నారు. ‘‘కన్నడ, తెలుగు, తమిళం భాషల్లో అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయబోతున్నాం. సహకరించిన టీమ్‌కి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ప్రేమ్. యాక్టర్ కావాలని కలలు కనే ఓ పల్లెటూరి యువకుడి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని శాండిల్‌వుడ్ టాక్. -
అవుకు రాజు అండీ... అవుకు రాజు
ఎవరీ అవుకు రాజు? ఏమా కథ? అంటే.. మరెవరో కాదు.. ఆయన అభినయ చక్రవర్తి. అబ్బా.. అవుకు రాజు ఎవరో తెలియదు.. మళ్లీ అభినయ చక్రవర్తి అని కొత్త ట్విస్ట్ ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. అభినయ చక్రవర్తి అంటే కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్ సుదీప్. అవుకు రాజు కూడా ఆయనే. సుదీప్ పుట్టినరోజు నేడు. కన్నడ చిత్ర సీమలో అభిమానులంతా ఆయన్ను ముద్దుగా అభినయ చక్రవర్తి అని పిలుస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘సైరా’లో ఆయన అవుకు రాజు పాత్ర చేస్తున్నారు. చిరంజీవి టైటిల్ రోల్లో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యుద్ధ సన్నివేశానికి సంబంధించినట్లుగా ఉన్న ఈ స్టిల్‌లో అవుకు రాజుతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిటిష్ సైన్యం కనిపిస్తోంది కదూ. సో.. అవుకు రాజు బ్రిటిష్ వైపు అని అర్థం చేసుకోవచ్చేమో. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ‘సైరా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది స్వరకర్త, రత్నవేలు ఛాయాగ్రాహకుడు. -
అరవైలో ఇరవైలా..
అరవై ఏళ్ల వయసులో ఓ యాక్షన్ స్టంట్‌ను సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేయడం అంటే మాములు విషయం కాదు. కానీ ఈజీగా చేశారట కన్నడ నటుడు అంబరీష్. గురు దత్తా దర్శకునిగా పరిచయం అవుతున్న కన్నడ చిత్రం ‘అంబి నింగ్ వయసాయతో’. తమిళ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పవర్ పాండి’ సినిమాకు రీమేక్ ఇది. ‘అంబి నింగ్ వయసాయతో’ చిత్రంలో అంబరీష్‌కు జోడీగా సుహాసిని నటించారు. ఓ కీలక పాత్రను సుదీప్ చేశారు. ‘‘ఇందులో రిటైర్డ్ స్టంట్ డైరెక్టర్‌గా అంబరీష్ సార్ నటించారు. సినిమాలో ఓ యాక్షన్ స్టంట్‌ను డూప్ లేకుండా చేశారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ లెవల్స్ చూసి షాక్ అయ్యాను’’ అన్నారు డైరెక్టర్ గురు దత్తా. 60లో 20 ఏళ్ల కుర్రాడిలా అంబరీష్ ఫైట్ చేయడం యూనిట్లో ఇతర సభ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కొత్త లుక్‌ను అంబరీష్ సతీమణి, నటి సుమలత రిలీజ్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. -
అమీ ఆగయా
‘ది విలన్’ సినిమా కోసం బెంగళూరులో ల్యాండ్ అయ్యారు హీరోయిన్ అమీ జాక్సన్. ప్రేమ్ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, సుదీప్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న కన్నడ సినిమా ‘ది విలన్’. శ్రీకాంత్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీకాంత్‌ది విలన్ రోల్ అని సమాచారం. మిథున్ చక్రవర్తికి కన్నడంలో ఇది తొలి చిత్రం. ఇటీవలే ఇద్దరు హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్‌లకు వేరు వేరుగా టీజర్స్‌ను కట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోన్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు అమీ జాక్సన్. సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
దబాంగ్ 3లో...
‘దబాంగ్’ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్లో పెద్ద హిట్స్‌లో ఒకటి. ఆల్రెడీ ఈ సినిమాకి ఓ సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో భాగం రూపొందించే పనిలో పడ్డారు హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవా. మూడో భాగాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు ప్రభుదేవా. అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. సుదీప్‌కు బాలీవుడ్లో యాక్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘ఫూంక్’తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు సుదీప్. ఆ తర్వాత ‘ఫూంక్ 2, రక్త చరిత్ర’ సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని పలకరించారు. ఇప్పుడు ‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఆడియన్స్‌కు మరోసారి హాయ్ చెప్పనున్నారీ కన్నడ స్టార్ హీరో. ఇందులో సుదీప్ది విలన్ క్యారెక్టర్ అని సమాచారం. -
సదరన్ స్పైస్ 15th July 2018
-
‘సైరా’కి సిద్ధం
‘‘సినిమా నా మీద ఎప్పుడూ ప్రేమనే చూపిస్తుంది. రెగ్యులర్‌గా నా జర్నీలోకి సర్ప్రైజులు ప్లాన్ చేస్తుంది. వాటిలో ‘సైరా’లో లెజెండ్ చిరంజీవిగారితో యాక్ట్ చేయడం ఒకటి’’ అంటున్నారు కన్నడ నటుడు, ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్‌సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘సైరా’లో యాక్ట్ చేయడం, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి సుదీప్ మాట్లాడుతూ – ‘‘సైరా’ నా ఫస్ట్ హిస్టారికల్ పిక్చర్. చాలా ఎగై్జటెడ్‌గా, అదే సమయంలో కొంచెం వర్రీగా ఉన్నాను’’ అన్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. -
రాముడా? రావణుడా?
రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి కన్నడలో ‘ది విలన్’ సినిమా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టి. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే టైమ్ వచ్చింది. ఆల్రెడీ టాకీపార్ట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీమ్ ప్రజెంట్ సాంగ్స్‌ను షూట్ చేసే పనిలో పడింది. శివరాజ్‌కుమార్, సుదీప్, అమీజాక్సన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘ది విలన్’. రామ్ ఆర్ రావణ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి కీలక పాత్రలు చేస్తున్నారు. రీసెంట్గా హీరో శివరాజ్ కుమార్‌పై ఓ మాస్ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ సాంగ్‌తో ఈ సినిమాలో శివరాజ్‌కుమార్ వంతు చిత్రీకరణ పూర్తయ్యింది. ‘‘శివన్న డ్యాన్సింగ్ ఎనర్జీ సూపర్. నగేశ్ మాస్టర్ కంపోజ్ చేశారు’’ అన్నారు దర్శకుడు ప్రేమ్. ఆల్రెడీ హీరోల లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నెల 28న టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
న్యూయార్క్‌లో ఎన్నారైగా.. హాలీవుడ్ వెళ్తున్నాడీ హీరో!
తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువమంది సుదీప్‌ను ‘ఈగ’ విలన్‌గానే గుర్తుపడతారు. కానీ, కన్నడంలో అతనో పెద్ద స్టార్ హీరో. డైరెక్టర్ కూడా. ఆస్ట్రేలియన్ ఫిల్మ్‌మేకర్ ఎడ్డీ తీస్తున్న హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌లో సుదీప్ ఓ క్యారెక్టర్ చేయనున్నారు. ఈ న్యూస్ ఎప్పుడో బయటకొచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... అందులో సుదీప్ న్యూయార్క్‌లో నివసించే ఎన్నారైగా కనిపించనున్నారు. రీసెంట్గా ఎడ్డీ ఇండియా వచ్చారు. డైరెక్టుగా బెంగళూరు వెళ్లి, సుదీప్‌ను కలిశారు. మాక్ టెస్ట్ చేశారు! అంటే... సినిమాలో సుదీప్ కనిపించబోయే గెటప్ టెస్ట్ షూట్ చేశారన్న మాట! ఫస్ట్ లుక్ కోసం కొన్ని స్టిల్స్ తీసుకున్నారు. త్వరలోనే సుదీప్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట! అలాగే, త్వరలో ఈ సినిమా షూటింగ్ కోసం సుదీప్ న్యూయార్క్ వెళ్లనున్నారు. సినిమాలో సుదీప్‌కి ఇంపార్టెంట్ క్యారెక్టరే వచ్చినట్టుంది. ఎందుకంటే... ట్రైలర్లోనూ ఈ హీరో కనిపిస్తారని ఎడ్డీ తెలిపారు. -
ఈగ విలన్‌తో వర్మ సినిమా
హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చినా రామ్ గోపాల్ వర్మ సౌత్ ఇండస్ట్రీని మాత్రం వదిలిపెట్టడం లేదు. కొంత కాలంగా బాలీవుడ్‌ను వదిలిపెట్టి సౌత్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ జీనియస్, ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టాడు. అయితే ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసిన వర్మ, వరుసగా సౌత్ సినిమాలనే ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో విజయవాడ రాజకీయాల నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. తన మార్క్ వివాదాలతో తెర మీదకు వస్తున్న వంగవీటి సినిమా తరువాత కూడా మరో సౌత్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వీరప్పన్ సినిమాతో శాండల్ వుడ్లో అడుగుపెట్టిన వర్మ మరో కన్నడ సినిమాకు రెడీ అవుతున్నాడు. రాయ్ పేరుతో రూపొందనున్న ఈ సినిమాతో కర్ణాటక మాఫియ నాయకుడు ముత్తప్ప రాయ్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడు. కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అతడికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. -
పవన్‌కి నచ్చిన మల్లూవుడ్ నటుడు