
సుదీప్
‘దబాంగ్’ చిత్రం సల్మాన్ ఖాన్ కెరీర్‌లో పెద్ద హిట్స్‌లో ఒకటి. ఆల్రెడీ ఈ సినిమాకి ఓ సీక్వెల్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో భాగం రూపొందించే పనిలో పడ్డారు హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు ప్రభుదేవా. మూడో భాగాన్ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు ప్రభుదేవా. అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్‌ను తీసుకోవాలనుకుంటున్నారట.
సుదీప్‌కు బాలీవుడ్‌లో యాక్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘ఫూంక్’తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు సుదీప్. ఆ తర్వాత ‘ఫూంక్ 2, రక్త చరిత్ర’ సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని పలకరించారు. ఇప్పుడు ‘దబాంగ్ 3’తో బాలీవుడ్ ఆడియన్స్‌కు మరోసారి హాయ్ చెప్పనున్నారీ కన్నడ స్టార్ హీరో. ఇందులో సుదీప్‌ది విలన్ క్యారెక్టర్ అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment