
సుదీప్
‘‘సినిమా నా మీద ఎప్పుడూ ప్రేమనే చూపిస్తుంది. రెగ్యులర్‌గా నా జర్నీలోకి సర్‌ప్రైజులు ప్లాన్ చేస్తుంది. వాటిలో ‘సైరా’లో లెజెండ్ చిరంజీవిగారితో యాక్ట్ చేయడం ఒకటి’’ అంటున్నారు కన్నడ నటుడు, ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్‌సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘సైరా’లో యాక్ట్ చేయడం, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి సుదీప్ మాట్లాడుతూ – ‘‘సైరా’ నా ఫస్ట్ హిస్టారికల్ పిక్చర్. చాలా ఎగై్జటెడ్‌గా, అదే సమయంలో కొంచెం వర్రీగా ఉన్నాను’’ అన్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment