ఈగ విలన్తో వర్మ సినిమా | Ram gopal varma movie with eega fame sudheep | Sakshi
Sakshi News home page

ఈగ విలన్తో వర్మ సినిమా

Published Thu, Feb 25 2016 1:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

ఈగ విలన్తో వర్మ సినిమా

ఈగ విలన్తో వర్మ సినిమా

హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చినా  రామ్ గోపాల్ వర్మ సౌత్ ఇండస్ట్రీని మాత్రం వదిలిపెట్టడం లేదు. కొంత కాలంగా బాలీవుడ్ను వదిలిపెట్టి సౌత్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ జీనియస్, ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టాడు. అయితే ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసిన వర్మ, వరుసగా సౌత్ సినిమాలనే ప్రకటిస్తున్నాడు.

ప్రస్తుతం తెలుగులో విజయవాడ రాజకీయాల నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. తన మార్క్ వివాదాలతో తెర మీదకు వస్తున్న వంగవీటి సినిమా తరువాత కూడా మరో సౌత్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వీరప్పన్ సినిమాతో శాండల్ వుడ్లో అడుగుపెట్టిన వర్మ మరో కన్నడ సినిమాకు రెడీ అవుతున్నాడు.

రాయ్ పేరుతో రూపొందనున్న ఈ సినిమాతో కర్ణాటక మాఫియ నాయకుడు ముత్తప్ప రాయ్ జీవితాన్ని తెరకెక్కించనున్నాడు. కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అతడికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement