వంగవీటి వేడుకలో బాహుబలి టీం | Rajamouli And Prabhas to Attend Vangaveeti Function | Sakshi
Sakshi News home page

వంగవీటి వేడుకలో బాహుబలి టీం

Published Tue, Dec 20 2016 2:11 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

వంగవీటి వేడుకలో బాహుబలి టీం - Sakshi

వంగవీటి వేడుకలో బాహుబలి టీం

ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్కు రెడీ అవుతున్న చిత్రాల్లో అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకున్న సినిమా వంగవీటి. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు టాలీవుడ్ బాలీవుడ్ అతిరథమహారథులు హాజరవుతున్నారు. చాలా రోజుల క్రితమే నాగార్జున, అమితాబ్లు హాజరవుతారని ప్రకటించగా.. తాజాగా బాహుబలి టీం కూడా ఈ వేదిక మీద కనిపించనుందని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న వంగవీటి సినిమాఈవెంట్కు దర్శకుడు రాజమౌళితో పాటు హీరో ప్రభాస్ కూడా హాజరవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా తన చివరి తెలుగు చిత్రం అంటూ ప్రకటించాడు వర్మ. అంతేకాదు ప్రచారం విషయంలో కూడా నిజంగా ఇది చివరి చిత్రమే అనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన  ఏ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించలేదు. ఆడియో రిలీజ్ లాంటి కార్యక్రమాలు చేసిన పెద్దగా ఫిలిం సెలబ్రిటీలు కనిపించరు. కానీ వంగవీటి చిత్రానికి ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేసిన వర్మ టీం.. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement