వంగవీటి సినిమాలో ఆ డైలాగ్ కట్ చేశారు | Champey Rangaa Dialogue Removed From Rgv Vangaveeti | Sakshi
Sakshi News home page

వంగవీటి సినిమాలో ఆ డైలాగ్ కట్ చేశారు

Published Sun, Dec 25 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

వంగవీటి సినిమాలో ఆ డైలాగ్ కట్ చేశారు

వంగవీటి సినిమాలో ఆ డైలాగ్ కట్ చేశారు

విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ముందునుంచి ఉన్న హైప్ కారణంగా మంచి వసూళ్లను సాధిస్తోంది. అయితే రిలీజ్కు ముందు నుంచే ఎన్నో వివాదాలను సృష్టించిన వంగవీటి సినిమాపై రిలీజ్ తరువాత కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వంగవీటి కుటుంబ సభ్యులు సినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్లు ఉన్నాయంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు  చేశారు.

గతంలో ఏ సినిమా విషయంలో కూడా వెనక్కి తగ్గని వర్మ, వంగవీటి విషయంలో మాత్రం కాస్త తగ్గేందుకు ఓకే చెప్పాడు. సినిమా రిలీజ్కు ముందే కమ్మ.. కాపు అనే పాటను తీసేసిన వర్మ.. తాజాగా సినిమాలో వంగవీటి రత్నకుమారి  చెప్పే 'చంపేయ్ రంగా' అనే డైలాగ్ను కట్ చేసేందుకు అంగీకరించాడు. ఆదివారం నుంచి థియేటర్లలో ఈ డైలాగ్ వినిపించదు. ప్రస్తుతానికి ప్రశాంతంగానే కనిపిస్తున్నా.., వర్మ సృష్టించిన వంగవీటి వివాదం ఎటు దారి తీస్తుందో అని సినీ, రాజకీయా వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement