అప్పటి నుంచే క్రేజ్‌ మొదలైంది! | Ram Gopal Varma Vangaveeti Movie Censor Report “A” Certificate | Sakshi
Sakshi News home page

అప్పటి నుంచే క్రేజ్‌ మొదలైంది!

Published Sat, Dec 17 2016 11:16 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అప్పటి నుంచే క్రేజ్‌ మొదలైంది! - Sakshi

అప్పటి నుంచే క్రేజ్‌ మొదలైంది!

‘వంగవీటి’ చిత్రం అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఎంతో క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ అన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. దాసరి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 20న హైదరాబాద్‌లో భారీ వేడుక నిర్వహించనున్నాం.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ ఫ్యాన్సీ రేటు చెల్లించి ఈ చిత్రం నైజాం హక్కులను సొంతం చేసుకుని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విస్సు, సహ నిర్మాత: సుధీర్‌ చంద్ర పడిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement