వంగవీటి వేడుకకు నాగ్, అమితాబ్ | Nagarjuna, Amithab to grace Vangaveeti Pre release Function | Sakshi
Sakshi News home page

వంగవీటి వేడుకకు నాగ్, అమితాబ్

Published Fri, Dec 9 2016 1:36 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

వంగవీటి వేడుకకు నాగ్, అమితాబ్ - Sakshi

వంగవీటి వేడుకకు నాగ్, అమితాబ్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ సినిమా వంగవీటి విషయంలో పట్టు వీడటం లేదు. విజయవాడ హత్యారాజకీయాల నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిలీజ్ చేస్తానంటూ చెపుతున్నాడు. ఇప్పటికే సినిమాలో ప్రధాన పాత్రలైన వంగవీటి, దేవినేని కుంటుంబాలను కలిసిన వర్మ, విజయవాడ వేదికగా ఆడియో వేడుకను ఘనం నిర్వహించాడు. అయితే అదే సమయంలో కొంత మంది పెద్ద మనుషుల నుంచి సినిమా విడుదలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శలు చేశాడు.

ఈ నెల 23న రిలీజ్ కు రెడీ అవుతున్న వంగవీటి సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ను ప్లాన్ చేస్తున్నాడు వర్మ. డిసెంబర్ 20న హైదరాబాద్ వేదికగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాదు ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇంత వివాదాస్పదమైన సినిమా ఫంక్షన్లో ఈ స్టార్ హీరోలు పాల్గొంటారా..? ఒకవేళ పాల్గొన్నా సినిమాకు సంబంధించి ఏం మాట్లాడతారు..? అన్నది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement