సర్కార్‌... శివలతో వంగవీటి | Amitabh Bachchan, Nagarjuna to attend Ram Gopal Varma's Vangaveeti event. | Sakshi
Sakshi News home page

సర్కార్‌... శివలతో వంగవీటి

Published Fri, Dec 9 2016 11:18 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

సర్కార్‌... శివలతో వంగవీటి - Sakshi

సర్కార్‌... శివలతో వంగవీటి

దర్శకుడిగా రామ్‌గోపాల్‌ వర్మ ప్రయాణం ‘శివ’ చిత్రంతో ప్రారంభమైంది. బలమైన పునాది పడడంతో వెనుదిరిగి చూసుకోలేదు. ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్‌’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో హిందీలోనూ హిట్స్‌ అందుకున్నారాయన. దర్శక–నిర్మాతగా ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్ని చిత్రాలు తీసినా... దర్శకత్వం వైపు అడుగులు పడడానికి కారణమైన విజయవాడ సంఘటన నేపథ్యంలో ఓ చిత్రం తీయాలనే ఆకాంక్ష వర్మలో ఎప్పటి నుంచో ఉంది. ‘వంగవీటి’తో అది తీరింది. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజవుతోంది.

ఈ సందర్భంగా ఈ నెల 20న ‘శివ టు వంగవీటి’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ‘‘ఇటీవల విజయవాడలో రిలీజ్‌ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అమితాబ్‌ ఓ తెలుగు సినిమా వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు వర్మ తొలి చిత్ర కథానాయకుడు నాగార్జున రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విస్సు, సహ నిర్మాత: సుధీర్‌ చంద్ర పడిరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement