24తో వస్తున్న సూర్య | surya next film title name 24 | Sakshi
Sakshi News home page

24తో వస్తున్న సూర్య

Published Thu, Nov 13 2014 1:38 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

24తో వస్తున్న సూర్య - Sakshi

24తో వస్తున్న సూర్య

నటుడు సూర్య 24తో వస్తానంటున్నారు. ఏమిటి అర్థం కాలేదా? సూర్య తదుపరి చిత్ర టైటిల్ ఇదే. అంజాన్ చిత్రం నిరాశపరచినా ప్రస్తుతం మాస్ చిత్రంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు సూర్య. ఈ చిత్రంలో నయనతార, ఎమిజాక్సన్ అంటూ ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్న సూర్యను దర్శకుడు వెంకట్ ప్రభు చాలా డిఫరెంట్‌గా చూపిస్తున్నారట. మాస్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా సూర్య వేగాన్ని పెంచేశారు. చిత్రం తరువాత చిత్రం అంగీకరించే ఈయన ఈసారి ఏకంగా మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

వాటిలో మలయాళ దర్శకుడు విక్రమన్ కెకుమార్, పి.రంజిత్, హరి చిత్రాలున్నాయి. మాస్ చిత్రం తరువాత సూర్య విక్రమన్ కె.కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవల తెలుగులో మనం అనే సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చిన విక్రమన్ కె.కుమార్ సూర్య కోసం సూపర్ కథను వండుతున్నారట. ఈ చిత్రానికి 24 అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలందించడానికి రెడీ అవుతున్నారు. చిల్లును ఒరు కాదల్ చిత్రం తరువాత సూర్య ఏఆర్ రెహ్మాన్ కలయిక లో తెరకెక్కనున్న చిత్రం 24 . అయితే ఈ చిత్రంలో సూర్యకు జంటగా నటించే ఆ లక్కీ హీరోయిన్ ఎవరన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారుు యూనిట్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement