పది రోజుల్లో 150 కోట్లు వసూలు చేసిన 'గుడ్ న్యూజ్' మూవీ | AkshayKumar 'Good newwz' movie is breaking box office records - Sakshi
Sakshi News home page

పది రోజుల్లో రూ. 150 కోట్లు

Published Mon, Jan 6 2020 10:38 AM | Last Updated on Mon, Jan 6 2020 11:30 AM

Akshay Kumars Good Newwz Is Unstoppable At The Box Office - Sakshi

ముంబై : ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌ల గుడ్‌న్యూస్‌ మూవీ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ దబంగ్‌ 3 నుంచి పోటీ ఎదురైనా పదిరోజుల్లో ఈ మూవీ రూ. 150 కోట్లకు చేరువై నిర్మాతలకు గుడ్‌న్యూస్‌ పంచింది. 2019లో చివరి మూవీగా విడుదలైన ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది. తొలి వారాంతంలో రూ. 65.99 కోట్లు రాబట్టిన గుడ్‌న్యూస్‌ రెండోవారంలో శుక్రవారం వరకూ రూ. 136 కోట్లు ఆర్జించింది. ఇక శనివారం రూ. 11.70 కోట్లు వసూలు చేసి రూ. 150 కోట్ల మార్క్‌కు చేరువైంది. దిల్జిత్‌ దొసాంజ్‌, కియారా అద్వానీ ఇతర ప్రధాన పాత్రలతో దర్శకుడు రాజ్‌ మెహతా తెరకెక్కించిన గుడ్‌న్యూస్‌ మూవీ ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement