
బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగన్ తాజా చిత్రం తాన్హాజీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగన్ తాజా బ్లాక్‌బస్టర్‌తో జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన తాన్హాజీ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూ ఇప్పటికే రూ 250 కోట్ల వసూళ్లతో అదరగొడుతోంది. తాన్హాజీ ప్రదర్శిస్తున్న థియేటర్లు ఇంకా హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండటంతో ఈ మూవీ లైఫ్‌టైమ్ వసూళ్లు రికార్డు స్ధాయిలో ఉంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర సినిమాల నుంచి పోటీ ఎదురైన తాన్హాజీ బాక్సాఫీస్ దూకుడు కొనసాగుతోందని, నాలుగో వారంలో రూ 275 కోట్ల మార్క్ దాటుతుందని ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2020లో రూ 250 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి బాలీవుడ్ మూవీ తాన్హాజీ కావడం గమనార్హం.