
తమిళసినిమా: హీరోలు జిగేల్ మనే దుస్తులు ధరిస్తే అబ్బా బాగుంది కదా అంటాం. అదే హీరోయిన్లు ధరిస్తే వావ్ అదుర్స్ అంటాం. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్రాల్లో ఆహా అంటూ అబ్బుర పరచే అంశాలు చాలానే ఉంటాయి. శంకర్ చిత్రాల్లో సన్నివేశాలు గ్రాండ్‌గానూ, పాటలు రసరమ్యంగా, లొకేషన్ సుందరంగా ఉంటాయి. ఇక హీరోహీరోయిన్ల డ్రస్ అదుర్స్ అనిపించేలా ఉంటాయి. ఆయన చిత్రీకరణలో కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారీ తనం గురించి ఇక చెప్పనక్కర్లేదు.
టోటల్‌గా బ్రహ్మాండానికి మారు పేరు శంకర్ చిత్రాలు అంటారు. తాజాగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.ఓ చిత్రంలోనూ ఇలాంటి కనువిందు చేసే అంశాలు చాలానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శంకర్ ఇంతకు ముందు తెరకెక్కించిన చిత్రాలన్నిటి కంటే భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న చిత్రం 2.ఓ. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఎమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్‌స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా విజృంభించనున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇతర హంగులు దిద్దుకుంటోంది.
2.ఓ చిత్రం కోసం ఒక్క పాటను చిత్రీకరించాల్సి ఉంది.ఆ పాటను త్వరలోనే బ్రహ్మాండంగా చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాటలో రజనీకాంత్, ఎమీజాక్సన్ ధరించే దుస్తులను రెడీ చేస్తున్నారు. తనకోసం సిద్ధం చేసిన దుస్తులు ట్రైల్ వేసి చూసుకోవడానికి నటి ఎమీజాక్సన్ ఇటీవల చెన్నైకి వచ్చింది. ఆ డ్రస్ చూడగానే వావ్ అదుర్స్ అంటూ అచ్చెరువు చెందిందట.
దటీజ్ శంకర్ అందుకే ఆయన చిత్రాలు అంత గ్రాండ్‌గా ఉంటాయని దర్శకుడిని పొగడ్తల్లో ముంచేసిందట. అంతేకాదు ఆ డ్రస్ ధరించి చూసుకుని తెగ ముచ్చట పడిపోయిందట. ఆ అదిరేటి డ్రస్‌తో ఎప్పుడెప్పుడు –2.ఓ చిత్ర పాటలో నటించేద్దామా అని తహతహలాడుతోందట. ఇక ఎమీని ఆ డ్రస్‌లో చూసి కుర్రకారు ఎంతగా కిర్రెక్కిపోతారో. జనవరిలో ఈ చిత్రం తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment