
అవును.. రజనీకాంత్ ‘2.0’లో అక్షయ్ కుమార్ విలన్ కాదట. మరి.. లుక్ చూస్తే దయా దాక్షిణ్యాలు లేకుండా అడ్డం వచ్చినవాళ్లను కిరాతకంగా చంపేసేలా కనిపిస్తున్నాడు కదా అనే డౌట్ రావొచ్చు. అలా సందేహించడం తప్పు కాదు. అయితే అసలు విషయం ఏంటంటే.. అక్షయ్‌ది ‘యాంటీ హీరో’ రోల్. అంటే.. మంచి కోసం చెడు చేస్తారు కదా? ఆ టైప్ అన్నమాట. సినిమా చూసేటప్పుడు మనం డా. రిచర్డ్ (సినిమాలో అక్షయ్ కుమార్ పాత్ర పేరు) పాయింటాఫ్ వ్యూలో ఆలోచిస్తే, అతను చేసేవన్నీ కరెక్ట్‌గానే అనిపిస్తాయట.
పర్యావరణానికి హాని కలిగించే టెక్నాలజీని అంతం చేయాలనుకుంటాడట రిచర్డ్. పైగా అతను ఏ హక్కుల కోసం పోరాడతాడో అవన్నీ సమంజసంగానే ఉంటాయట. ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు హీరోతో పాటు యాంటీ–హీరో కూడా గెలవాలనుకుంటాం. కానీ, ఫైనల్‌గా గెలిచేది హీరోనే కదా. మరి.. ఈ హీరో–యాంటీ హీరో రోల్స్‌ని చిత్రదర్శకుడు శంకర్ ఎలా డీల్ చేసి ఉంటారన్నది ఆసక్తికరం. ఇప్పటికే అక్షయ్ లుక్ బయటికొచ్చింది. గురువారం మరో ఫొటో రిలీజైంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ఫొటోయే.
జనవరిలో ‘2.0’ని విడుదల చేయాలనుకుంటున్నారు. వాయిదా పడిందని రెండు –మూడు రోజులుగా వార్తలొస్తున్నాయి. మరి.. జనవరిలో వస్తుందా? వెయిట్ అండ్ సీ. అన్నట్లు... ఈ పాత్రకు ముందు అక్షయ్ పాత్రకు ముందు కమల్‌హాసన్‌ని తీసుకున్నారు. నటుడిగా ఆయనకున్న పేరుని దృష్టిలో పెట్టుకుని యాంటీ హీరో రోల్‌ని పాజిటివ్ షేడ్స్‌తోనే రాశారట. ఆ తర్వాత అక్షయ్ సీన్లోకి వచ్చారు. అక్షయ్‌కి ఉన్న పేరు కూడా తక్కువేం కాదు. అందుకే అవుట్ అండ్ అవుట్ విలన్‌గా చూపించాలనుకోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment