చంద్రయాన్‌-3 పై సినిమా.. ఫస్ట్‌ ఛాయిస్ ఆ హీరోనే | Netizens Along With Akshay Kumar Fans Demanding Biopic On Chandrayaan 3 Moon Mission, Deets Inside - Sakshi
Sakshi News home page

Movie On Chandrayaan 3: చంద్రయాన్‌-3 పై సినిమా.. ఫస్ట్‌ ఛాయిస్ ఆ హీరోనే

Published Thu, Aug 24 2023 8:16 AM | Last Updated on Thu, Aug 24 2023 9:08 AM

Chandrayaan 3 Based A Movie Plan Akshaykumar - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. భారతీయులందరి గుండెల్లో ఆనందాలు నింపుతూ.. చంద్రయాన్‌-3 చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంటే.. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆనందంతో తిలకించారు. నేడు గర్వంగా భారతీయ జెండాను చం‍ద్రమండలంపై ఎగురువేశాం అనే ఆనందం వెనుక ఎంతో శ్రమతో పాటు కన్నీళ్లు,ఉద్వేగం ఇముడుకొని ఉన్నాయి. ఇదంతా ఒక సినిమాగా మన కళ్లుకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తే అది నిజంగా అద్భుతమే అని చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్)

గతంలో చంద్రయాన్‌-2 వైఫల్యాలను గుర్తుచేసుకుంటూ మన ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన చంద్రయాన్‌-3లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చంద్రుడి మీది విక్రమ్‌ ల్యాండర్‌  దిగింది. చంద్రయాన్‌-2 నుంచి చంద్రయాన్‌-3 విజయం వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా అదిగమించారో తెలుపుతూ ఒక సినిమాగా తీసి భారతీయులకు చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఆసక్తకరమైన సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా చంద్రయాన్ 3 బయోపిక్ తీయమని డిమాండ్ చేస్తున్నారు.

దేశంలో ఏదైనా సెన్సేషన్ సృష్టించిన ఘటన జరిగితే ఆ అంశంపై సినిమా తీయడం  మేకర్స్‌కు అలవాటే... బాలీవుడ్‌లో బయోపిక్ సినిమా తీయాలంటే మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్‌.... ఇప్పటికే ఆయన మిషన్ మంగల్, రామసేతు,కేసరి,OMG వంటి విభిన్న చిత్రాలతో మెప్పించాడు. దీంతో చంద్రయాన్‌-3 సినిమా తీస్తే ఆయన మాత్రమే న్యాయం చేయగలడని ఆయన ఫ్యాన్స్‌ తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో అక్షయ్ కుమార్‌కు మంచి అనుబంధమే ఉంది. అందులో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే చంద్రయాన్‌-3 విజయవంతం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ను అక్షయ్ తెరకెక్కిస్తారని పలువురు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement