'దర్శకత్వం చేసే ఉద్దేశం లేదు'
ముంబయి : బాలీవుడ్ ఇండస్ట్రీలో సరదాగా ఉంటూ రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. నటుడిగా, నిర్మాతగా ఉండటానికే తాను ఇష్టపడతానని చెప్పాడు. ఫేమస్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ చేసిన తన లేటెస్ట్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్ర యూనిట్ ఓ చాట్ సెషన్ నిర్వహించారు. ఓ అభిమాని సంధించిన ప్రశ్నకు అక్షయ్ ఆశ్చర్యానికి లోనయ్యాడట. దర్శకత్వం ఎప్పుడు చేస్తారని ఈ చాట్ సెషన్లో వచ్చిన ఓ ప్రశ్నకు బదులుగా.. నాకు దర్శకత్వ చేసే ఉద్దేశం లేదన్నాడు. తాను ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా సంతృప్తిగా ఉన్నానంటూ నవ్వేశాడు అక్షయ్. ఈ ఏడాది ఇది విడుదలవుతున్న తన నాలుగో మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' అన్నాడు.
ఈ మూవీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ అని అక్షయ్ చెప్పాడు. తన ప్రతి మూవీలోనూ ఏదో వైవిధ్యం అక్షయ్ ప్రదర్శిస్తానని ఈ ఏడాది విడుదలైన ఆయన మూవీలను చూస్తే అర్థమవుతుంది. తాను దర్శకత్వం వహించాలని అభిమానులు కోరుకుంటున్నందుకు వారికి ధన్యావాదాలు తెలిపాడు. ప్రభుదేవాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. మా కాంభినేషన్ ఎప్పుడూ సూపర్బ్. అతనికి ఏం కావాలో అదే తెరపై చూపిస్తాడంటూ ప్రభుదేవా గురించి చెప్పుకొచ్చాడు. 2012లో మా కాంబినేషన్లో 'రౌడీ రాథోడ్' మూవీ వచ్చిందని అక్షయ్ గుర్తుచేశాడు.