'కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నా' | I would like to set a trend, says Amy Jackson | Sakshi
Sakshi News home page

'కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నా'

Published Fri, Sep 18 2015 6:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నా' - Sakshi

'కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నా'

ముంబై : హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ మూవీలు కూడా చేయాలని నటి అమీ జాక్సన్ అభిప్రాయపడింది. యాక్షన్ సినియాలలో నటించడం హీరోలతో పాటు తమకు ఎంతో ముఖ్యమని, తనకు తాజాగా అటువంటి అవకాశం వచ్చిందని చెప్పింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'సింగ్ ఈజ్ బ్లింగ్' మూవీలో అతడికి జోడీగా అమీ చేస్తుంది. బాలీవుడ్లో గతంలో ఎన్నడు చూడని యాక్షన్ సన్నివేశాలను ఈ మూవీలో చూస్తారంటోంది ఈ ముద్దుగుమ్మ. 'ఐ' మూవీలో గ్లామర్ రోల్ పోషించిన ఈ భామ తన తాజా మూవీలో యాక్షన్ సీన్లలో కొన్ని స్టంట్స్ కూడా చేసిందట.

యాక్షన్ మూవీల్లో నటించడం తనకు చాలా ఇష్టమని, పాత ధోరణిలో హీరోయిన్ల పాత్రల్లో కనిపించడం తనకు ఇష్టం లేదన్నది. తాను కొత్త ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది. స్టార్ హీరో అక్షయ్ సరసన ఇంత త్వరగా అవకాశం వస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చింది. అక్షయ్ ని యాక్షన్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ మూవీలో నటించే అవకాశం వచ్చిందన్న విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని అమీ జాక్సన్ పేర్కొంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తోన్న కామెడీ, యాక్షన్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' వచ్చే నెలలో విడుదల కానుందన్న విషయం అభిమానులకు తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement