Singh Is Bliing
-
మూడు రోజుల్లో రూ. 54 కోట్ల కలెక్షన్లు
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' భారీ వసూళ్లను సాధిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో 54.44 కోట్ల రూపాయలు రాబట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ ప్రారంభ వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్, అమీ జాక్సన్, కే కే మీనన్, లారా దత్తా నటించారు. రౌడీ రాథోడ్ తర్వాత ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. -
'దర్శకత్వం చేసే ఉద్దేశం లేదు'
ముంబయి : బాలీవుడ్ ఇండస్ట్రీలో సరదాగా ఉంటూ రెండు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. నటుడిగా, నిర్మాతగా ఉండటానికే తాను ఇష్టపడతానని చెప్పాడు. ఫేమస్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా డైరెక్షన్ చేసిన తన లేటెస్ట్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర యూనిట్ ఓ చాట్ సెషన్ నిర్వహించారు. ఓ అభిమాని సంధించిన ప్రశ్నకు అక్షయ్ ఆశ్చర్యానికి లోనయ్యాడట. దర్శకత్వం ఎప్పుడు చేస్తారని ఈ చాట్ సెషన్లో వచ్చిన ఓ ప్రశ్నకు బదులుగా.. నాకు దర్శకత్వ చేసే ఉద్దేశం లేదన్నాడు. తాను ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా సంతృప్తిగా ఉన్నానంటూ నవ్వేశాడు అక్షయ్. ఈ ఏడాది ఇది విడుదలవుతున్న తన నాలుగో మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' అన్నాడు. ఈ మూవీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ అని అక్షయ్ చెప్పాడు. తన ప్రతి మూవీలోనూ ఏదో వైవిధ్యం అక్షయ్ ప్రదర్శిస్తానని ఈ ఏడాది విడుదలైన ఆయన మూవీలను చూస్తే అర్థమవుతుంది. తాను దర్శకత్వం వహించాలని అభిమానులు కోరుకుంటున్నందుకు వారికి ధన్యావాదాలు తెలిపాడు. ప్రభుదేవాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మరో అభిమాని అడిగిన ప్రశ్నకు.. మా కాంభినేషన్ ఎప్పుడూ సూపర్బ్. అతనికి ఏం కావాలో అదే తెరపై చూపిస్తాడంటూ ప్రభుదేవా గురించి చెప్పుకొచ్చాడు. 2012లో మా కాంబినేషన్లో 'రౌడీ రాథోడ్' మూవీ వచ్చిందని అక్షయ్ గుర్తుచేశాడు. -
తొలిరోజే రూ. 20 కోట్లు వసూళ్లు
ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 20.67 కోట్ల రూపాయలు రాబట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్, అమీ జాక్సన్, కే కే మీనన్, లారా దత్తా నటించారు. ఈ వారం భారీ చిత్రాలు లేకపోవడంతో సింగ్ ఈజ్ బ్లింగ్కు భారీ కలెక్షన్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రౌడీ రాథోడ్ తర్వాత ప్రభుదేవా, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. -
'కొత్త ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నా'
ముంబై : హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా యాక్షన్ మూవీలు కూడా చేయాలని నటి అమీ జాక్సన్ అభిప్రాయపడింది. యాక్షన్ సినియాలలో నటించడం హీరోలతో పాటు తమకు ఎంతో ముఖ్యమని, తనకు తాజాగా అటువంటి అవకాశం వచ్చిందని చెప్పింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'సింగ్ ఈజ్ బ్లింగ్' మూవీలో అతడికి జోడీగా అమీ చేస్తుంది. బాలీవుడ్లో గతంలో ఎన్నడు చూడని యాక్షన్ సన్నివేశాలను ఈ మూవీలో చూస్తారంటోంది ఈ ముద్దుగుమ్మ. 'ఐ' మూవీలో గ్లామర్ రోల్ పోషించిన ఈ భామ తన తాజా మూవీలో యాక్షన్ సీన్లలో కొన్ని స్టంట్స్ కూడా చేసిందట. యాక్షన్ మూవీల్లో నటించడం తనకు చాలా ఇష్టమని, పాత ధోరణిలో హీరోయిన్ల పాత్రల్లో కనిపించడం తనకు ఇష్టం లేదన్నది. తాను కొత్త ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించింది. స్టార్ హీరో అక్షయ్ సరసన ఇంత త్వరగా అవకాశం వస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చింది. అక్షయ్ ని యాక్షన్ కింగ్ ఆఫ్ బాలీవుడ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ మూవీలో నటించే అవకాశం వచ్చిందన్న విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని అమీ జాక్సన్ పేర్కొంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తోన్న కామెడీ, యాక్షన్ మూవీ 'సింగ్ ఈజ్ బ్లింగ్' వచ్చే నెలలో విడుదల కానుందన్న విషయం అభిమానులకు తెలిసిందే.