రొమాంటిక్ సినిమాకు డెరైక్షన్..! | I'll not act all my life; will move to writing, direction Kangana Ranaut | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ సినిమాకు డెరైక్షన్..!

Published Wed, Sep 17 2014 12:32 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రొమాంటిక్ సినిమాకు డెరైక్షన్..! - Sakshi

రొమాంటిక్ సినిమాకు డెరైక్షన్..!

 ‘క్వీన్’ సినిమాతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనారనౌత్. నటిగా ఆమెను మరో మెట్టుపైన కూర్చోబెట్టిందా సినిమా. ‘‘ ‘క్వీన్’ తెచ్చిన గౌరవాన్ని పోగొట్టుకోలేను. అందుకే... ఇక నుంచి అభినయానికి ఆస్కారమున్న ప్రయోగాత్మక పాత్రలకే పెద్దపీట వేయాలనుకుంటున్నా’’ అని కంగనా ఆ మధ్య మీడియాతో చెప్పారు. దానితో పాటు మరో కొత్త నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు కంగనా. అదేంటంటే... త్వరలోనే ఆమె మెగా ఫోన్ పట్టబోతున్నారు.
 
  ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ‘‘త్వరలోనే నా దర్శకత్వంలో సినిమా ఉంటుంది. కథ కూడా సిద్ధమైంది. రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మరో విషయం ఏంటంటే... నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నాను. అందుకని నా లైఫ్‌నే సినిమాగా తీస్తున్నానని అనుకోవద్దు. ఇది కల్పిత కథే. అయితే... నా జీవిత సంఘటనలు ఈ కథకు వన్నె తెస్తాయి. అందుకే ఇందులో చేర్చాను. వాటి వివరాలు ముందు చెప్పను. సినిమా విడుదలయ్యాకే తెలియజేస్తా’’ అని కంగనా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement