ఆ విషయంలో నోరు జారింది..! | She slips her mouth in that case....! | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో నోరు జారింది..!

Published Tue, Apr 22 2014 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆ విషయంలో నోరు జారింది..! - Sakshi

ఆ విషయంలో నోరు జారింది..!

‘క్వీన్’తో కంగనా రనౌత్ గొప్ప నటీమణుల జాబితాలో చేరిపోయారు. ‘ఆ పాత్ర నాకొచ్చివుంటే బావుండు’ అని ఓ హీరోయిన్ అంటే, ‘ఆ పాత్రను కంగనా తప్ప ఇంకెవరూ చేయలేరు?’ అని ఇంకో హీరోయిన్ అనడం, ‘దాన్ని రీమేక్ చేస్తే ఆ పాత్ర చేయడానికి నేను రెడీ..’ అని మన దక్షిణాదికి చెందిన ఓ హీరోయిన్ అంటే... మళ్లీ తీస్తే ఆ సినిమా ఆత్మ దెబ్బ తింటుందని, ఆ సినిమాకు సంబంధించినంతవరకూ ఏది మారినా.. సినిమా పండదని మరో హీరోయిన్ అనడం... ఇలా ‘క్వీన్’పై సినీరంగంలోనే విపరీతమైన చర్చలు. ఒక్క సినిమాతో నటిగా అందనంత ఎత్తులో కూర్చున్నారు కంగనా.
 
 ఈ దఫా జాతీయ అవార్డు రావడం ఖాయం అని సినీ మేధావులు సైతం ఢంకా బజాయించి మరీ చెబుతున్నారంటే ‘క్వీన్’గా కంగనా నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే... లెక్కలేనన్ని ప్రశంసలందుకుంటున్న ఈ సమయంలోనే అనుకోకుండా కంగనాకు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. వివరాల్లోకెళ్తే ఇటీవల ‘క్వీన్’ చిత్రాన్ని ఆమిర్‌ఖాన్ చూశారట. ఆ సినిమాలో కంగనా నటన చూసి ఫిదా అయిపోయారు. ‘అవకాశం వస్తే కంగనాతో నటించాలని ఉంది’ అని మీడియా సాక్షిగా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారు.
 
  ఆమిర్ కోర్కెను మీడియా కంగనా ముందుంచితే ‘‘ఆమిర్‌తో నటించాలి, సల్మాన్‌తో నటించాలి... ఇలాంటివి నేను కోరుకోను. మంచి పాత్రల్ని కోరుకుంటానంతే. ఈ క్రమంలో వారితో చేయాల్సి వస్తే  చేస్తాను.. దట్సాల్’’ అని కరాఖండిగా చెప్పేశారట. ఈ మాటలే కంగనా విమర్శలు ఎదుర్కోవడానికి కారణమయ్యాయి. ‘ఆమిర్ లాంటి గొప్ప నటుడు ఒక మెట్టు దిగి నీ నటనను అంతగా మెచ్చుకుంటే... నువ్వు ఇలా నోరు జారి స్పందిస్తావా’ అని బాలీవుడ్‌లో బాహాటంగానే కంగనాను విమర్శిస్తున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement