అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వను: కంగనా రనౌత్
అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వను: కంగనా రనౌత్
Published Fri, Apr 11 2014 8:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ముంబై: అవార్డులకు ప్రాధాన్యత ఇవ్వనని బాలీవుడ్ తార కంగనా రనౌత్ తెలిపారు. క్వీన్ చిత్రంలో తన నటన ద్వారా విమర్శకుల ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో చాలా అవార్డుల కార్యక్రమాలున్నాయని.. తనకు తెలిసినవే 16 వరకు ఉన్నాయన్నారు. ప్రతి అవార్డు కార్యక్రమంలో ఐదు ఆరు గంటలు కూర్చోవాల్సి ఉంటుందన్నారు.
అంతేకాకుండా అవార్డుల కార్యక్రమం కోసం రెండు, మూడు గంటలపాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. అవార్డుల కార్యక్రమం కోసం చాలా శ్రమ పడాల్సిఉంటుందన్నారు. తనకు గ్యాంగ్ స్టర్, ఫ్యాషన్ చిత్రాలకు అవార్డులు లభించాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవార్డు లభిస్తోందని కంగనా తెలిపారు.
Advertisement
Advertisement