'ఆ హీరోయిన్ కోసం ఇక ఆగలేను' | Can not wait to work with Kangana, says Karan Johar | Sakshi
Sakshi News home page

'ఆ హీరోయిన్ కోసం ఇక ఆగలేను'

Published Sat, Mar 12 2016 7:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఆ హీరోయిన్ కోసం ఇక ఆగలేను' - Sakshi

'ఆ హీరోయిన్ కోసం ఇక ఆగలేను'

ముంబై: 'క్వీన్' ఫేమ్ కంగనా రనౌత్ తో కలిసి పనిచేయాలని ఉందని బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ అన్నాడు. జాతీయ అవార్డు గ్రహిత కంగనాతో కలిసి త్వరగా ఏదైనా మూవీ చేయాలని, అందుకు తాను ఇక ఆగలేనంటున్నాడు. అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ ప్రోగ్రామ్ లో భాగంగా కరణ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. కంగనాతో మూవీ చేయాలనుకుంటున్నారా అని ఓ అభిమాని కరణ్ ను ప్రశ్నించాడు. వెంటనే స్పందించిన కరణ్... ఆమెతో మూవీ చేయడానికి ఇంకా తాను ఆగలేనని, ఎక్కువ కాలం ఎదురుచూడాలనుకోవడం లేదన్నాడు.

అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఓ మూవీని ప్రారంభించనున్నట్లు కరణ్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదని వచ్చే ఏడాది విడుదల చేస్తామన్నాడు. 2001లో తీసిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' మూవీకి సీక్వెల్ తీయాలని ఇప్పటివరకైతే ఆలోచించలేదని తెలిపాడు. భవిష్యత్తులో ఈ సినిమా పట్టాలెక్కినా ఎక్కవచ్చు చేప్పలేం అని అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా కరణ్ జోహర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement