మెగాఫోన్ పట్టనున్న బాలీవుడ్ హీరో
త్వరలోనే తాను మెగాఫోన్ పట్టుకుని ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెబుతున్నాడు.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్. జెనీలియాను పెళ్లి చేసుకుని త్వరలో ఓ బిడ్డకు తండ్రి కూడా కాబోతున్న రితేష్.. సినిమా తీయడం అద్భుతమైన కళ అని, అటు దర్శకత్వం, ఇటు నిర్మాణం రెండూ కూడా తనకు అత్యంత ఇష్టమైన విషయాలని చెప్పాడు.
నిర్మాతగా అయితే సినిమా మన సొంతం అనే భావన వస్తుందని, దర్శకుడంటే సృజనాత్మకంగా ఉండాలని.. భవిష్యత్తులో తాను తప్పక దర్శకత్వం వహిస్తానని తెలిపాడు. నిర్మాతగా రితేష్ తీసిన 'ఎల్లో' అనే మరాఠీ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రితేష్ దేశ్ముఖ్ కుమారుడైన రితేష్.. తాను రాజకీయాల్లోకి వెళ్తానో లేదో మాత్రం చెప్పలేనన్నాడు. అయితే, ఒక పౌరుడిగా మాత్రం దేశం గురించి తప్పకుండా తెలుసుకోవాలని తెలిపాడు.