ఏంజిల్‌ వచ్చిన వేళ! | Akshay Kumar shares first picture of Asin and Rahul Sharma’s baby girl | Sakshi
Sakshi News home page

ఏంజిల్‌ వచ్చిన వేళ!

Published Wed, Oct 25 2017 11:32 PM | Last Updated on Thu, Oct 26 2017 12:46 AM

Akshay Kumar shares first picture of Asin and Rahul Sharma’s baby girl

మలయాళ కుట్టి అసిన్‌ గుర్తున్నారా? అదేనండీ.. ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘లక్ష్మీ నరసింహా’.. ఇలా తెలుగులో చాలా సినిమాలు చేశారు కదా!. ‘గజిని’ హిందీ రీమేక్‌ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ ఉత్తరాది ఇంటి కోడలైన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. మైక్రోమ్యాక్స్‌ మొబైల్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ, అసిన్‌ల పెళ్లి గతేడాది జనవరిలో జరిగింది.

ఈ దంపతులకు మంగళవారం పాప పుట్టింది. ‘‘మా ఇంటికి ఏంజిల్‌ వచ్చిన వేళ మా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాం’’ అని రాహుల్‌ శర్మ పేర్కొన్నారు. కాగా, బాలీవుడ్‌లో అసిన్‌కి ఉన్న మంచి స్నేహితుల్లో హీరో అక్షయ్‌ కుమార్‌ ఒకరు. రాహుల్‌–అసిన్‌లు లవ్‌లో పడ్డప్పుడు ఈ హీరోగారు సపోర్ట్‌ చేశారు.

పెళ్లప్పుడు కూడా దగ్గరున్నారు. అసిన్‌ తల్లయిన సందర్భంగా అక్షయ్‌ స్వయంగా వెళ్లి, పాపను ఎత్తుకుని, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే... నేడు (గురువారం) అసిన్‌ బర్త్‌డే. పుట్టినరోజుకి ఒకరోజు ముందు తల్లి కావడం... మొత్తం మీద అసిన్, రాహుల్‌ ఇంట రెండు పండగలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement