2.O మరో బిగ్‌ న్యూస్‌ | Rajinikanth 2.O teaser date | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 5 2017 6:45 PM | Last Updated on Tue, Dec 5 2017 7:48 PM

Rajinikanth 2.O teaser date  - Sakshi

సాక్షి, సినిమా : సస్పెన్స్‌కు తెర దించుతు ఏప్రిల్‌ నెలలోనే 2.O చిత్ర విడుదల అంటూ మేకర్లు ఈ మధ్యే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న జనవరి 26వ తేదీన మాత్రం అభిమానులకు ఓ సర్‌ ప్రైజ్‌ ఇచ్చేందుకు మేకర్లు సిద్ధమైపోతున్నారు. 

రిపబ్లిక్‌ డే కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇక చిత్ర ట్రైలర్‌ ను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూలంగానే వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక నిపుణుడు  శ్రీనివాస్‌ మోహన్‌ పర్యవేక్షణలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చిత్ర విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం అహర్నిశలు పని చేస్తున్నాయి. 

ఇక ఇండియాలో ఇప్పటిదాకా అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 2.O రికార్డు సృష్టించబోతోంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాజోన్‌, సుధాన్షు పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement