ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ అంటే అదొక సెన్సేషనే. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు రికార్డులు సృష్టించాయి. తాజాగా రోబోకు సీక్వెల్‌గా రాబోతోన్న 2.ఓ సినిమాపై ఇండియా వైడ్‌గా క్రేజ్ నెలకొంది. ఎన్నో వాయిదాల తరువాత నవంబర్ 29న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అంచనాలు నెలకొన్నాయి.
త్రీడీ ఫార్మాట్‌లో రానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల దాహాన్ని తీర్చేందుకు ట్రైలర్‌తో చిత్రయూనిట్ సిద్దమవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment