
సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం కుదరటం లేదు. ఇప్పటికే చాలా సార్లు టీజర్ రిలీజ్‌పై వార్తలు వినిపించాయి. ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ రిలీజ్ అవ్వటం కన్ఫామ్ అన్న ప్రచారం జరిగింది.
కానీ ఆ రోజు కూడా టీజర్ రిలీజ్ కాలేదు. తాజాగా మరో డేట్ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ డేట్ పై కూడా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment