breaking news
Rajinikanth
-
'కూలీ' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు: స్టార్ హీరో
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో భారీ తారాగణమే ఉంది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుమారు 10 నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్ కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా ఆమిర్ రియాక్ట్ అయ్యారు.కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఆమిర్ ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం కోసం తాను డబ్బు తీసుకోలేదని చెప్పాడు. కేవలం రజనీకాంత్ కోసం మాత్రమే ఇందులో నటించానని తెలిపాడు. ఆపై కూలీ చిత్ర యూనిట్ మీద ఉన్న ప్రేమ వల్ల జీరో రెమ్యునరేషన్‌తో తన రోల్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ మీద ఉన్న ప్రేమ వల్ల కూలీ సినిమా కథ కూడా వినకుండా ఓకే చెప్పానని ఆమిర్‌ఖాన్ గుర్తుచేశాడు. తన కెరీర్లో చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పానన్నాడు.భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో రూ. 230 కోట్ల గ్రాస్ దాటినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన తొలి చిత్రం ‘వార్ 2’. భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 14) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. అయినప్పటికీ తొలి రోజు మాత్రం భారీ కలెక్షన్స్‌నే రాబట్టింది.(చదవండి: వార్ 2 మూవీ రివ్యూ)మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా రూ. 29 కోట్లు వసూళ్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్లో వార్ 2 కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ 2 మొత్తంగా రూ. 85-90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. (చదవండి: ‘కూలీ’ మూవీ రివ్యూ)ఇక ఇదే రోజు విడుదలైన కూలీ చిత్రంతో పోలిస్తే..వార్ 2 కలెక్షన్సే తక్కువ. కూలీ చిత్రానికి కూడా తొలిరోజే మిశ్రమ స్పందన వచ్చినా.. అత్యధికంగా రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు చిత్రాలు కలిసి తొలి రోజు రూ. 117.50 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్‌తో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్లో ఈ రెండు చిత్రాల్లో ఏది అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందో చూడాలి. -
50 years of Rajinikanth: సూపర్‌స్టార్‌పై అభినందనల వందన
50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న ఏకై క నటుడు రజనీకాంత్. 1975లో అపూర్వరాగంగళ్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన రజనీ తాజాగా నటించిన కూలీ చిత్రంతో కథానాయకుడిగా 50 వసంతాలను పూర్తిచేసుకున్నారు. 50 ఏళ్లలో తమిళం, తెలుగు ,హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 171 చిత్రాలు చేశారు. ఈయన నటుడిగా 50వ వసంతంలో నటించిన చిత్రం కూలీ. దీంతో రజనీకాంత్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళణిసామి, శశికళ, ఎంపీ కమలహాసన్, దినకరన్‌ల వరకు పలువురు అభినందనలు తెలిపారు.కాగా రజనీకాంత్ తాజాగా నటించిన కూలీ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుధవారమే చూసిన సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, పలువురు రాజకీయ ప్రముఖులు చూసి బాగుందంటూ ప్రశంసించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కూలీ చిత్ర రిజల్ట్ మాట అటు ఉంచితే రజనీకాంత్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల ముందు బ్యాండ్ బాజాలు, డాన్స్‌లతో కోలాహలం సృష్టించారు. ఆగస్టు 15 ముందు రోజునే విడుదలైన కూలీ చిత్రం ఆదివారం వరకు నాలుగు రోజులు వసూళ్లను ఇరగదీస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత చిత్రంలో దమ్మును బట్టి కలెక్షన్ ్స ఉంటాయి. -
రజినీకాంత్ కూలీ తొలి రోజు కలెక్షన్స్.. ఆ సినిమా కంటే తక్కువే!
రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తొలిరోజు అదరగొట్టింది. రిలీజ్‌కు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ కావడంతో కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో కోలీవుడ్ హిస్టరీలోనే రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూలీ నిలిచింది. కూలీ కంటే ముందుగా విజయ్ నటించిన లియో మొదటి రోజే రూ.145 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఇండియాలోనూ కూలీ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తొలి రోజే దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రూ. 30 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ దాదాపు రూ.75 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ వసూళ్ల పరంగా చూస్తే విజయ్ నటించిన 'లియో'ను అధిగమించలేకపోయింది. ఇండియావ్యాప్తంగా దళపతి విజయ్ నటించిన లియో దేశవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు రూ. 76 కోట్లు వసూలు చేసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో కూలీ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
కూలీ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే!
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)కు భారీగా ప్రమోషన్లు చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున తొలిసారి విలన్‌గా నటించడం.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది.ఓటీటీ వివరాలుఇకపోతే ఈ సినిమా డిజటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం ఇంకా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
రజనీకాంత్ 50 ఏళ్ల జర్నీ: విలన్ నుంచి సూపర్‌స్టార్‌గా..
రజనీకాంత్ (Rajinikanth) తొలిసారిగా 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాలో వెండితెరపై కనిపించారు. అది ఆగస్టు 15న విడుదలైంది. అప్పట్లో ఆయన ఇంత పెద్ద హీరో అవుతారని ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఐదు దశాబ్దాల తర్వాత, తలైవా అనేది కేవలం ఒక బిరుదు కాదు, అది ఒక నినాదమైపోయింది. సన్ గ్లాసెస్, ఆ సిగరెట్ స్టైల్స్... ఇంకా పంచ్ డైలాగ్‌లతో పాటు రజనీకాంత్ కెరీర్.. నిర్భయమైన పాత్రల ఎంపికల మీద కూడా నిర్మితమైంది. విలన్‌గా ఎంట్రీ..దీని కోసం తన సొంత ఇమేజ్ను దెబ్బతీసుకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సమకాలీకుల్లో చాలా మందికి భిన్నంగా.. ఇమేజ్‌కు తోడ్పడే సురక్షితమైన పాత్రలు మాత్రమే పోషించడానికి ఆయన మొదటి నుంచీ నిరాకరిస్తూనే ఉన్నాడు. తన తరంలోని చాలా మంది తారలు రొమాంటిక్ హీరోలుగా అరంగేట్రం చేస్తున్న పరిస్థితుల్లో, రజనీ విలన్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మూండ్రు ముడిచ్చు (1976) వంటి ప్రారంభ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించాడు. నిజానికి ప్రేక్షకులు తమ హీరోలను విపరీతంగా ఆరాధించే యుగంలో అది అంత సులభమేం కాదు. అయినా సరే రజనీకాంత్ విలన్‌గా తన బ్రాండ్‌ను సరికొత్తగా నిర్మించుకున్నాడు. నాటి 70's చివర్లో, 80's ప్రారంభంలో రజనీ విలన్, చిన్న చిన్న పాత్రల నుంచి ప్రధాన పాత్రల్లోకి మారారు. అలాగని తెరపై వీరోచిత పాత్రలకే ఆయన పరిమితం కాలేదు. ఆరిలిరుంతు అరుబతు వారై (1979) వంటి చిత్రాలలో ఆయన కౌమారదశ నుంచి వృధ్ధాప్యం వరకు కష్టపడుతున్న వ్యక్తిగా నటించారు. ఇది ఒక అన్నదాత త్యాగాల గాధను చూపిస్తుంది. ఇది ఇప్పటికీ అతని అత్యంత అద్భుతమైన నటనల్లో ఒకటిగా పరిగణన పొందుతోంది. తమిళ సినిమాలో అతిపెద్ద స్టార్ అయిన తర్వాత కూడా, రజనీ తన ప్రయోగాత్మక పంథాను వదులుకోలేదు. అవర్గల్ (1977) ముల్లుమ్ మలరుమ్ (1978)లలో, ఆయన తన ఇమేజ్‌కు భిన్నమైన పలు పాత్రలు పోషించారు. స్టార్డమ్ కు కట్టుబడే హీరోల ఆలోచనలకు భిన్నంగా కొనసాగారు.కమర్షియల్ సినిమాతో మలుపు...‘మాస్ హీరో‘ గా రజనీని ఎవరికీ అందనంత ఎత్తులో అమాంతం కూర్చోబెట్టిన సినిమాలు బిల్లా (1980), బాషా (1995), శివాజీ (2007)లు. ఇవి మొత్తంగా భారతీయ వాణిజ్య సినిమాలో మైలురాళ్ళు. కానీ ఈ బ్లాక్బస్టర్లలో కూడా, ఆయన పాత్రపరమైన తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. మనసున్న డాన్ పాత్రలో మనస్సాక్షికి లోబడే టెక్ మొగల్ పాత్రలో కనిపించి మెప్పించాడు. 2000ల తర్వాత, రజనీ ఎంథిరన్/రోబో (2010) కాలా (2018) చిత్రాలతో సాహసోపేత పాత్రలకు సై అంటూనే ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లవుతున్నా.. అభిమానులను అలరించేందుకు మరిన్ని సినిమాలతో ముందుకు వస్తానంటున్నాడు రజనీకాంత్.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
అలాంటి ఫ్రెండ్ అందరికీ దొరకడు.. ఇప్పటికీ నాన్న చిన్నపిల్లాడైపోతాడు
రజనీకాంత్ (Rajinikanth) నడుచుకుంటూ వస్తే చాలు రికార్డులు వాటంతటవే వస్తాయి. బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. ఆగస్టు 15 నాటికి రజనీ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా రజనీ ఆప్త మిత్రుడు మోహన్‌బాబు (Mohanbabu) కూతురు మంచు లక్ష్మి అనేక విషయాలను పంచుకుంది.నాన్న చిన్నపిల్లాడిగా..మంచు లక్ష్మి మాట్లాడుతూ.. రజనీ అంకుల్ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు. మాక్కూడా ఆయనంటే చాలా ఇష్టం. అంకుల్ వచ్చాడంటే మా నాన్న చిన్నపిల్లాడయిపోతాడు. ఇప్పటికీ వాళ్లిద్దరూ ఒకరినొకరు సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న అందమైన స్నేహం వారిది. నటులవ్వడానికి ముందు నుంచే ఇద్దరూ మంచి మిత్రులు.కష్టసుఖాల్లోనూ..మా నాన్న ఎప్పుడైనా బాధలో ఉంటే అంకుల్ సపోర్ట్‌గా నిలబడతాడు. అలాగే అంకుల్‌కు ఏదైనా కష్టమొచ్చిందంటే నాన్న తోడుగా ఉంటాడు. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇద్దరూ కలిసే ఉంటారు. అలాంటి ఫ్రెండ్ దొరకాలని ప్రతి ఒక్కరూ ఆ దేవుడిని కోరుకోవాల్సిందే! పెదరాయుడు సినిమాలో అంకుల్ గెస్ట్ రోల్ చేశాడు. పెదరాయుడు మూవీలో..నిజానికి ఆయనకు ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ఫ్రెండ్షిప్ కోసం మాత్రమే ఆ మూవీలో యాక్ట్ చేశాడు. నాన్న కోసం ఆయన స్వయంగా రాయలసీమ రామన్న చౌదరి సినిమా కథ రాసిచ్చాడు. అదీ వారి ఫ్రెండ్షిప్ గొప్పదనం. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్లోనూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుందన్న మృణాల్.. కౌంటరిచ్చిన మృణాల్ -
కూలి సినిమా రివ్యూ
-
రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కూలీ' హడావుడే. సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబో కావడం.. తొలిసారి కింగ్ నాగార్జున విలన్‌గా చేయడం.. దానికి తోడు అనిరుధ్ పాటలు వైరల్ కావడం.. ఇలా ఎక్కడలేని హైప్ అంతా ఈ మూవీపై ఏర్పడింది. అలా భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి అభిమానులు ఆశపడ్డట్లు రజినీకాంత్ హిట్ కొట్టారా? ఇంతకీ 'కూలీ' ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటి?వైజాగ్ పోర్ట్‌లో కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?కూలీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. చాలామంది చాలారకాలుగా అంచనా వేశారు. ఇదేదో ట్రైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అని మాట్లాడుకున్నారు. అలానే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌కి కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇది ఫక్తు రివేంజ్ కమర్షియల్ డ్రామా. ఎల్సీయూతో ఎలాంటి లింక్ లేదు. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్రెండ్‌ని ఎవరో చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో.. ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇంతకీ చంపింది ఎవరు అనేదే స్టోరీ.వైజాగ్ పోర్ట్ ఏరియా, అక్కడ సైమన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం, దాన్ని చూసుకునే దయాల్.. ఇలా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సినిమా మొదలైంది. కట్ చేస్తే దేవాగా రజినీకాంత్ ఎంట్రీ. వెంటనే ఓ పాట. కాసేపటికే తన ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడనే వార్త.. ఇది తెలిసి అతడి ఇంటికి దేవా వెళ్లడం, అక్కడేమో రాజశేఖర్ కూతురు ప్రీతి.. కాసేపటికి సైమన్ ఎంట్రీ.. అలా ఒక్కో పాత్ర పరిచయం చేస్తూ వెళ్లారు. తన ఫ్రెండ్‌ని చంపింది ఎవరో తెలుసుకునే క్రమంలో హీరో.. విలన్ గ్యాంగ్‌లో చేరడం, తాను వెతుకుతున్న హంతకుడు ఎవరో తెలియడం లాంటి అంశాలతో తొలి భాగం ముగుస్తుంది. దేవా మ్యాన్షన్లోనే హీరో చేసే ఓ ఫైట్ తప్పితే ఫస్టాప్ అంతా డ్రామానే ఉంటుంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఇంటర్వెల్లో ఫైట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో కాస్త డిఫరెంట్.తొలి సగంలో ఎక్కువగా డ్రామానే ఉంది కదా కనీసం సెకండాఫ్‌లో అయినా యాక్షన్ ఉంటుందా అనుకుంటే అక్కడ కూడా అదే డ్రామాని నడిపించారు. సినిమాలో స్టార్స్ ఎక్కువమంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ప్రయత్నంలో సినిమా మొత్తం కలగాపులగం అయిపోయింది. దయాల్ పాత్రలో ట్విస్టులు బాగున్నాయి. సైమన్ దగ్గర పనిచేస్తూ, అతడి కొడుకుని ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో ట్విస్టులు కూడా బాగున్నాయి. మూవీలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువైపోవడంతో చాలా సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దాహా అనే పాత్రలో ఆమిర్ ఖాన్ ఎంట్రీ పెద్దగా ఇంపాక్ట్ చూపించిందా అంటే లేదు.ఎవరెలా చేశారు?రజినీకాంత్ ఎప్పటిలానే తన స్వాగ్, స్టైల్‌తో ఆకట్టుకున్నారు. విలనిజం చేసిన నాగార్జున.. కాస్త కొత్తగా కనిపించారు. ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది గానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది. సత్యరాజ్, ఉపేంద్ర ఉన్నారంటే ఉన్నారు అంతే. పెద్దగా స్కోప్ దొరకలేదు. శ్రుతి హాసన్ కూడా ఇచ్చినంతవరకు న్యాయం చేసింది. దయాల్‌గా చేసిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. మెస్మరైజ్ చేశాడు. కల్యాణిగా చేసిన కన్నడ నటి రక్షిత రామ్ కూడా చిన్న రోల్ అయినా బాగుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది.సినిమాలో కథ పరంగా పెద్దగా మెరుపులు, హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. రిచ్ విజువల్స్, స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్. అనిరుధ్ గురించి చెప్పుకోవాలి. చాలా సాధారణమైన సన్నివేశాల్ని కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. కొన్నిచోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా అంతా చూసిన తర్వాత ఇది తీసింది లోకేశ్ కనగరాజేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు చాలానే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడం ఆమాడ దూరంలో ఆగిపోయాడు. నిర్మాణ విలువలు టాప్ నాచ్ ఉన్నాయి కానీ కథలో బలం లేకపోతే ఏం లాభం. ఓవరాల్‌గా చెప్పుకుంటే సోషల్ మీడియాలో ఉన్న హైప్‌కి.. 'కూలీ' సినిమాలో స్టోరీకి ఏ మాత్రం సంబంధం లేదు.- చందు డొంకాన -
'కూలీ' సినిమా చూసిన ధనుష్, ఐశ్వర్య.. సంతోషంగా 'రజనీ' సతీమణి (ఫోటోలు)
-
‘కూలీ’ మూవీ ట్విటర్ రివ్యూ.. సెకండాఫ్‌లో నిద్రపోవడమే
సాధారణంగానే రజనీకాంత్ సినిమాలకి తమిళ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున అభిమానులు ఉంటారు. ఇక ఆయన సినిమాలో నాగార్జున లాంటి స్టార్ హీరో విలన్‌గా నటిస్తే..ఇక్కడ అంచనాలు పెరిగిపోవడం స్వరసాధారణమే. అందుకే కూలీ సినిమాపై మొదటి నుంచి టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మపడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? విలన్‌గా నాగార్జున మెప్పించాడా? రజనీకాంత్ ఖాతాలో మరో హిట్ పడిందా? తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. కూలీ సినిమా పవర్-ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ అంటూ ఎక్కువమంది ప్రశంసిస్తున్నారు. రజినీకాంత్ నటన, సినిమా కథ, కథనం బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు రజనీకాంత్‌తో పాటు నాగార్జున పాత్ర బాగా సెట్ అయిందని చెబుతున్నారు. ఆయన విలనిజం కథకు చాలా బలంగా ఉందని తెలుపుతున్నారు. అయితే, సెకండాఫ్ మాత్రం పరమ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత నిద్రపోవడమే అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కూలీ, వార్2 సమరంలో వార్2 బాగుందని ఎక్కువమంది తెలుపుతున్నారు.Second half padukobettaduCompletely disappointed#Coolie 2.5/5— Telugu Scribe (@TeluguScribe) August 14, 2025 కూలీ సినిమా కోసం దర్శకుడు లోకేష్ టేకింగ్ అదుర్స్ అంటున్నారు. ఇందులో రజనీకాంత్‌ను ఆయన సరికొత్తగా చూపారని కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, అలాగే సినిమాలో ఉత్కంఠను కొనసాగించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటికి తోడుగా అనిరుధ్ మ్యూజిక్ బాగా కలిసొచ్చిందని తెలుపుతున్నారు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి జీవం పోసిందని అభిప్రాయపడిని నెటిజన్లు ప్రతి ఎలివేషన్ సీన్‌కి అదిరిపోయే రీసౌండ్ ఇచ్చాడని అంటున్నారు.తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన క్రిస్టోఫర్ కనగరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు, కలెక్షన్స్ వివరాలు ఆయన ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన రజనీకాంత్‌ను అభిమానించేలా ఎక్కువ ట్వీట్లు కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఆయన కూలీ సినిమా గురించి ఇచ్చిన రివ్యూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సినిమా యావరేజ్ మాత్రమే అంటూ రివ్యూలో పేర్కొన్నారు. నాగార్జున చాలా స్టైలిష్‌గా ఉన్నప్పటికీ ఆయన పాత్ర సరిగ్గా సెట్ కాలేదని తెలిపారు. రజనీకాంత్ పాత్ర మాత్రమే పర్వాలేదని చెప్పిన ఆయన సినిమాలో ఇంకేమీ లేదన్నారు. అయితే, అనిరుధ్ మ్యూజిక్ అద్భుతమని చెప్పుకొచ్చారు. #Coolie - Charismatic Superstar, Flashback Deaging seq Mass. Shoubin full fledge role. Stylish Nagarjuna, but Poor characterization. Shruthi & Rachita gud Perf. Anirudh superb work. Weak Content & Clumsy screenplay; Its all over the places. Gud Actions. Wannabe Cameos. AVERAGE!— Christopher Kanagaraj (@Chrissuccess) August 14, 2025 "కూలీ" సినిమా ఫస్టాప్ వరకు మాత్రమే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూలీ ట్రాక్ మారిందని అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని, వాటిని రజనీకాంత్ నటనతో పాటు, నాగార్జున, లోకేష్ డైరెక్షన్ కవర్ చేశారని అంటున్నారు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.కొంతమంది మాత్రం కూలీ సినిమా కథ చాలా బోరింగ్ అంటున్నారు. సినిమా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలుపుతున్నారు. #Coolie Review in single video :#CoolieReview pic.twitter.com/aREXYEjlru— 𝐏𝐬 🐉 (@Prudhvisevveti) August 14, 2025 #Coolie — WashOut .#War2 — Winner 🙌🏆🏆🏆🏆 Congratulations @tarak9999 & @iHrithik .— Leo Dass (@LeoDasVj) August 14, 2025 #Coolie First Half :Entertaining First half with a lot of whistle-worthy momentsThe film dives straight into the story, with Lokesh & his team doing an excellent job in designing banger moments that are perfectly blended into the narrative #Rajinikanth𓃵 as DEVA has a…— IndiaGlitz Telugu™ (@igtelugu) August 14, 2025 #Coolie #CoolieFDFS #CoolieReview 1st half done in Albion Cinemas Toronto.Quite average, with unwanted heavy Ani music. Rajini looks good.Sruthi annoying as always. Concept and story line quite meh. Lokesh worst 1st half in his career. Still movie moving fast.— Behind_Politics 🔍 (@lets_findfaults) August 14, 2025#CoolieReview Story: 🔥🔥🔥🔥🔥Screen play: 🔥🔥🔥🔥🔥BGM: 💥💥💥💥💥💥Surprise elements: 🔥🔥🔥🔥Twist and turns: 🔥🔥🔥🔥🔥Artist performance: 💥💥💥💥Camera work: 🥶🥵🥵🥵ANDRajinikanth: 🔥🔥🔥🔥Aamir Khan: 🥵🥵🥵🥵#Rajinikanth | #SuperstarRajinikanth | #Coolie— DAHAA (@AamirKhanDahaa) August 14, 2025#Coolie 1st half - Superb 👌 Interval Block with great surprise &vintage song KingPin 👑 investigative portions are OK thus far however #SuperstarRajinikanth aura & emotional scene works thus far#Monica song 👌 😍 #PoojaHegde 💃#Coolie #rajinikanth𓃵 #Thalaivar #CoolieReview https://t.co/Tgq770cHlK pic.twitter.com/UIypMkeS6z— Kurosaki (@naathandaleo23) August 14, 2025#Coolie first half knocks it out of the park. gripping drama, full-on fan service, and an interval block that’ll give you goosebumps. #Rajinikanth is pure mass mayhem 🔥— Guppi (@GUppi60) August 14, 2025#Coolie 1st half - Superb 👌 Interval Block with great surprise &vintage song KingPin 👑 investigative portions are OK thus far however #SuperstarRajinikanth aura & emotional scene works thus far#Monica song 👌 😍 #PoojaHegde 💃#Coolie #rajinikanth𓃵 #Thalaivar #CoolieReview pic.twitter.com/4aXCIj4RAf— 🎊🎉 Runner 🎊🎉 (@ThookiSollu) August 14, 2025#COOLIE Very Good First Half 🥵🥵🥵🔥🔥🔥🔥BLOCKBUSTER BANG interval FOR #CoolieThePowerHouse 🔥🔥🔥🔥#Rajinikanth intro 🔥🔥🔥Anirudh music , songs and bgm 🔥gripping drama, full-on fan service#Nagarjuna , #AmirKhan , #ShrutiHaasan good performances#CoolieReview https://t.co/rOOwObMkse— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252 Hands in 2 Pockets.. And 🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️🚶♂️@tollymasti #tollymasti#Coolie #CoolieFDFS #CoolieFromAug14 #Rajinikanth #CoolieReview— Tollymasti (@tollymasti) August 14, 2025 -
మీరు నా మొదటి గురువు
‘‘మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు’’ అంటూ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వేదికగా(ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా జె. ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవాన్ దాదా’(1986). రాకేశ్ రోషన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు హృతిక్ రోషన్ బాలనటుడిగా నటించారు. ‘భగవాన్ దాదా’ గా రజనీకాంత్ నటించగా, ఆయన పెంపుడు కొడుకు గోవిందా దాదాగా హృతిక్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలకానుంది. అదేవిధంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమా కూడా నేడు విడుదలవుతోంది. ‘కూలీ, వార్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ గురించి హృతిక్ రోషన్ పోస్ట్ చేయడం విశేషంగా మారింది. ‘‘రజనీకాంత్ సార్.. మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. నా మొదటి గురువుల్లో మీరు ఒకరు. నాకెప్పుడూ మీరు ఆదర్శం. యాభై ఏళ్ల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు మీకు అభినందనలు’’ అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశారు. -
Coolie First Review: ‘కూలీ’పై డిప్యూటీ సీఎం రివ్యూ
మరికొన్ని గంటల్లో(ఆగస్ట్ 14) రజనీకాంత్ ‘కూలీ’(Coolie) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ రివ్యూ ఇచ్చాడు. ఇదొక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించాడు.‘ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు. రేపు విడుదల కానున్న ‘కూలీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ని బాగా ఎంజాయ్ చేశా. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది’ అని ఉదయనిధి ఎక్స్‌లో రాసుకొచ్చాడు.‘కూలీ’ విషయానికొస్తే..లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. I am truly delighted to congratulate our Superstar @rajinikanth sir on completing 50 glorious years in the film industry.Had the opportunity to get an early glimpse of his much-awaited movie #Coolie, releasing tomorrow. I thoroughly enjoyed this power-packed mass entertainer… pic.twitter.com/qiZNOj5yKI— Udhay (@Udhaystalin) August 13, 2025 -
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
రజినీకాంత్ 'కూలీ' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికైతే 'వార్ 2'తో పోలిస్తే దక్షిణాదిలో ఈ సినిమాకే బోలెడు హైప్ ఉంది. టికెట్ బుకింగ్స్‌లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు హిట్ కొడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే 'కూలీ'కి ఇంత హైప్ ఏర్పడటానికి కారణం ఏంటి? ఇందులో నటించిన స్టార్స్ ఎవరికెంత పారితోషికం ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం.చాన్నాళ్లుగా సరైన హిట్ లేని రజినీకాంత్‌కి 'జైలర్' సక్సెస్ మంచి ఊపు ఇచ్చింది. దీంతో లోకేశ్ కనగరాజ్ చెప్పిన మాస్ యాక్షన్ స్టోరీకి రజినీ ఓకే చెప్పాడు. అలా 'కూలీ' సెట్ అయింది. అయితే ఈ మూవీలో రజినీ, నాగ్, ఆమిర్ ఖాన్.. ఇలా ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, అనిరుధ్ పాటలే చాలావరకు తెలుగులో బోలెడంత హైప్‌కి కారణమని చెప్పొచ్చు.సరే అసలు విషయానికొస్తే ఈ సినిమాని సన్ పిక్చర్స్ దాదాపు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అయితే ఇందులో సగం నటీనటుల పారితోషికాలకే అయిపోయింది. ఎందుకంటే హీరోగా చేసిన రజినీకాంత్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రూ.50 కోట్లు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా లోకేశ్.. తన పారితోషికం గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్)ఇక విలన్‌గా చేసిన నాగార్జునకు రూ.20-24 కోట్లు, తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్‌కి రూ.20 కోట్లు.. కీలక పాత్రలు చేసిన సత్యరాజ్, ఉపేంద్రకు తలో రూ.5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో కీ రోల్ చేసిన శ్రుతి హాసన్ రూ.4 కోట్లు అందుకున్నట్లు టాక్. అలానే ఈ సినిమాకు అదిరిపోయే పాటలిచ్చిన అనిరుధ్‌కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా సగానికి పైగా బడ్జెట్ పారితోషికాలకే పోగా.. మిగిలిన మొత్తంతో సినిమాని నిర్మించినట్లు తెలుస్తోంది.'కూలీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళం నుంచి తొలి రూ.1000 కోట్ల సినిమా కాబోతుందని జోస్యాలు చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు నిజం కాబోతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. గురువారం(ఆగస్టు 14) ఉదయం 6-7 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలో పడనున్నాయి. ఇప్పటికే టికెట్స్ ఆన్ లైన్లో పెట్టగా బాగానే సేల్ అవుతున్నాయి. మరి ఈ 'కూలీ'.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!) -
కూలీ, వార్ 2 సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు పెంపు
రజనీకాంత్ కూలీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇచ్చింది.సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది.అలానే హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు ఉదయం 5 గంటల షోకు అనుమతి ఇవ్వగా దాని టికెట్ ధర 500 గా నిర్ణయించింది. వార్ 2 విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75గా టికెట్ రేట్స్ పెంపు జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. -
రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!
రజినీకాంత్ నటించిన కూలీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో విపరీతమైన క్రేజ్ వస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ కొద్ది నిమిషాల్లోనే బుక్కైపోతున్నాయి. తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఇవాళ తెలంగాణలోనూ కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ కూడా అదే దాదాపు అదే పరిస్థితే. రిలీజైన నిమిషాల్లోపే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్ అందుబాటులోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా బుకింగ్ కోసం ఎగబడ్డారు. బుక్‌మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌లోనూ కూలీ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తెలంగాణలో అయితే ఎలాంటి టికెట్ ధరల పెంపు లేదు. సింగిల్ స్క్రీన్లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షో కంటే ముందుగా అదనంగా ఒక్క షోకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్ షోను ప్రదర్శించనున్నారు. ఈ మూవీతో పాటు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 సైతం అదే రోజు విడుదలవుతోంది.Telangana Bookings Open Now!💥🍿🌟Book your tickets now: https://t.co/vFx0Jf1W9g#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/cT2jrHZv9c— Sun Pictures (@sunpictures) August 12, 2025 -
రజినీకాంత్ కూలీ.. ఒక్కో టికెట్ ఏకంగా వేల రూపాయలా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటేడ్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్నఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. కొద్ది నిమిషాలకే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్కైపోతున్నాయి.ఇక తమిళనాడులో ఏకంగా రికార్డ్ ధరకు టికెట్స్ విక్రయిస్తున్నారు. కూలీ మూవీ క్రేజ్‌ను కొందరు దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. చెన్నైలో కూలీ టిక్కెట్స్‌ను బ్లాక్‌లో ఏకంగా రూ.4500లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఎంత రేటుకైనా అభిమానులు ఎగబడి కొనేస్తున్నట్లు టాక్. పొల్లాచ్చిలో ఓ థియేటర్ సిబ్బంది మొదటి షో టికెట్లను రూ.400కు అమ్ముతున్నట్లు తెలిసింది.టికెట్ రేట్లపై రజినీకాంత్ వీరాభిమాని ప్రభాకర్ మాట్లాడుతూ.. "చెన్నైలోని అన్ని ప్రముఖ థియేటర్లలో నేను నా అదృష్టాన్ని పరీక్షించుకున్నా. టికెట్స్ రూ.600, రూ.1,000ల నుంచి అత్యధికంగా రూ.4,500 వరకు అమ్ముతున్నారు. మొదటి షో కోసం టిక్కెట్ల యాప్‌ల ద్వారా బుక్ చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే ఆ టికెట్స్ అన్నీ బ్లాక్ చేశారు. నాలాంటి అభిమానులకు టిక్కెట్లను బ్లాక్‌లో కొనడం కష్టం. మొదటి షోలు ముగిసే వరకు వేచి ఉండటం తప్ప వేరే మార్గం లేదు." అని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే కేవలం తమిళనాడులోనే కాదు.. 'కూలీ' డబ్బింగ్ వర్షన్లకు కూడా టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమిళంతో పాటు తెలుగులో విడుదలవుతోంది. రెండు రాష్ట్రాలు తెల్లవారుజామున షోలను అనుమతివ్వడంతో టికెట్ ధరలు భారీగానే పెంచేశారు. ఇక బెంగళూరులో సింగిల్ స్క్రీన్లలో దాదాపు ఒక్కో టికెట్ రూ. 2,000 వరకు అమ్ముడవుతున్నాయి. బెంగళూరులో టిక్కెట్ల ధర మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్ రూ. 500 పైగానే ఉన్నాయి. ముంబయి థియేటర్లలో 'కూలీ' టికెట్ ధరలు రూ. 250 నుంచి రూ. 500 మధ్య ఉన్నాయి. అడ్వాన్స్ బుకింక్స్ చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.#COOLIE FDFS Ticket Price in Rohini Theater in chennai - ₹4500 😳Reason - Helicopter 🚁 Flowers Flow Celebration 🥳🎉 1st Time in Kollywood.....@rajinikanth pic.twitter.com/ANSnGLZ4LP— Pravin james (@PravinKuma32774) August 10, 2025 -
‘కూలీ’ కోసం హాలీడే, ఫ్రీ టికెట్.. ఇది కదా రజనీ క్రేజ్!
రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ సంబరాలు మొదలవుతాయి. జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో రజనీకాంత్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఇండియాలో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాక అంతటా ఆయనకు అభిమానులు ఉన్నారు. తొలి రోజు ఆయన సినిమా చూసేందుకు వేలల్లో ఖర్చు పెట్టిమరీ టికెట్ కొనేవాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా రిలీజ్ రోజు చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీస్‌కి సెలవు పెడతారు. బాస్‌కి ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజు ఆఫీస్‌కి డుమ్మా కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా ఎందుకు అనుకుందో ఏమో కానీ..ఓ కంపెనీ ఏకంగా తమ ఉద్యోగస్తులకు హాలీడేనే ప్రకటించింది. (చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)సౌత్‌తో పాటు ఇండియా వ్యాప్తంగా పలు బ్రాంచ్‌లు కలిగి ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ రజనీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’(Coolie Movie) రిలీజ్ రోజు(ఆగస్ట్ 14) తమ ఉద్యోగులకు వేతనంతో కూడా సెలవును ప్రకటించింది. అంతేకాదు రిలీజ్ రోజు తమ ఎంప్లాయిస్‌కి ఉచితంగా టికెట్‌ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో పాటు రజనీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్‌ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కంపెనీపై తలైవా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.(చదవండి: రెమ్యునరేషన్‌తో ఆర్ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్)కూలీ విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి.As usual Holiday being declared for offices as COOLIE releasing 😂🫨🦖🔥 pic.twitter.com/pj54B8uqA2— Hello (@RockinggRAJINI) August 9, 2025 -
"కూలీ” ఫస్ట్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే!
-
రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్
రజినీకాంత్ 'కూలీ' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో జోరుగా బుకింగ్స్ సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా టికెట్ రేట్ల పెంపు జీవో రావాల్సి ఉంది. అయితే రిలీజ్‌కి ముందే ఈ చిత్రం క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది. తమిళనాడు నుంచి ఈ రికార్డ్ సృష్టించిన తొలి సినిమాగానూ నిలిచింది.రజిని సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లోని కొన్ని దేశాల్లో కాస్త బజ్ ఉంటుంది. కానీ 'జైలర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హీరో చేసిన మాస్ మూవీ కావడం, దానికి లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్.. ఇలా చాలా ఎలిమెంట్స్ కారణంగా హైప్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించి, పోస్టర్ విడుదల చేసింది.(ఇదీ చదవండి: ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ పరమేశ్వరన్)అప్పట్లో రజినీ 'కబాలి' రిలీజ్ టైంలో చాలా హడావుడి నడిచింది. ఇదే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ 1.6 మిలియన్ డాలర్స్ వరకు వచ్చాయి. తర్వాత చాలా తమిళ చిత్రాలు వచ్చాయి కానీ ఏవి కూడా ఈ మార్క్‌ని అందుకోలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు రజినీకాంత్ తన 'కూలీ'తో ఈ నంబర్ దాటేశారు. చూస్తుంటే తొలిరోజు వసూళ్లలో సరికొత్త రికార్డ్ నంబర్స్ నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది.'కూలీ'లో రజినీకాంత్‌కి హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. నాగార్జున విలన్ కాగా సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. 'కూలీ, 'వార్ 2'తో తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?) -
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
పబ్లిక్ ఫంక్షన్లలో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్. తన ఫ్యాన్స్‌కోసం మహా అయితే కాలర్ ఎగరేస్తాడు అంతే. ఏ మాత్రం వివాదాస్పద వ్యాక్యల జోలికి పోడు. కానీ ఈ సారి ఓ గట్టి స్టేట్మెంట్నే వదిలాడు తారక్. అదేంటంటే "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు" అనేది జూ. ఎన్టీఆర్ కామెంట్. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పనిగనిగట్టుకుని 'నన్ను ఎవరూ ఆపలేరు' అని తారక్ అనడానికి ఓ కారణం ఉంది.సరిగ్గా 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ని పొగిడాడు. కూలీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. కానీ ఎన్టీఆర్‌ను, వార్ 2 సినిమా గురించి మాత్రం లోకేష్ ఎక్కడా ప్రస్తావించలేదు.రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ చేశాడు. కానీ అదే టైమ్‌లో జూ. ఎన్టీఆర్ కూడా తన 25 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ప్రస్తావన మాత్రం లోకేష్ ఎక్కడా తీసుకురాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తారక్ ఇలా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.ఇక చాలా కాలంగా అటు నారా కుటుంబానికి, ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి జూ. ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
ఆ విషయంలో గెలుపు నాగార్జునదే.. టాలీవుడ్ చరిత్రలో తొలిసారి!
అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni ) అకస్మాత్తుగా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా వైరల్‌గా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా నటించిన కూలీ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ లాంచ్ అయి సూపర్ డూపర్ హిట్ అంచనాలను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ టీజర్లో నాగార్జున లుక్ బాగా క్లిక్ అయింది. నాగార్జున తన సినీ జీవితంలో తొలిసారిగా విలన్ గా నటిస్తుండడం దక్షిణాది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకు తగ్గట్టే నాగార్జున రోల్ అత్యంత స్టైలిష్‌గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుండడం కూడా నాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. నిజానికి ఈ సినిమా లో విలన్ పాత్ర ను ఎంచుకోవడం పట్ల మొదట్లో నాగ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారనేది నిర్వివాదం. అయితే తాజా అప్ డేట్స్‌తో వారిలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది.ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తన వయసులో సగం తగ్గిపోయినట్టు కనపడ్డారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని నాగ్ స్వయంగా చెప్పడం, తాను నాగార్జున అభిమానినని లోకేష్ అనడం... కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రీ రిలీజ్లో నాగ్ లుక్, ఆయన మాటలు ఆయన గురించి తలైవా రజనీ కాంత్ పొగడ్తలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్లో నాగార్జున తన హెయిర్‌ని కుడి చేత్తో వెనక్కి తోస్తున్న బిట్‌ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఏతావాతా కూలీ సినిమా విడుదలకు ముందే ఒక విషయం మాత్రం రూఢీ అయిపోతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అనూహ్యంగా ఉండబోతోందని. రజనీకాంత్ లాంటి వీర మాస్ హీరోకి సమ ఉజ్జీగా ఆయన తెరపై విలన్ రోల్లో దుమ్మురేపనున్నారని.ఈ నేపధ్యంలో మరోసారి సీనియర్ హీరోల పాత్రల ఎంపిక ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో పాటు ఆయన సమకాలీకులు ఒకనాటి అగ్ర హీరోలు ముగ్గురు ఇంకా ఫుల్ యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరెవరూ సాహసించని రీతిలో నాగార్జున తన పాత్రల ఎంపికను అమాంతం మార్చుకుని ఈ విషయంలో అందర్నీ దాటేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున గ్లామర్‌తో పోటీపడే వారు ఎవరూ లేరనేది నిజం. అయినప్పటికీ వయసుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించి, కూలీ లో ఏకంగా విలన్ పాత్రకు కూడా సై అనడం ద్వారా ఒక నటుడికి సినిమా కలెక్షన్లు, ఇమేజ్‌లు మాత్రమే కాదు వైవిధ్య భరిత పాత్రల్లో నటించానన్న తృప్తి కూడా చాలా అవసరమని చెప్పకనే చెప్పారు. నిన్నే పెళ్లాడుతా తో గ్రీకు వీరుడి ఇమేజ్ తెచ్చుకుని వెంటనే అన్నమయ్య లాంటి పాత్ర చేసిన నాటి దమ్మూ ధైర్యం, తెగువనే ఇప్పటికీ చూపిస్తున్నారు నాగార్జున. అందుకే.. టాలీవుడ్ చరిత్ర లో తొలిసారిగా... సినిమా విడుదల కాకముందే జనం మనసులు గెలిచిన విలన్ అనిపించుకుంటున్నారు. -
రజినీకాంత్ వీరాభిమాని.. హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?
తలైవా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ అవైటేడ్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. కేరళ ఫ్యాన్స్ ఏకంగా థియేటర్లకు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే తలైవాకు ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తమిళనాడులో అయితే ఆయనంటే పడిచచ్చేంత అభిమానులు ఉన్నారు. అంతే కాదండోయ్ ఆయనకు ఏకంగా గుడినే కట్టేశారు. 2023లో మధురైకి చెందిన కార్తీక్ ఇంటి పక్కనే రజినీకాంత్‌కు ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 250 కేజీల బరువైన రజినీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి అరుల్మిగు శ్రీ రజినీ టెంపుల్ అని నామకరణం చేశారు.తాజాగా ఈ వీరాభిమాని రజినీకాంత్ విగ్రహానికి పూజలు చేశారు. ఆయన విగ్రహానికి పాలు, నెయ్యితో అభిషేకం నిర్వహించారు. సూపర్ స్టార్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆలయంలో దాదాపు 5500 పోస్టర్లతో అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానం అంటే కేవలం సినిమాలు చూడడమే కాదు.. ఇలా ఏకంగా గుడి కూడా కట్టించే ఫ్యాన్స్ ఉన్నారంటే విశేషమే.కాగా.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ.. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ 'వార్-2తో పోటీ పడనుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజవుతున్నాయి. కూలీ మూవీకి సంబంధించి కేరళలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.#WATCH | Madurai, Tamil Nadu: A die-hard fan of Rajinikanth, Karthik celebrated 50 years of the superstar by adorning the Arulmigu Sri Rajini Temple, a temple dedicated to Rajinikanth, with over 5,500 photos of the superstar and performing abhishekam. (07.08) pic.twitter.com/bYDN2wZUYS— ANI (@ANI) August 8, 2025 -
రజిని ఫ్యాన్స్ ని భయపెడుతున్న Coolie
-
డైరెక్టర్ రిపీట్?
రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ ఈ నెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’లో హీరోగా నటిస్తున్నారు ఈ సూపర్ స్టార్. ఈ చిత్రం తర్వాత ఏ దర్శకుడితో రజనీ సినిమా చేయనున్నారనే విషయం గురించి చర్చ జరుగుతోంది. హెచ్. వినోద్, వివేక్ ఆత్రేయ, నిథిలన్ స్వామినాథన్... ఇలా పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా శివ పేరు వినిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ (2021) సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేదు. కానీ ఈ సినిమా తనకు బాగా నచ్చడంతో శివకు రజనీకాంత్ బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ విధంగా శివ డైరెక్షన్‌ని రజనీ ఇష్టపడ్డారని ఊహించవచ్చు. తాజాగా శివ ఓ కథ చెప్పగా, ఆయన డైరెక్షన్లో మళ్లీ సినిమా చేయడానికి అంగీకరించారట. మరి... వార్తల్లో ఉన్న ప్రకారం డైరెక్టర్ శివని రజనీ రిపీట్ చేయనున్నారా? ఈ కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుందా? చూడాలి. -
హైదరాబాద్‌లో 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా తలపై జుట్టు ఊడిపోయింది.. నాగార్జున మాత్రం: రజనీకాంత్
రజినీకాంత్‌లో కాస్త హస్య చతురత ఎక్కువే. సినిమా ఈవెంట్స్‌లో మాట్లాడుతూ తనపై తానే జోకులు వేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్‌లో సోమవారం.. 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రుతిహాసన్, నాగార్జున, సత్యరాజ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పాల్గొన్నారు. రజినీకాంత్ మాత్రం వీడియో బైట్ రూపంలో మాట్లాడారు. అయితే నాగ్ ఫిజిక్ గురించి చెబుతూ రజినీకాంత్ తన బట్టతల గురించి జోకులు వేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.'తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను నటించిన 'కూలీ' ఆగస్టు 14న రిలీజ్ కానుంది. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేశ్ కనగరాజ్ అలా. ఆయన చేసిన సినిమాలన్నీ హిట్. ఈ చిత్రంలో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. అసలు 'కూలీ' సబ్జెక్ట్ విన్న వెంటనే సైమన్ పాత్ర నేనే చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురుచూశాను. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. నాగార్జునని ఈ పాత్ర కోసం తీసుకున్నామని లోకేశ్ చెప్పగానే ఆశ్చర్యపోయాను. చాలా సంతోషంగా అనిపించింది'(ఇదీ చదవండి: రూ. 2 కూలీ ఇచ్చి స్నేహితుడే అవమానించాడు: రజనీకాంత్)'నాగార్జున.. డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు విలన్‌గా చేయాల్సిన అవసరం లేదు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఓ సినిమా చేశాం. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. నా జుట్టు ఊడిపోయింది. నాగార్జునతో పనిచేస్తుండగా.. మీ ఆరోగ్యం రహస్యం ఏంటి అని అడిగా. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోని ఎలానో కూలీ-సైమన్ అలా ఉంటుంది' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న 'కూలీ' ట్రైలర్ శనివారమే రిలీజ్ చేశారు. కానీ ఇది కాస్త నిరారపరిచిందనే చెప్పొచ్చు. మరీ హై మూమెంట్స్ అయితే ఏం కనిపించలేదు. సినిమాలోనే ఏమైనా సర్ప్రైజులు ఉంటాయేమో చూడాలి? అదే రోజుల రిలీజ్ కానున్న ఎన్టీఆర్ 'వార్ 2' పోలిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 'కూలీ'కే ఎక్కువ హైప్ ఉంది. (ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)Superstar @rajinikanth garu shares a heartfelt message with all the lovely Telugu audience and talks about his experience working on #Coolie ❤️🔥❤️🔥#CoolieFromAug14 @iamnagarjuna #AamirKhan @Dir_Lokesh @anirudhofficial @sunpictures #TeluguFilmNagar pic.twitter.com/OP1ozqM98G— Telugu FilmNagar (@telugufilmnagar) August 4, 2025 -
రూ. 2 కూలీ ఇచ్చి స్నేహితుడే అవమానించాడు: రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితాన్ని ఒక సినిమాగా తెరకెక్కిస్తే బ్లాక్‌బస్టర్ సినిమా అని చెప్పవచ్చు. తలైవా గతం అంతా కష్టాలతోనే నిండి ఉందని అందరికీ తెలుసు.. ఎన్నో ఆటుపోట్లతో పాటు అవమానాలు భరించి నేడు ఆయన ఈ స్థానంలో ఉన్నారు. బస్ కండక్టర్‌గా, కార్పెంటర్ గా కూడా పనిచేశారు. రజనీకాంత్ నటించిన కొత్త సినిమా 'కూలీ' విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తన గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకున్నారు. తన కుటుంబం కోసం ఒకసారి కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, తాను ఎదుర్కొన్న హేళనను గుర్తుచేసుకున్నారు.సినీ పరిశ్రమకు రాకముందు తాను కూలీగా కూడా పనిచేశానని రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. 'కాలేజీ రోజులు పూర్తి అయిన తర్వాత ఒకరోజు నేను రోడ్డుపై ఉండగా.. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి పిలిచాడు. తన లగేజ్‌ను కారు వరకు తీసుకెళ్తావా అని అడిగాడు. దీంతో నేను కూడా సరేనన్నాను. అతని మాటలు నాకు చాలా పరిచయంగా ఉన్నట్లు అనిపించింది. కొంత సమయం తర్వాత మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నట్లు అర్థం అయింది. కాలేజీ రోజుల్లో అతన్ని సరదాగా ఏడ్పించేవాడిని. అయితే, లగేజ్‌ను కారు వద్దకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ. 2 చేతిలో పెడుతూ ఒక మాటన్నాడు. మనం చదువుకుంటున్న రోజుల్లో నీకు చాలా అహంకారం ఉండేదన్నాడు. అంత అహంకారంతో ఎవరూ ఉండేవారు కాదన్నాడు.. ఆపై నీకు ఆరోజులు గుర్తుకున్నాయా..? అన్నాడు. దీంతో మొదటిసారి జీవితంలో ఏడ్చాను. నేను కూలీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నాను.నేను జీవించడానికి అలాంటి చిన్న చిన్న పనులు ఎన్నో చేశాను. నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి ఇదంతా చేశాను. పేదరికం అంటే ఏమిటో నాకు మాత్రమే తెలుసు.. దానిని చూడటం, వివనడం ద్వారా కాదు. అనుభవించడం ద్వారానే తెలుసుకున్నాను.' అని పేర్కొన్నారు. ఒకప్పుడు డబ్బు కష్టాల వల్ల కార్పెంటర్‌గా, బస్ కండక్టర్‌గా రజనీ పనిచేశారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నిరాశల వల్ల తీవ్రంగా బాధపడ్డారు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా రజనీ నిర్ణయించుకున్నారట, అయితే, తనకు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పెయింటింగ్ ఒకటి కనిపించడం.. అందరూ అక్కడ నమస్కరించి వెళ్తుండటంతో తనలోని ఆధ్యాత్మిక మార్పుకు తొలి అడుగు అక్కడే పడిందట. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగిందని రజనీ చెప్పుకొచ్చారు. -
రజినీకాంత్ 'కూలీ' మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
విలన్‌గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్
రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కూలీ. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను లోకేష్ కనకరాజ్ నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చెన్నైలో తాజాగా జరిగిన ఈ సినిమా వేదికపై నటుడు నాగార్జున మాట్లాడుతూ.. కూలీ చిత్రాన్ని భాషా సినిమాతో పోల్చారు. ఏకంగా వంద 'బాషా' సినిమాలతో సమానంగా కూలీ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశారు. రజనీకాంత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఓజి అని నాగ్ తెలిపారు. ఆపై రజనీకాంత్ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ ‘అబ్బా ఏం కలర్, ఏం స్కిన్, హాయ్ అని అలాగే చూస్తుండి పోయాను. నాకు జుత్తు అంతా ఊడిపోయింది. మీ సీక్రెట్ ఏమిటని నాగ్‌ను అడిగాను. అందుకు ఆయన ఏమీ లేదు శారీరిక కసరత్తులే చెప్పారు’ అని తెలిపారు.విలన్‌గా నాగ్ ఎందుకు చేశారంటే..కూలీ చిత్రంలో విలన్‌గా నాగార్జున నటించడానికి కారణం ఒక సినిమా డైలాగ్ అంటూ రజనీకాంత్ ( Rajinikanth) ఇలా చెప్పారు.' వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంబ్లర్' చిత్రంలో అజిత్ చెప్పిన ఒక డైలాగ్ 'ఎంతకాలం మంచివాడిగా నటించేది' మాదిరి నాగార్జున కూడా ఈ చిత్రంతో విలన్‌గా మారారు. కమలహాసనే ఆశ్చర్యపడేలా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. నా విజయం రహస్యం శ్రమ మాత్రమే కాదు. భగవంతుడి ఆశీస్సులు కూడా.. నేను బస్ కండక్టర్‌గా పని చేస్తున్నప్పుడు మిత్రుడు ఒకరు బంగారు చైన్ ఇచ్చి సినిమాల్లో నటించమని చెప్పారు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ధనం, పేరు ఉన్నా, ఇంట్లో ప్రశాంతత, బయట గౌరవం లేకపోతే ఏది లేదు.' అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర, పలువురు చిత్ర ప్రముఖులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
రజినీకాంత్ కూలీ.. అమిర్ ఖాన్ మేకోవర్ వీడియో చూశారా?
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమిర్ ఖాన్ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అమిర్ ఖాన్ మేకోవర్ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు అమిర్ ఖాన్. శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సైతం చేతి నిండా పచ్చబొట్టుతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025 -
ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు
ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి నటీనటులు చాలామంది నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ల దగ్గర నుంచి షూటింగ్ జరిగే సమయంలో సదుపాయాల వరకు నిర్మాతని చాలానే ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే వీటి గురించి చెప్పుకొంటే మళ్లీ ఎక్కడ సినిమా సమస్యల్లో పడుతుందోనని నిర్మాతలు సైలెంట్‌గా ఊరుకుంటున్నారు. అలాంటిది 'కూలీ' ప్రొడ్యూసర్ కళానిధి మారన్ మాత్రం కుండ బద్దలు కొట్టేశారు. కొందరు హీరోల నిజస్వరూపం గురించి చెప్పి, సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శనివారం సాయంత్రం చెన్నైలోని జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత కళానిధి మారన్.. 'ఈ రోజుల్లో కొందరు సక్సెస్ఫుల్ యాక్టర్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. రెండు హిట్స్ పడగానే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొందరైతే ప్రైవేట్ జెట్స్ అడుగుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. దేశంలోని ఒకే ఒక్క సూపర్‌స్టార్ ఈయనే' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ‘ఢీ’ కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు, అరెస్ట్!)రజినీకాంత్ గురించి నిర్మాత చెప్పడం, ఆయన ఎలివేషన్లు ఇవ్వడం బాగానే ఉంది. మరి కళానిధి మారన్.. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరి హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈయన వాళ్ల గురించి చెప్పారా? లేదా జనరల్‌గా ఇండస్ట్రీలో హీరోల తీరు గురించి చెప్పారా అనేది సస్పెన్స్.'కూలీ' విషయానికొస్తే రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. శనివారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాకపోతే పెద్దగా హై అనిపించలేదు. కానీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంపై హైప్ గట్టిగానే ఉంది. మరి ఆగస్టు 14న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్‌లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్‌లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్‌ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్
చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్‌ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం.లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. -
రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. ఇప్పటికే పాటలు మంచి క్రేజ్ తెచ్చుకోగా.. ఇప్పుడొచ్చిన ట్రైలర్, ఉన్న హైప్‌ని మరింత పెంచేలా ఉంది. రజనీ మాస్ షాట్స్, అనిరుధ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్ ఈసారి మరింత మాస్ మూవీతో రాబోతున్నాడని ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)ఈ సినిమా అంతా వాచీల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇందులో రజినీకి విలన్‌గా నాగార్జున నటించారు. వీళ్లతో పాటు ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి) -
రజినీకాంత్ కూలీ అప్డేట్.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.తాజాగా కూలీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రజినీకాంత్ పోస్టర్‌ను షేర్ చేస్తూ సెన్సార్ తమకు ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K— Sun Pictures (@sunpictures) August 1, 2025 -
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. పవర్‌హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)కాగా.. కూలీ ట్రైలర్‌ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కూలీ'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోనికా సాంగ్‌తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా.. ఇటీవలే విడుదలైన పవర్ హౌస్ సాంగ్ రజినీకాంత్ ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL— Sun Pictures (@sunpictures) July 28, 2025 -
భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను: శ్రుతీహాసన్
‘‘కూలీ’ చిత్రంలో నేను చేసిన పాత్ర వ్యక్తిగతంగా, ఒక అమ్మాయిగా నాకు బాగా కనెక్ట్ అయింది. నా పాత్రలో మంచి భావోద్వేగం ఉంది. అమ్మాయిలు నా పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్, అద్భుతమైన యాక్షన్, మంచి కథ, భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని శ్రుతీహాసన్ తెలిపారు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు.కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. డి. సురేష్‌బాబు, ‘దిల్’ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ పంచుకున్న విశేషాలు. ⇒ నేనో మ్యూజిక్ ఆల్బమ్ కోసం లోకేశ్ కనగరాజ్గారిని కలిశాను. ఆ ఆల్బమ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన సర్ప్రైజింగ్గా ‘కూలీ’లోని నా పాత్ర గురించి చెప్పారు. ఆయన సినిమాలంటే డార్క్, గన్స్, యాక్షన్‌తో ముడిపడి ఉంటాయి.కానీ, ‘కూలీ’లో ఆయన చెప్పిన స్ట్రాంగ్ ఉమన్ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్‌గారి అమ్మాయిగా కనిపిస్తాను. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్... ఇలా చాలామంది స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరచి΄ోలేని అనుభూతి. ఇంతమంది సూపర్ స్టార్స్‌తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం ప్రతి ఆర్టిస్ట్‌కి దొరకదు... నాకు దొరికింది. అందుకే ‘కూలీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.⇒ నాన్నగారితో (కమల్‌హాసన్) ఆయనకు ఉన్న స్నేహం గురించి, అప్పటి వర్కింగ్ స్టైల్ గురించి ‘కూలీ’ సెట్స్‌లో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు రజనీకాంత్‌గారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. నాగార్జునగారు తొలిసారి విలన్ పాత్ర చేశారు. తెలుగు ప్రేక్షకులందరూ ఆయన పాత్ర చూసి, చాలా సర్ప్రైజ్ అవుతారు. ఆమిర్ ఖాన్‌గారితో పని చేయడం స్పెషల్ ఎక్స్పీరియన్స్. లోకేశ్ కనగరాజ్ క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ⇒ ‘కూలీ’ సినిమా పూర్తిగా చూడలేదు. నా డబ్బింగ్ వెర్షన్‌తోపాటు ఇంకొన్నిపోర్షన్స్ చూశాను... చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగడానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదమే అని భావిస్తున్నాను. నేను భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించలేదు... పనిని ఎంజాయ్ చేశాను. నాకు వచ్చిన ప్రాజెక్టుకి ఎంతవరకు న్యాయం చేయాలనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ ఒక మ్యుజిషియన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులోనూ కొన్ని కథలు విన్నాను... త్వరలోనే నా కొత్త సినిమా ప్రకటన ఉంటుంది. -
రజనీకాంత్‌గారిని విలన్‌గా చూపించాలనుకున్నా!: దర్శకుడు లోకేశ్ కనగరాజ్
రజనీకాంత్‌ను ఓ పవర్ఫుల్ విలన్‌గా చూపించే ప్రయత్నం మిస్ అయ్యిందని అంటున్నారు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. నాగార్జున, శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘కూలీ’ సినిమా ప్రయాణం గురించి లోకేశ్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘కూలీ’ సినిమా కంటే ముందు రజనీకాంత్‌గారికి ఓ పెద్ద కథ చెప్పాలనుకున్నాను. అందులో రజనీకాంత్‌గారిది విలన్ పాత్ర. మిగతా లీడ్ రోల్స్ హీరో పాత్రల మాదిరిగా ఉంటాయి. అయితే ఈ సినిమా నేను చేయడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. రజనీకాంత్‌గారు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నా సినిమా కోసం ఆయన రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేయడం నాకు ఇష్టం లేదు.అదే సమయంలో నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ సినిమాను వద్దనుకుని, ‘కూలీ’ సినిమా కథ చెప్పగా, రజనీకాంత్ గారు ఓకే చేశారు. అలా ఆయనతో ‘కూలీ’ సినిమా చేయడం జరిగింది. అయితే నా ‘ఎల్సీయూ’ (లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ‘కూలీ’ భాగం కాదు. అలాగే ‘కూలీ’ సినిమాలో ఓ మంచి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఈ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఇక ‘కూలీ’ సినిమా తర్వాత లోకేశ్ డైరెక్షన్లో ‘ఖైదీ 2’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్. ఇంకా కమల్‌హాసన్‌తో ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ వంటి సినిమాలు లైనప్‌లో ఉన్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు లోకేశ్. -
రజినీకాంత్ కూలీ.. పవర్ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్‌తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ ప్రమోషన్లలో భాగంగా థర్డ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ హౌస్ అంటూ సాగే పవర్ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పవర్ఫుల్ సాంగ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. వచ్చేనెల ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్?
ఓ పెద్ద హీరో సినిమా ఫ్లాప్‌ని మరో పెద్ద హీరో మందుపార్టీతో సెలబ్రేట్ చేసుకున్నాడు అంటూ ఆ మధ్య టాలీవుడ్ కేంద్రంగా ఒక వార్త గుప్పుమంది. అంతేకాదు తెలుగు హీరోల్లో సఖ్యత మేడిపండు చందమేననేది అనేక సార్లు బహిరంగంగానే రుజువైంది. తెలుగు సినిమా వజ్రోత్సవాలు మాత్రమే కాదు మరికొన్ని బహిరంగ కార్యక్రమాలు ప్రకటనలు కూడా టాలీవుడ్ హీరోలు ముఖ్యంగా సీనియర్స్ మధ్య స్నేహం ప్రొఫెషనల్ జెలసీలను దాటలేకపోయిందనేది వెల్లడించాయి. ఈ నేపధ్యంలో తాజాగా దక్షిణాదిన అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్‌ల స్నేహ బంధంలోని గాఢత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో మిత్రుడు రజనీని ఇటీవలే కమల్ కలవడం శుభాకాంక్షలు స్వీకరించడం మనకు తెలిసిందే. ఇదే సమయంలో కమల్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కాపాడే బాధ్యతను రజనీ భుజాలకెత్తుకున్నాడనే మరో వార్త కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని చాటుతోంది.భారతీయుడు 3ని రక్షించడమే రజనీ తలకెత్తుకున్న ఆ బాధ్యత. తొలి భారతీయుడు’ ఓ బ్లాక్ బస్టర్ కాగా, ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘భారతీయుడు 2’(Bharateeyudu 3) రిలీజ్ టైంలోనే ‘భారతీయుడు 3’ షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయిపోయింది అని నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు అసలు కథ మొత్తం ‘3వ భాగం’ లోనే ఉంటుందని దర్శకుడు శంకర్ చెప్పడం కూబి జరిగింది. సాధారణంగా పార్ట్ 2 ప్లాప్ అయితే పార్ట్ 3 ని దక్షిణాదిలో దర్శక నిర్మాతలు అటకెక్కించేస్తారు. హాలీవుడ్, బాలీవుడ్లో మాత్రం హిట్స్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సీక్వెల్స్ కొనసాగిస్తారు. కానీ సౌత్ లో ఇప్పటి వరకు .ఒక్క భారతీయుడు మాత్రమే ఆ ఘనతను స్వంతం చేసుకోనుంది. కాకపోతే ఇప్పుడు భారతీయుడు 3 చుట్టూ రకరకాల సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా ‘2వ భాగం’ ప్లాప్ అయ్యింది కాబట్టి.. ‘3వ భాగం’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అంతేకాక గేమ్ ఛేంజర్ తర్వాత దర్శకుడు శంకర్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ నేపధ్యంలో భారతీయుడు 3’ కంప్లీట్ అవ్వాలంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా’ ముందుకు వచ్చి ధైర్యం చేసి మరి కొంత బడ్జెట్ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాక మరోపక్క ‘లైకా’ సంస్థ నిర్వాహకులకూ హీరో కమల్ హాసన్ కి కూడా మనస్పర్థలు ఉన్నాయని సమాచారం. కాబట్టి.. ఇది అంత సులభంగా తెగే వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో రజినీకాంత్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కమల్, మరోవైపు లైకా వారితో రజినీకాంత్ కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్ ఇద్దరితో మాట్లాడి.. ‘భారతీయుడు 3 మిగిలిన భాగం పూర్తయేలా చొరవ తీసుకోనున్నట్టు సమాచారం. అదే జరిగితే దర్శకుడు శంకర్ కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఏదేమైనా... తన సమకాలీకుడైన పోటీ హీరో చిత్రం సమస్యల్లో ఇరుక్కుంటే సంతోషించడం కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగడం రజనీకాంత్ గొప్పతనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ తరహా అసూయా ద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని అలవరచుకోవడమే తెరబయట కూడా చూపే నిజమైన హీరోయిజం అనేది నిర్వివాదం. -
రిస్క్ చేస్తున్న రజినీకాంత్
-
లోకేష్ లైనప్ మామూలుగా లేదుగా..!
-
‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటున్న స్టార్స్
ఏ ఇండస్ట్రీలోనైనా ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించిన మల్టీస్టారర్ ట్రెండ్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఒక సినిమాలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కవ స్టార్స్ నటిస్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితులు తగ్గిపోతున్న ఈ తరుణంలో టాప్ హీరోలు ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం ఓ మంచి పరిణామమే. ఇలా తాజాగా ‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటూ ఆడియన్స్ ముందుకు రానున్న కొన్ని మల్టీస్టారర్ తరహా సినిమాలపై ఓ లుక్ వేద్దాం. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం సీనియర్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్ ఒకే సినిమాలో స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ సూపర్‌గా ఎగ్జైట్ అవుతారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకు రానున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోనే వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో వెంకటేశ్ కూడా కన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. నాలుగో షెడ్యూల్ కోసం అతి త్వరలోనే కొచ్చి వెళ్లనుంది యూనిట్. అక్కడ చిరంజీవి – నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ చిత్రీకరణ, కొంత టాకీ పార్టు, ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరిగే కొత్త షూటింగ్ షెడ్యూల్లో వెంకటేశ్ రాకను అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్. ఇక ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు) అనే డ్రిల్ మాస్టర్‌గా చిరంజీవి, ఆయన భార్య పాత్రలో నయనతార కనిపిస్తారని తెలిసింది. వెంకటేశ్ ΄పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘మన శివశంకర వరప్రసాద్‌గారు, సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా యాక్షన్ జానర్ కాదు... దీంతో స్క్రీన్‌పై చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ఫన్ను జనరేట్ చేయబోతున్నారనే అంశాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. చారిత్రక చిత్రంలో... మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేశ్ ముందుంటారు. గతంలో రామ్‌తో కలిసి ‘మసాలా’, పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు చేశారు వెంకటేశ్. అయితే వెంకీ తాజాగా మరో పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో భాగంగా తానో పెద్ద స్టార్‌తో కలిసి సినిమా చేయబోతున్నానని చెప్పేశారు. ఈ వేడుకలకు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. దీంతో వెంకటేశ్–బాలకృష్ణ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కన్ఫార్మ్ అయిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. తనకు ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేనితో ‘గౌతమి పుత్రశాతకర్ణి’ తరహాలో బాలకృష్ణ ఓ వార్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలోనే వెంకటేశ్ ఓ లీడ్ క్యారెక్టర్లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. కూలీతో కొట్లాట యాక్టర్‌గా కెరీర్లో నాగార్జున కాస్త రూట్ మార్చినట్లుగా ఉన్నారు. ఇటీవల ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమా చేశారు. ఈ సినిమాలో దీపక్ పాత్రలో నాగార్జున మెప్పించారు. అయితే ఇలాంటి కీలక తరహా పాత్రనే ‘కూలీ’ సినిమాలోనూ చేశారు. రజనీకాంత్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగార్జున మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. దేవ ΄ాత్రలో రజనీకాంత్ నటించగా, సైమన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. అయితే సైమన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సినిమాలో రజనీ–నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉంటాయట. అలాగే ఈ ‘కూలీ’ సినిమాలోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ‘దహా’ అనే ఓ పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర ‘కూలీ’ కథను కీలక మలుపు తిప్పుతుందని తెలిసింది. ఇంకా ఇదే చిత్రంలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ‘మోనిక’ అనే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చేశారు. రజనీకాంత్–నాగార్జున–ఆమిర్ ఖాన్–ఉపేంద్ర–శ్రుతీహాసన్... ఇలాంటి టాప్ యాక్టర్స్‌తో ‘కూలీ’ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్ సినిమాకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. సీక్వెల్ సిద్ధమౌతోంది! ప్రభాస్ మెయిన్ లీడ్‌గా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్, ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షనల్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్హాసన్ల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాయి. ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్ షూటింగ్ ఈ సెప్టెంబరులో ప్రారంభం కానుందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అశ్వనీదత్. ఈ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ చిత్రంలో కూడా ప్రభాస్ పాత్రకు దీటుగానే అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్హాసన్ల పాత్రలు ఉంటా యని తెలిసింది. తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’లో కనిపించిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీల రోల్స్ కూడా సీక్వెల్లో మరింత నిడివి ఎక్కువగా కనిపించనున్నాయట. ఇలా ఈ సీక్వెల్ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్‌గా ఆడియన్స్‌ను అలరించనుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ వార్ నార్త్‌లో హృతిక్ రోషన్ సూపర్ స్టార్. సౌత్‌లో ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చేసిన భారీ యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ డ్రామా సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ మరో లీడ్ రోల్ చేశారు. ఎన్టీఆర్‌కు తొలి స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ కూడా ‘వార్ 2’యే కావడం విశేషం. ఇటీవల ఈ ‘వార్ 2’ సినిమా నుంచి విడుదలైన టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు సినిమా లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్–ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు యాక్షన్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయనిపిస్తోంది. అంతేకాదు... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మధ్య ఓ సూపర్ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్. ఇలా సినిమా లవర్స్‌కు ‘వార్ 2’ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీగా కనిపిస్తోంది. వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూ΄÷ందిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్, టైగర్ జిందా హై’, హృతిక్ రోషన్ – టైగర్ ఫ్రాష్ల ‘వార్’, షారుక్ ఖాన్ ‘పఠాన్’ వంటి సినిమాలొచ్చాయి. హీరోయిన్స్ ఆలియా భట్–శార్వరీ చేసిన ‘ఆల్ఫా’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కాగా ‘వార్ 2’ కూడా ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న సినిమాయే కనుక ఈ యూనివర్స్‌లోని ఇతర చిత్రాల్లో హీరోలుగా నటించిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో కనిపించే చాన్స్ ఉందట. ఇదే జరిగితే... యాక్షన్ లవర్స్‌కి ‘వార్ 2’ మరింత మజానిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చో్ర΄ా ఈ సినిమాను నిర్మించారు. హీరో వర్సెస్ ఫ్యాన్ కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ కన్నడ హీరో తాజాగా నటిస్తున్న తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఇందులో రామ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ సినీ సూపర్ స్టార్ హీరో, అతని ఫ్యాన్‌కి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో సూపర్‌స్టార్ సూర్యకుమార్ ΄ాత్రలో ఉపేంద్ర, సూర్యకుమార్ అభిమాని ΄ాత్రలో రామ్ కనిపిస్తారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నైట్ షూట్లో రామ్–భాగ్యశ్రీలపై లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరిగతిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ ఓ ΄ాట రాశారని, ఈ పాటను తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పాడతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మల్టీస్టారర్ సినిమాలంటే... ఇద్దరు, ముగ్గురు హీరోలున్న సినిమాలే కాదు... అలానే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ సిల్వర్‌స్క్రీన్‌పై ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కథ రీత్యా..తాత –తండ్రి – ఇద్దరు కొడుకులు... ఇలా నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారట. అల్లు అర్జున్ పాత్రలకు తగ్గట్లే... ఈ సినిమాలో నలుగురు ప్రధాన హీరోయిన్స్ రోల్స్ ఉంటాయని, మరో కీలక పాత్రలో ఇంకో హీరోయిన్ కనిపిస్తారని.. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌లో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయ్యారు. ఇంకా ఖరారై΄ోయిన వారిలో జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాగూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐదో హీరోయిన్ పాత్ర కోసం భాగ్య శ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా.ఎఫ్‌లపై టెస్ట్ షూట్ జరిగిందని, వీరిలో ఒకరు ఫైనల్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఇలా ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఐదుగురు హీరోయిన్స్ ఒకే సినిమాలో నటించనుండటం, వీరిలో ఇద్దరు పవర్ఫుల్ వారియర్ రోల్స్ చేస్తుండటం, అందులోనూ రష్మికా విలన్ పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి రావడం అనేది ఆడియన్స్‌ను కచ్చితంగా ఎగ్జైట్ చేసే విషయమే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహాలో మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకా అని ఆశ్చర్యపోయా
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్‌తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'(ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్‌తో నటి డేటింగ్)''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్‌తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది.(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) He is 75 now Best orator when comes to stage speeches . The way he kept audience engaging 🔥🔥🔥Ultimate hilarious fun mode 😂😂Mr . Rajinikanth 😂Kamalhaasan elevation 🔥Sivakumar ayya elevation 🔥Dmk function 😂😂Cooling glass slow motion 😂Why I’m chief for this… pic.twitter.com/plbtMjBLQO— Suresh balaji (@surbalutwt) July 11, 2025 -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
చిటుకు... చిటుకు
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, ‘దిల్’ రాజు యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిటు..’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని అనిరు«ధ్, అరివు పాడారు. ‘‘కూలీ’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన ‘చికిటు..’ పాటకి మంచి స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: గిరీష్ గంగాధరన్. -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.రజినీకి భారీ పారితోషికం..ఈ మూవీ బడ్జెట్‌తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.#Chikitu 💃🕺 - https://t.co/TcCvuNmTSE#Coolie #CoolieFirstSingle Superstar @rajinikanth in a @Dir_Lokesh directorial 💥 @sunpictures ⚡️With the legendary TR sir, the genius @Arivubeing and thank you @iamSandy_Off for making us dance🙏🏻#Coolie releasing worldwide August… pic.twitter.com/KGjY2S3v8g— Anirudh Ravichander (@anirudhofficial) June 25, 2025 -
ధనుష్, రజనీకాంత్‌లతో భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జననాయకన్ చిత్రం కథ గురించి పలు రకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా ఇది సమకాలీన రాజకీయాలను తెరపై ఆవిష్కరించే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కథను దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేసిందనే ప్రచారం జరిగింది. మొత్తం మీద నటుడు విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అంటే 2026 జనవరి 8వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో దర్శకుడు హెచ్ వినోద్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తదుపరి ధనుష్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు హెచ్ వినోద్ నటుడు రజనీకాంత్‌ను కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కథ చెప్పడానికే హెచ్ వినోద్ నటుడు రజనీకాంత్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఈయన హెచ్.వినోద్ దర్శకత్వంలో నటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. రజనీతో ఛాన్స్ లేదంటే ధనుష్‌తో ప్లాన్ చేస్తారా అనే టాక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్‌తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్‌ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్‌కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్‌ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్‌ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా వచ్చే వారం థియేటర్లలోకి రానుంది. రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొచ్చిలో ఆ ఈవెంట్ చేసి కొంతమేర మలయాళ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు తమిళ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్‌తో విష్ణు ముందుకొచ్చాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి సినిమా చూపించారు. దీంతో ఆయన తన అభిప్రాయాన్ని విష్ణుతో చెప్పగా.. ఆ విషయాన్ని వీడియో, ట్వీట్ రూపంలో విష్ణు బయటపెట్టాడు.మంచు ఫ్యామిలీకి రజినీకాంత్ సన్నిహితంగా ఉంటారు. గతంలో మోహన్ బాబుతో కలిసి 'పెదరాయుడు' సినిమాలో రజినీ నటించారు. తాజాగా ఆదివారంతో ఆ చిత్రానికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఆ చిత్ర సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు 'కన్నప్ప' సినిమాని కూడా అందరూ కలిసి వీక్షించారు. ఈ క్రమంలోనే రజినీకాంత్.. తనని హత్తుకుని మెచ్చుకున్నారని విష్ణు తెగ ఆనందపడిపోతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)'రజినీకాంత్ అంకుల్ 'కన్నప్ప' సినిమా నిన్న రాత్రి చూశారు. పూర్తయిన తర్వాత నాకు గట్టిగా హగ్ ఇచ్చారు. మూవీ చాలా నచ్చిందని నాతో చెప్పారు. ఓ నటుడిగా ఈ హగ్ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూశాను. దీంతో ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది' అని మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు.'కన్నప్ప'లో విష్ణు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?)Last night, @rajinikanth uncle watched #Kannappa. After the film, he gave me a tight hug. He told me that he loved #Kannappa. I’ve been waiting 22 years as an actor for that hug!!!Today, I feel encouraged. Humbled. Grateful. #Kannappa is coming on 27th June and I can’t wait… pic.twitter.com/HDYlLuDsdc— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2025 -
కథ, పాత్రలో దమ్ముంటే చాలు ఇలాంటి సినిమాలు హిట్టే
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్‌లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.పైగా పోలీస్ బ్యాక్‌డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్‌గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్లో తొలిసారి... వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్‌లో, పవర్ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఏ రేంజ్లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. పోలీస్ జాతర పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్‌గా తనదైన మేనరిజమ్‌తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్‌గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్‌లో... పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డబుల్ ధమాకా హీరో కార్తీ పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట. హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్‌లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్‌గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్‌లో చూపించారు మేకర్స్.స్పై పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.రెండోసారి... హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎల్వీసీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్‌కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రక్షక్! నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తండ్రి బాటలో... పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్‌పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
రజనీకాంత్ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్
సోషల్‌మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్ అవుతుంది. రజనీకాంత్ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.ఈ ఫోటో 2018 నాటిది. రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్‌లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్‌కు రూ. 50 వేలు దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్‌కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు. దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్‌కు తెలిపారు. అందుకు స్పందించిన రజనీ.. యాసిన్‌తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు. రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్‌ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.This child sitting on the lap of superstar Rajnikanth became an example of honesty in Tamil Nadu. Mohammad Yasin found 50 thousand rupees on the road. He went straight to the police station and gave the money to the police officer and said "I found this money on the road.… pic.twitter.com/Vy4wrozbzO— Gabbar (@Gabbar0099) June 1, 2025 -
బక్రీద్ కానుకగా ఓటీటీలో 'లాల్ సలామ్'.. అధికారిక ప్రకటన
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ 'లాల్ సలామ్'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారుబక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్ నెక్ట్స్(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్ మొదట నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్‌ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ ఢీల్‌ను క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.కథేంటంటే'లాల్ సలామ్' కథ మొత్తం 1990ల కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తోంది. మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్).. దాడి చేసిన గురు కూడా మొయిదీన్ భాయ్‌కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్ లివింగ్‌స్టోన్) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్ట్స్‌లో లాల్ సలామ్ చూడాల్సిందే. -
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లూ, డ్యాన్సులూ వేసినా సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని..సక్సెస్‌నూ వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటవలి కాలంలో సీనియర్ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్తవయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్‌లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలో తాజాగా సినీరంగంలో హల్చల్ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి చెబుతోంది. అదేమిటంటే జైలర్ 2 సినిమాలో అతిధి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని.. కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.20కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇవ్వడానికి జైలర్2 నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృస్ణ కొత్త రికార్డ్ సాధించారని చెప్పొచ్చు. మొదటి నుంచీ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికం రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపే వాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా... బాలకృష్ణ కెరీర్లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ.గత 2014లో లెజెండ్ తర్వాత లయన్, డిక్టేటర్, గౌతమ్ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా, కధానాయకుడు పార్ట్ 1, కధానాయకుడు పార్ట్ 2, రూలర్... వరకూ వరుస ప్లాఫులే. ఆ తర్వాత ‘అఖండ’తో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకూ మహరాజ్..లు హిట్స్‌గా నిలిచాయి.అంటే పదేళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు. హిట్టయిన నాలుగింటిలోనూ బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్‌కు కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వచ్చే జూన్ 10వ తేదీతో 65ఏళ్లు నిండుతున్న బాలయ్య... రేపోమాపో యువహీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి. -
జైలర్‌తో విద్య?
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ ’(2023) చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఇదిలా ఉంటే.. ‘జైలర్ 2’లో విద్యా బాలన్ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ టాక్. ఇటీవల విద్యా బాలన్ని కలిసి, ‘జైలర్ 2’ కథ చె΄్పారట నెల్సన్. చిత్రకథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ‘జైలర్ 2’లోనూ ఆమె అదే పాత్రలో కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో విద్యా బాలన్ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ‘జైలర్ 2’లో హీరో బాలకృష్ణ నటించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించారు. మరి... ‘జైలర్ 2’లో కూడా నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
రజినీకాంత్ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రంగా నిలవనుంది. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.ఈ మూవీ బడ్జెట్‌తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం. ఇవన్నీ కలిపితే కూలీ బడ్జెట్ రూ.375 పైగానే ఉండనుంది.భారీ ధరకు కూలీ ఓటీటీ రైట్స్..ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 240 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో 'జైలర్ 2లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి) -
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడూ ఫుల్ లెన్త్ సినిమాలు చేసే బాలయ్య తొలిసారి రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సన్‌పిక్చర్స్ సంస్థ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్‌లో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఇందులో కూడా వారందరూ నటించనున్నారు. ప్రస్తుతం వారి సరసన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ చేరనున్నట్లు సమాచారం.రజనీకాంత్ కోసం జైలర్2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పోలీస్ ఆఫీసర్‌గా రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహా వంటి సినిమాల్లో ఆయన మెప్పించారు. ఇప్పుడు చాలారోజుల తర్వాత జైలర్2 కోసం పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అదికూడా సుమారు 5నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.జైలర్2తో తాను నటించబోతున్నట్లు రీసెంట్గా శివరాజ్‌కుమార్ ఫైనల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. -
తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)
-
రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. -
ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన రజనీకాంత్
-
అమ్మతోడు.. జైలర్‌లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్‌కుమార్
రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ (Jailer Movie) వచ్చి రెండేళ్లవుతోంది. అప్పట్లో జైలర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కుతోంది. జైలర్ 2లో తన ఎంట్రీ ఉందని కన్ఫామ్ చేసేశాడు శివరాజ్‌కుమార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా కన్నడ చిత్రం 45. వెంటనే ఒప్పేసుకున్నా..ఈ సినిమా ఈవెంట్లో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. జైలర్ సినిమాను రజనీకాంత్ కోసమే చేశాను. చిన్నప్పటినుంచి ఆయన్ను చూస్తూ ఉన్నాను. తను నాకు నా కుటుంబంలోని వ్యక్తిలాగే అనిపిస్తాడు. రజనీకాంత్ సినిమా అనగానే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. ఆయన నాకు తండ్రిలాంటివాడు. అందుకే ఎంత చిన్న పాత్రయినా సరే రెడీ అని చెప్పాను. కథేంటని కూడా అడగలేదు. వాళ్లే పిలిచి మరీ కథంతా చెప్పారు. ఏదేమైనా సరే, నేను యాక్ట్ చేస్తానని భరోసా ఇచ్చాను.అమ్మతోడు.. ఏం చేశానో..కానీ నా లుక్, రోల్ అంత బాగా ఎలా వర్కవుట్ అయిందనేది నాకిప్పటికీ అర్థం కాదు. సినిమా రిలీజయ్యాక దేశవిదేశాల నుంచి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అదిరిపోయిందని పొగిడారు. నేను చేసిందే రెండు సీన్లు కదరా అంటుంటే కూడా సూపర్ అని మెచ్చుకున్నారు. అమ్మతోడు.. నేనంత గొప్పగా ఏం చేశానో నాకిప్పటికీ అర్థం కాదు. సిగరెట్ పట్టుకుని నడిచావ్, టిష్యూ డబ్బా తన్నావు.. అంతకుమించి ఏం చేశావ్? అని నా భార్య ఇప్పటికీ దెప్పి పొడుస్తుంది.బహుశా అదే కారణమేమో!బహుశా గుడ్ లుక్స్ వల్ల కావొచ్చు. ఈ విషయంలో డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నన్ను బాగా చూపించిన కెమెరామెన్‌కు థాంక్స్ చెప్తున్నాను. జైలర్ 2లో కూడా నేను కనిపించబోతున్నాను అని పేర్కొన్నాడు. జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ భాగమయ్యారన్న ప్రచారం గురించి తనకేమీ తెలియదన్నాడు.చదవండి: కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్ -
జైలర్ - 2లో నేనున్నా.. సీనియర్ హీరోయిన్
పని చేసుకుంటూ పోతే వయసు గుర్తుకు రాదంటారు. అది రజనీకాంత్ విషయంలో అక్షరాల నిజం అవుతోంది. జైలర్ చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న రజినీకాంత్ ఆ తర్వాత వేట్టైయాన్ చిత్రం చేశారు. తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రం పూర్తి చేశారు. ఆ వెంటనే తాజాగా జైలర్ –2 చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం కోయంబత్తూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే రజినీకాంత్ జైలర్– 2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్లారు. జైలర్ చిత్రంలో టైగర్ ముత్తు వేల్ పాండియన్‌గా నటించిన రజనీకాంత్ సీక్వెల్లోనూ అదే పాత్రలో నటిస్తున్నారు. అందులో ఆయనకు కూతురుగా నటించిన మలయాళ నటి మిర్ణా మోహన్ కూతురుగానే నటిస్తున్నారు. ఇకపోతే జైలర్ చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆయనకు జతగా నటిస్తున్నారు. దీని గురించి నటి రమ్యకృష్ణ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ జైలర్–2 చిత్ర షూటింగ్లో తాను గత 10వ తేదీ నుంచి పాల్గొంటున్నట్లు తెలిపారు. అదే తేదీ తాను రజనీకాంత్ కలిసి నటించిన పడయప్ప చిత్రం 26 వసంతాలను పూర్తి చేసుకున్న రోజు అని పేర్కొన్నారు. జైలర్–2 చిత్రంలో మళ్లీ రజనీకాంత్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులోకి నటుడు యోగిబాబు, ఎస్జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కోయంబత్తూరు, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఏకదాటిగా 35 రోజులు జరుపుకుంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రోమో ను విడుదల చేసిన విషయం, అది రజనీకాంత్ అభిమానులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే. -
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు రాజకీయ వైర్యం కొనసాగిన సంగతి తెలిసిందే. 1996లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్, జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే, దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు" అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ రంగంలో సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచాయి. తాజాగా ఈ ‘రాజకీయ వివాదం’పై రజనీకాంత్ స్పందించారు. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో ఆయన వివరిస్తూ.. మాజీ మంత్రి వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే.. తనను వ్యతిరేకంగా మాట్లాడేలా చేసిందని చెప్పారు.వీరప్పన్ పదవి పోయిందిసినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్, రజనీకాంత్ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరప్పన్ సత్య మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ‘బాషా’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా వీరప్పన్ మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందట. ఈ వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని.. రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని అన్నారు. రజనీ వాఖ్యలు జయలలిత కోపానికి కారణం అయ్యాయట. దీంతో మంత్రిగా ఉన్న వీరప్పన్ని పదవి నుంచి తొలగించారట. జయలలితపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం అని రజనీ అన్నారు.వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు ‘నేను జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం, ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్ కారణంగా వీరప్పన్ పదవి పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడాను. జయలలితతోనూ మాట్లాడతానని చెప్పాను. అయితే వీరప్పన్ మాత్రం దానికి అంగీకరించలేదు. ‘నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దను. నాకు ఏ పదవి అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. నేను చాలా బాధపడ్డాను. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి’ అని రజనీకాంత్ అన్నారు. వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ఆర్వీఎం: ది కింగ్‌మేకర్’ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఈ వివాదం గురించి స్పందించాడు. -
విగ్ కూడా పెట్టుకోరు.. రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) బయట ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎక్కువగా తెల్ల పంచె, షర్ట్ ధరించే కనిపిస్తాడు. సినిమా ఈవెంట్స్‌కి కూడా అలానే వెళ్తాడు. అవసరం అయితే తప్ప మేకప్ వేసుకోరు. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు ఎంత మంది ఉన్నారో..ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వాళ్లుకూడా అంతే ఉన్నారు. తాజాగా ఇదే విషయాన్ని చెబుతూ..రజనీకాంత్‌పై బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా(Mukesh Khanna) ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ హీరోలలో ఎంతో మందికంటే రజనీకాంత్ చాలా గొప్పవాడని, రియల్ హీరో అంటే ఆయనేనని పొగడ్తలతో ముంచేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు రజనీకాంత్‌ని వ్యక్తిగతంగా కలవలేదు. కానీ ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు కూడా మేకప్ వేసుకోరు. కనీసం విగ్గు కూడా ధరించడు. ఫ్యాన్స్‌తో ఓ సామాన్య వ్యక్తిలాగే ప్రవర్తిస్తాడు.బాలీవుడ్ హీరోల్లో ఎవరూ కూడా రజనీకాంత్‌లా ఉండలేరు. మేకప్ లేకుండా వాళ్లు బయట తిరగలేరు. వాళ్లతో పోలిస్తే రజనీకాంత్ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన రియల్ హీరో’ అని మేకేష్ చెప్పుకొచ్చాడు. తన సినీ కెరీర్ గురించి చెబుతూ.. డైలాగులు లేని కారణంగా చాలా పెద్ద సినిమాలు వదులుకున్నానని చెప్పారు. విలన్‌గా చేయడం ఇష్టంలేక సినిమాలను దూరం పెట్టానని చెప్పారు. ‘మహాభారతం’ సీరియల్లో మొదట దుర్యోధనుడి పాత్ర ఇస్తే నో చెప్పానని, ఆ తర్వాత భీష్ముడి పాత్ర వచ్చిందని చెప్పారు. బాలీవుడ్ హీరోలపై ముకేశ్ ఖన్నా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి."రూహీ"(1981) చిత్రంలో ముకేశ్ ఖన్నా తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత అతను "వక్త్ కీ దీవార్" (1981), "దర్ద్ కా రిష్తా" (1982) వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించాడు. 1980లలో అతను అనేక హిందీ చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించాడు, కానీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైన "శక్తిమాన్" అనే టెలివిజన్ సీరియల్‌తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో అతను శక్తిమాన్ అనే సూపర్‌హీరో పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతన్ని ఇంటింటికీ చేర్చింది, ముఖ్యంగా పిల్లల్లో అతను అత్యంత ప్రజాదరణ పొందాడు. "శక్తిమాన్" సీరియల్‌ను అతను స్వయంగా నిర్మించడం విశేషం.‘మహాభారతం’ లో పోషించిన భీష్మ పాత్ర అతన్ని భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. నటనతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చాటిన ముకేష్ ఖన్నా, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. -
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, ధోనీ.. హెయిర్ కట్ కోసం ఎంత చెల్లిస్తారంటే..
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్‌నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్‌కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్‌కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్‌స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్‌స్టార్స్‌కు హెయిర్‌స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్‌కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదేఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
కూలీ కంప్లీట్
‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, షౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గెస్ట్ రోల్లో ఆమిర్ ఖాన్, స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే నటించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.కాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ధృవీకరించారు మేకర్స్. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. -
శ్రీవారి దర్శనం పేరుతో నటిని మోసగించిన దళారి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. పేద వాడి నుంచి వీఐపీల వరకు స్వామి దర్శనం కోసం చాలా దూరం నుంచి వెళ్తుంటారు. అయితే, ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో తనను మోసం చేశారని సినీ నటి పేర్కొన్నారు. స్వామిని దర్శించుకునేందుకు కొందరు ఆన్లైన్లో దర్శన టికెట్లు కొంటే.. మరికొందరు సిఫార్సు లేఖలతో తిరుమల చేరుకుంటారు. ఇంకొందరు సరైన అవగాహన లేకుండా శ్రీవారి దర్శనం, సేవ, లడ్డూలు, గదుల కోసం దళారులను నమ్మి మోసపోతున్నారు. గతంలో ఏడాదికి 50-60 వరకు కేసులు నమోదవుతుండగా.. కేవలం ఈ రెండు నెలల్లోనే 30కి పైగా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించిన ప్రముఖ నటి 'రూపిణి'ని తిరుమల దర్శనం పేరుతో ఒకరు మోసం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ముంబైలో కుటుంబంతో సెటిల్ అయిపోయారు. అయితే, ప్రతి ఏడాది ఆమె కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన శరవణన్ అనే వ్యక్తి ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి రూపిణిని సంప్రదించాడు. అందుకు గాను అతనికి రూ. 1.5 లక్షలు ఆమె బదిలీ చేశారు. అయితే, ప్రత్యేక దర్శనం టికెట్లు అతను పంపకపోవడంతో గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆపై అతను ఫోన్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని రూపిణి గ్రహించారు. తనను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.1980ల చివరలో తమిళ సినిమా రంగంలో ప్రముఖ నటిగా రూపిణి రాణించారు. రజనీకాంత్‌తో కలిసి మనితన్ చిత్రంలో హీరోయిన్గా నటించించారు. ఒంటరి పోరాటం, గాండీవం వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె కీలకపాత్రలలో నటించారు. మైఖేల్ మదన కామ రాజన్,విచిత్ర సోదరులు వంటి చిత్రాలలో కమల్ హాసన్‌తో నటించారు. 1995లో మోహన్ కుమార్‌తో వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. ముంబైలో బాగా చదువుకున్న కుటుంబంలో జన్మించిన రూపిణి డాక్టర్ విద్యను పూర్తి చేశారు. -
రజినీకాంత్ 'కూలీ' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
'జైలర్' కోసం నమ్మించి మోసం చేయాలనుకున్నారు: మలయాళ నటి
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన కూడా స్కామ్‌లతో పాటు మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ఛాన్స్‌ల పేరుతో కొందరు చేస్తున్న మోసాలకు చాలామంది బలి అవుతున్నారు. ఇదే విషయాన్ని మలయాళ నటి షైనీ సారా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని కొందరు మోసానికి పాల్పడినట్లు ఆమె గుర్తుచేసుకుంది. ఆయనకు సతీమణిగా నటించే అవకాశం ఉన్నట్లు తనను ఒక టీమ్ నమ్మించేందుకు ప్లాన్ చేసిందని ఆమె తెలిపింది.జైలర్ చిత్రంలో రజనీకాంత్ భార్య పాత్ర కోసం తనను ఎంపిక చేసినట్లు వాట్సాప్‌లో ఒక మేసేజ్ వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత తాను మొదట నమ్మానని షైనీ సారా వివరించింది. తరువాత, ఆమె వద్ద నటుల సంఘం సభ్యత్వ కార్డు ఉందా అని వారు అడగడంతో .. అవేవీ లేవని చెప్పినట్లు తెలిపింది. అయతే, ఆ స్కామర్ ఆ సభ్యత్వం తానే ఏర్పాటు చేస్తానని ముందుకొచ్చాడంటూ ఆమె ఇలా చెప్పింది. 'రెండు రోజుల తర్వాత సురేష్ కుమార్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. చీర ధరించి వీడియో కాల్లోకి రావాలని కోరాడు. కాల్ తర్వాత, నేను ఎంపికి అయ్యానని చెప్పారు. కానీ, సభ్యత్వ కార్డు కోసం రూ. 12,500 చెల్లించమని అడిగారు. అనుమానం వచ్చి, నేను ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో కనీసం కొంత మొత్తాన్ని అయినా సరే పంపమని కోరారు. అప్పుడు నా సందేహాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆ తర్వాత నా తోటి నటులను సంప్రదించాను. నటనకు సభ్యత్వం తప్పనిసరి కాదని వారు నిర్ధారించారు. దీంతో మళ్లీ ఆ వ్యక్తిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. సినీ పరిశ్రమలో ఇలాంటి మోసాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇతరులను హెచ్చరించింది. -
భారీ రేటుకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’ (Coolie). ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేయలేదు. కానీ..అప్పుడే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయట.ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయట. చివరకు ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత
దాదాపు 40 ఏళ్ల చరిత్ర గల మరో థియేటర్ నేలమట్టమైంది. సూపర్‌స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమైన బృందా థియేటర్.. దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులమీదుగా బృందా థియేటర్ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ థియేటర్‌ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్‌కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
'ముత్తువేల్ పాండియన్' వేట మొదలైంది
రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ 2023 సినిమా భారీ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అధికారికంగా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది చెప్పలేదు. తాజాగా, ఈ అంశం గురించి సన్‌పిక్చర్స్ అప్డేట్ ఇచ్చేసింది. ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుందని మేకర్స్ ప్రకటంచారు. ముత్తువేల్ పాండియన్ వేట ఇప్పుడే ప్రారంభమైంది అంటూ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు.జైలర్2 షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించడంతో రజనీకాంత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘టైగర్ కా హుకుమ్’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇకపోతే జైలర్ చిత్రంలో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితర ప్రముఖ నటీనటులే నటించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. దీంతో వెంటనే ఆయన జైలర్2 ప్రాజెక్ట్‌లోకి షిఫ్ట్ అయిపోయారు. -
ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్.. దర్శకుడిపై రజనీ ప్రశంసలు!
ఏమి రైటింగ్. ఫెంటాస్టిక్. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon) ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్ ఇటీవల డ్రాగన్ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్ అంటూ డ్రాగన్ చిత్ర కథ గురించి అభినందించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్ మారిముత్తు తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rajini sir : what a writing Ashwath ! Fantastic fantastic !!🥹🥹nalla padam pannanum, padatha pathutu Rajini sir veetuku kooptu wish panni namma padatha pathi pesanum !! Ithu director aganum nu kasta patu ozhaikra ovoru assistant director oda Kanavu ! Kanavu neraveriya nal… pic.twitter.com/IFuHhNkqjY— Ashwath Marimuthu (@Dir_Ashwath) March 5, 2025 -
'రజినీకాంత్ మూవీ సెట్లో సందీప్ కిషన్.. అసలు కారణం ఇదే'
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్గా నటించారు. మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ ప్రశ్నకు సందీప్ సమాధానమిచ్చారు. రజినీకాంత్ కూలీ మీరు నటిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో మనం ఓ లుక్కేద్దాం.రజినీకాంత్ మూవీ కూలీలో తాను నటించడం లేదని సందీప్ కిషన్ అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన ఫ్రెండ్ కావడంతోనే కూలీ సెట్‌కు వెళ్లానని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని వెల్లడించారు. నేను దాదాపు 45 నిమిషాల పాటు కూలీ సినిమాను వీక్షించానని సందీప్ వివరించారు. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని తెలిపారు. రజినీకాంత్ సార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని మన యంగ్ హీరో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేశ్ కనగరాజ్‌తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా.. కూలీ మూవీ సెట్స్ నుంచి లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సందీప్ కిషన్ ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆయన నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!)సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 27 న మేకర్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్కరం బంగారం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరిగే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నరు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
రెండు వారాల్లో రజనీకాంత్ 'కూలీ' నుంచి అదిరిపోయే గిఫ్ట్
అభిమానులే కాదు, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూసే కథానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కూలీ ఒకటి. కారణం ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కావడమే. అంతేకాదు. లోకేశ్ కనకరాజ్ వంటి క్రేజీ దర్శకుడు, సన్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థ చేస్తున్న చిత్రం ఇది. ఇకపోతే నటి శృతిహాసన్, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, తెలుగు స్టార్ నటుడు నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటూ ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూడా కీలక పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు క్రేజీ నటి పూజాహెగ్డే ఒక ప్రత్యేక పాటలో మెరుపులు మెరిపించనున్నారని సమాచారం. ఇక అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై ఎవరికై నా ఎందుకు ఆసక్తి ఉండదు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరికుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా కూలీ చిత్ర వర్గాల నుంచి వచ్చిన ఓ అప్డేట్ ఈ చిత్ర టీజర్‌ను రెడీ చేశారట. ఈ చిత్ర టీజర్ చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు ఫుల్‌జోష్‌లో ఉన్నారట. దీన్ని మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం. మార్చి 14న లోకేశ్ కనగరాజ పుట్టినరోజు ఉంది. అదే రోజున కూలీ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు. -
'రేలంగి మామయ్య'గా రజనీకాంత్? చేసుంటే మాత్రం..
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. ఈ సినిమా పేరు చెప్పగానే అద్భుతమైన సినిమా గుర్తొస్తుంది. తెలుగు సినిమా పోకడలు ఏం లేని క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ స్టోరీ తెగ నచ్చేస్తుంది. 12 ఏళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని.. మార్చి 7న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందంటే?దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. రేలంగా మామయ్య పాత్ర కోసం రజినీకాంత్ ని తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో కలిసి కథ కూడా వినిపించారు. స్టోరీ నచ్చి, తెలుగులో నటించే ఆసక్తి ఉన్నప్పటికీ అప్పుడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రజనీకాంత్ సినిమాలో నటించలేకపోయారని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఇది 40 ఏళ్ల ప్రేమ.. ఉపాసన పోస్ట్ వైరల్)స్టార్ హీరోలని సాధారణ వ్యక్తులుగా చూపెడుతున్నప్పుడు.. తండ్రి పాత్ర కోసం రజినీకాంత్ ని ఎందుకు తీసుకోకూడదనిపించింది. ఆయన నటించకపోయినా సరే కథ చెప్పానని ఆనందం తనకు ఉండిపోయిందని దర్శకుడు చెప్పాడు.పెద్దోడు-చిన్నోడు పాత్రల్లో వెంకటేశ్, మహేశ్ బాబు నటించగా.. ఇతర పాత్రల్లో సమంత, అంజలి, జయసుధ తదితరులు నటించారు. రజినీకాంత్ మిస్ చేసుకున్న రేలంగి మామయ్య పాత్రని ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించి అందరికీ తెగ నచ్చేశాడు.(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా) -
చిరంజీవి, రజనీకాంత్.. హాలీవుడ్ సినిమాల్లో?
ఇటీవల మన తెలుగు హీరోలు గ్లోబల్ స్టార్లుగా మారుతున్నారు. ఇప్పటి దాకా చూస్తే హాలీవుడ్( Hollywood) సినిమాల్లో బాలీవుడ్ తారలకు వచ్చిన స్థాయిలో దక్షిణాదికి అవకాశాలు రాలేదు. అయితే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీయార్...లు ఇప్పుడు హాలీవుడ్లో సైతం చర్చకు వస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే... మరికొన్ని టాలీవుడ్ హీరోల చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము రేపితే త్వరలోనే హాలీవుడ్ సినిమాలో తెలుగు హీరోని చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా తీయాలని ఉందని సూపర్ మ్యాన్ సినిమా దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరోసారి దక్షిణాది హీరోలు హాలీవుడ్ తెరంగేట్రం టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది. అయితే దక్షిణాది హీరోలు హాలీవుడ్ ని ఆకర్షించడం, అక్కడి సినిమాల్లో నటించే అవకాశం మరీ అంత అందని ద్రాక్ష ఏమీ కాదు. గతంలోనూ పలువురు దక్షిణాది హీరోలు నటించిన దాఖలాలు ఉన్నాయి. గత 2018లో దక్షిణాది స్టార్ ధనుష్ హాలీవుడ్ చిత్రంలో నటించాడు. ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ పేరుతో రూపొందిన ఆ చిత్రంతో పాటు ఆంథోనీ, జోయ్ రుస్సో దర్శకత్వం వహించిన ది గ్రే మ్యాన్ అనే చిత్రంలోనూ నటించాడు. సోనీ ప్రొడక్షన్స్ ఫిల్మ్ స్ట్రీట్ ఫైటర్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.ప్రముఖ దక్షిణాది నటుడు పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించిన నెపోలియన్... గత 2019లో హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆయన అతీంద్రీయ శక్తుల కధతో రూపొందిన థ్రిల్లర్ మూవీ డెవిల్స్ నైట్‌లో నటించాడు. అలాగే అమెరికన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ క్రిస్మస్ కూపన్లో కూడా ఆయన చేశారు. అచ్చ తెలుగు అమ్మాయి అవంతిక వందనపు... పలు తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో కనిపించిన అవంతిక... అమెరికాలో నివసించే హైదరాబాదీ యువతి. ఈమె కూడా మీన్ గాళ్స్ అనే హాలీవుడ్ మూవీలో నటించింది.తమిళ సూపర్ స్టార్ సీనియర్ నటడు రజనీకాంత్(Rajinikanth )... చాలా మందికన్నా ముందే... అప్పట్లో ఒక హాలీవుడ్ చిత్రంలో నటించాడు. అశోక్ అమృత్‌రాజ్, సునంద మురళీ మనోహర్‌లు రూపొందించిన బ్లడ్ స్టోన్ అనే సినిమాలో ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషించాడు. మన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం హాలీవుడ్ చిత్రంలో నటించిన విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తన సమకాలీకుడైన రజనీకాంత్ కన్నా ఓ పదేళ్లు ఆలస్యంగా అంటే 1999లో హాలీవుడ్ లో రంగప్రవేశం చేశారు. థీఫ్ ఆఫ్ బాగ్థాద్ అనే సినిమాలో ఆయన చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. -
రజనీకాంత్‌తో ‘జిగేల్ రాణి’ స్టెప్పులు.. పూజాకి ‘సూపర్’ ఛాన్స్
పూజా హెగ్డే(Pooja Hegde ).. మొన్నటి వరకు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. కానీ ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడం.. కొత్తగా వచ్చిన హీరోయిన్లు దూసుకెళ్లడంతో కాస్త వెనుకబడింది. దీంతో టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఈ పొడుగు కాళ్ల సుందరికీ నిరాశే ఎదురైంది. దీంతో పూజాకి అటు బాలీవుడ్‌లోనూ ఇటు టాలీవుడ్‌లోనూ పెద్దగా అవకాశాలు లభించట్లేదు. కోలీవుడ్‌లో మాత్రం రెండు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది. దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగణ్’తో పాటు కాంచన 4లోనూ పూజా హీరోయిన్గా నటిస్తోంది. ఆ రెండు చిత్రాలు తప్ప పూజా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలాంటి తరుణంలో పూజాగా ఓ ‘సూపర్’ చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేయబోతుందట.‘కావాలయ్యా’తరహాలో ..రజనీకాంత్(Rajinikanth ) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’(Coolie Movie) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఆ పాటకి పూజా హెగ్డేతో స్టెప్పులేయించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం పూజాని సంప్రదించారట. పాట నచ్చడంతో పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఈ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా ఈ పాటలో కనిపించబోతున్నాడని సమాచారం.పూజాకి కొత్తేమి కాదుస్పెషల్ పాటల్లో నటించడం పూజా హెగ్డేకి కొత్తేమి కాదు.హీరోయిన్ గా నటించిన చిత్రాలకంటే.. స్పెషల్ డ్యాన్స్ తో ఇరగదీసిన చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 'రంగస్థలం' చిత్రంలో పూజా హెగ్దే 'జిగేలు రాణి' స్పెషల్ సాంగ్ అప్పట్లో యూత్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటకి పూజా వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లోనూ పూజా ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసింది. అది కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రజనీకాంత్‌తో కలిసి ‘స్పెషల్’ స్టెప్పులేసేందుకు పూజా రెడీ అయింది. ఇక కూలీ విషయానికొస్తే.. లోకేశ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజనీ సరికొత్తగా కనిపించబోతున్నాడట. ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ నెలలో ఈప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐశ్వర్య రజినీకాంత్ (ఫోటోలు)
-
14 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడకు వచ్చాను: రజనీకాంత్
నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మికత బాటపట్టి చాలా కాలమైన విషయం తెలిసిందే. ఒక పక్క షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, కాళీ సమయాల్లో ఆధ్యాత్మికత చింతనతో హిమాలయాలకు వెళ్లి అక్కడ ధ్యానం, యోగా వంటివి చేసి నూతనోత్సాహంతో తిరిగి వస్తుంటారు. అలా ప్రతి చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ గ్యాప్‌లో ఇటీవల జార్కండ్లోని 'యోగా సత్సంగ సొసైటీ రాంజీ' ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఒక వారం గడిపి వచ్చారు. అక్కడ రజనీకాంత్ అనుభవాలను రాంజీ ఆశ్రమం గురించి మీడియాకు విడుదల చేసింది. అందులో రజనీకాంత్ పేర్కొంటూ 'వైఎస్ఎస్ రాంజీ ఆశ్రమానికి తాను ఇప్పటికి 3 సార్లు వెళ్లి వచ్చాను. పరమహంస యోగానందా జీ గదిలో కూర్చుని యోగా చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ అనుభవాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. 14 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇకపై ప్రతి ఏడాది ఈ ఆశ్రమానికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను చాలా వైడ్‌గా ఉన్నట్లు నాకే అనిపిస్తోంది. అందుకు కారణం నేను క్రియా యోగా చేయడమే. 2002లో నుంచి నేను క్రియా యోగా చేస్తున్నాను. ఆరంభ దశలో నాకెలాంటి మార్పు కనిపించలేదు. అయితే 12 ఏళ్ల తరువాత ఆ యోగా వల్ల కలిగిన మార్పును గ్రహించాను. నాలో చాలా ప్రశాంతత, మనశాంతి ఏర్పడింది. క్రియా యోగా శక్తి ఏమిటన్నది దాన్ని గురించి తెలిసిన వారికే అర్థం అవుతుంది. ఇది ఒక పరమ రహస్యం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలంటే ఆ యోగాలో మంచి గురువును కనుగొనాలి. ఆ తరువాత వారిని మనం విడిచి పెట్టినా, వారు మనల్ని వదలరు అని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
మోహన్ బాబు యూనివర్సిటీని సందర్శించిన రజినీకాంత్, ఐశ్వర్య (ఫోటోలు)
-
సీనియర్ హీరోతో 'రష్మిక'కు గోల్డెన్ ఛాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారా..? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా రజనీకాంత్ ఓ హిందీ చిత్రంలో నటించటానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఇందులో కథానాయకగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను(Rashmika Mandanna) నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా మరో చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ( Atlee Kumar) తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ చిత్రంలోనే రజనీకాంత్ కూడా ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్రలో ముందుగా నటుడు కమల్ హాసన్ నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే, ఆయన నిరాకరించడంతో, ఇప్పుడు రజనీకాంత్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఎందిరన్ (రోబో) చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ పరిచయంతో ఇప్పుడు తాను దర్శకత్వం వహించబోయే హిందీ చిత్రంలో రజనీకాంత్‌ను ముఖ్యపాత్రలో నటింపజేయనున్నట్లు తెలుస్తోంది. అలా సల్మాన్ ఖాన్, రజనీకాంత్, రష్మిక మందన్నలతో రేర్ కాంబినేషన్లో చిత్రాన్ని చేయడానికి అట్లీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలవడ లేదు. -
కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి
కోలీవుడ్‌లో సీక్వెల్ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్ హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...జైలర్ తిరిగి వస్తున్నాడురజనీకాంత్ హీరోగా చేసిన ‘జైలర్’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అయ్యాయి. దీంతో ‘జైలర్’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్ తర్వాత ‘జైలర్ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవలే ‘జైలర్ 2’ సినిమాను ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్‌లో, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్‌లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్ 2’లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.వీర శేఖరన్ పోరాటంహీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్.ఈ ఏడాదే ‘ఇండియన్ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్‌హాసన్. కానీ ‘ఇండియన్ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్ 3’ స్టోరీ అని కోలీవుడ్ సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఇండియన్ 3’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఇటు సర్దార్... అటు ఖైదీతండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్’ సినిమా క్లైమాక్స్‌లో ‘మిషన్ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను కన్ఫార్మ్ చేశారు పీఎస్ మిత్రన్. అలాగే జూలైలో ‘సర్దార్’కు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లోనే ‘సర్దార్ 2’ ప్రారంభమైంది.కార్తీ హీరోగా ఎస్జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్‌లో చూడొచ్చు. అప్పుడు మిషన్ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్‌ను మర్చిపోరు ఆడియన్స్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్ ప్లాన్ చేశారు. కానీ లోకేశ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్ షూటింగ్‌ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్ నెక్ట్స్ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.రెండు దశాబ్దాల తర్వాత..!‘7/జీ రెయిన్బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్.తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్. ఈ సీక్వెల్లో ధనుష్‌ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్ అవుతుందని, అప్పట్లో ధనుష్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.అమ్మోరు తల్లినయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్ 2’ను ప్రకటించింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్’లో నటించిన నయనతారనే సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘ముక్కుత్తి అమ్మన్’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్ .సి తెరకెక్కించనున్నారు. సుందర్.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.హారర్ ఎఫెక్ట్!ఇవే కాదు... కమల్‌హాసన్ ‘విక్రమ్ 2’, ధనుష్ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.ఈసారి హారర్ జానర్ సీక్వెల్స్ కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్ ఆధ్వర్యంలో ఆడియన్స్‌ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్ సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సుందర్ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్ .సి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అలాగే హారర్ జానర్లో సంతానం చేస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రం రానుంది. ఎస్. ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది. ఇక 2014లో మిస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్. సీక్వెల్లో ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్.ఆర్ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్ మాత్రం 2026లో ఉండొచ్చు.ప్రకటించారు... కానీ..!కోలీవుడ్‌లో కొన్ని హిట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్స్ ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.విదేశాల్లో డిటెక్టివ్ విశాల్ కెరీర్‌లోని వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌లో ‘తుప్పరివాలన్’ ఒకటి. మిస్కిన్ డైరెక్షన్‌లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్ తీయానులనుకున్నారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్లోనే ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు విశాల్. అయితే కథ విషయంలో మిస్కిన్కు, విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్.తన స్టైల్ ఆఫ్ ‘డిటెక్టివ్ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్ 2’ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్ నుంచి ‘డిటెక్టివ్ 2’ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ రౌండ్ 2 నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్ డైరెక్షన్‌లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని పా. రంజిత్ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్‌గా ‘సార్పట్టై రౌండ్ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.తని ఒరువన్ 2 రవి మోహన్ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్‌గా మార్చుకున్నారు) హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘తని ఒరువన్’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ని ప్రకటించారు మోహన్ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్’తో రవి మోహన్ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్ పరిశీలిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్ ఒరువన్’ మూవీ తెలుగులో ‘ధృవ’ (రామ్ చరణ్ హీరోగా నటించారు)గా రీమేక్ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. – ముసిమి శివాంజనేయులు -
హుకుం.. టైగర్ కా హుకుం...
ఇటీవల సరైన సక్సెస్‌లు లేక సతమతమవుతున్న నటుడు రజనీకాంత్‌కు నూతనోత్సాహాన్ని కలిగించిన చిత్రం జైలర్. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. నటి తమన్న ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ తరువాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తరువాత రజనీకాంత్ నటించిన వేట్టైయన్ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు.ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. కాగా జైలర్ –2 చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను పొంగల్ సందర్భంగా మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేసి రజనీకాంత్ అభిమానులకు కానుకగా అందించారు. నాలుగు నిమిషాల పాటూ సాగే ఆ ట్రైలర్లో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ చిత్ర కథా చర్చల కోసం గోవా వెళతారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా నటుడు రజనీకాంత్ రౌడీలను వెంటాడి వేటాడుతూ వస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైన నెల్సన్, అనిరుధ్ ఈ సన్నివేశం బాగుందే దీన్నే కథగా రూపొందిద్దాం అని అనుకుంటారు. ట్రైలర్ చివరిలో రజనీకాంత్ హుక్కుమ్ టైగర్ కా హుక్కుమ్ అంటారు. మాస్ మసాలాగా రూపొందిన ఈ ట్రైలర్‌కు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్– 2 చిత్ర షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది. -
అర్థమైందా.. రాజా!
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ (2023). ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రానుంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లోనే తెరకెక్కనున్న ‘జైలర్ 2’ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రకటించారు మేకర్స్. త్వరలోనే చిత్రీకరణనుప్రారంభించనున్నట్లు ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్లో వెల్లడించారు. ‘టైగర్ కా హుకుమ్’ సాంగ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు వీడియో చివర్లో ‘అర్థమైందా.. రాజా’ అనే ఓ డైలాగ్ ఉంది. ‘జైలర్ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్ సమాచారం. సన్‌పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. -
రజనీకాంత్ బయోపిక్.. శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
'గేమ్ ఛేంజర్' తర్వాత స్టార్ హీరో బయోపిక్ ప్లాన్ చేస్తున్న శంకర్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందాయి. ఇందిరాగాంధీ, జయలలిత, కామరాజర్, భారత క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రతో చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. నటుడు ధనుష్ ఈ చిత్రంలో ఇళయరాజాగా నటించనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రం ఇప్పుడు డ్రాప్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పుడు నటుడు రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడు శంకర్ (Shankar) చేసిన వ్యాఖ్యలే. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ (Game Changer) చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే, ఈ చిత్రం తర్వాత దర్శకులు శంకర్ మరో సినిమాపై అడుగులు వేస్తున్నారు.తన తదుపరి చిత్రం గురించి శంకర్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించాలన్న కోరికను వ్యక్తం చేశారు. కోలీవుడ్‌లో 50 ఏళ్లుగా కథానాయకుడిగా ఏకచత్రాధిపత్యాన్ని సాగిస్తున్న రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కుతుందా..? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. కాగా దర్శకుడు శంకర్ ఇప్పటికే రజనీకాంత్ హీరోగా శివాజీ, రోబో, 2.ఓ చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన రజనీకాంత్ బయోపిక్‌ను చిత్రంగా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ( ఇదీ చదవండి: ఊహలకు మించి డాకు మహారాజ్ ఉంటుంది: బాలకృష్ణ)కాగా రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రాన్ని సిద్ధం అవుతారని తెలుస్తోంది. అదేవిధంగా దర్శకుడు శంకర్ వెల్పారి చిత్రాన్ని తెర రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గతంలో ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఇందులో సూర్య, విక్రమ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన రజనీకాంత్ బయోపిక్ ఎప్పుడు తెరకెక్కిస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానం రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. మంగళవారం నాడు ఆయన చెన్నై విమానాశ్రయంలో కనిపించగా అక్కడున్న మీడియా కొన్ని ప్రశ్నలడిగింది. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా రజనీ.. 70 శాతం పూర్తయిందని చెప్పాడు. మిగతాది జనవరి 13 నుంచి 28 మధ్య షూటింగ్ చేస్తామన్నాడు. ఇంతలో ఓ జర్నలిస్ట్.. తమిళనాడులో మహిళ భ్రదత గురించి ప్రశ్నించగా రజనీ అసహనం వ్యక్తం చేశాడు. రాజకీయ ప్రశ్నలు అడగవద్దని చెప్పాను కదా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఏం జరిగింది?గతేడాది డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియుడితో మాట్లాడుతోంది. వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి వారిని వీడియో చిత్రీకరించినట్లు వెలుగుచూసింది. ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేసి యువతిని భయపెట్టి లొంగదీసుకున్నట్లు బయటపడింది. లైంగికదాడికి పాల్పడటమే కాకుండా తను చెప్పినప్పుడల్లా రావాలని, తాను చెప్పే సార్ వద్దకు వెళ్లాలని హెచ్చరించడం గమనార్హం. ఇదే తరహాలో మరో అమ్మాయిని కూడా బెదిరింపులతో లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు డీఎంకే పార్టీ కార్యకర్త అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఇది రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో మద్రాస్ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.చదవండి: సంధ్య థియేటర్ ఘటన: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ -
రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం
అభిమానులు లేనిదే ఏ హీరో లేడులే అన్నది వాస్తవం. అందుకే ప్రముఖ నటులు అభిమానులే మా దేవుళ్లు అంటుంటారు. ఈ అభిమానం అన్నది ఎంత వ్యసనం అంటే తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయితే చూడాలని తహ తహలాడుతుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా అభిమానులు సినిమాలు చూడటంతో సరిపెట్టుకోరు. కొందరు తమ అభిమాన నటీనటులకు గుడులు కట్టించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇది అభిమానానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇక నటుడు రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన్ను చూడటానికి అనేకమంది అభిమానులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి సమయంలో రజనీకాంత్ ఇంటి గేటు వరకు వచ్చి చెయ్యి పైకెత్తి అభివాదం చేస్తే చాలు.. వాళ్ల జన్మ ధన్యమైనట్లు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. కాగా అలాంటి వీరాభిమాని ఒకరు నటుడు రజనీకాంత్‌కు గుడి కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు.. అతని పేరు కార్తీక్. ఇతను ఓ మాజీ సైనికుడు కావడం విశేషం. మధురై జిల్లా, తిరుమంగంలో అతను రజనీకాంత్‌కు గుడి కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి రప్పించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి తన ఇంటిని చూపించి వారితో ఫొటోలు దిగి, బాబా విగ్రహాన్ని కానుకగా అందించి సంతోష పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. #WATCH | Tamil Nadu: Fans of actor Rajinikanth offered prayers at Rajinikanth temple in Madurai on the occasion of his birth anniversary. pic.twitter.com/Ski0udt9sf— ANI (@ANI) December 12, 2023 -
50 ఏళ్ల వేడుక.. రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ సినిమా రీరిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన నరసింహ రీరిలీజ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 1999లో వచ్చిన ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నీలాంబరిగా చాలా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ఇందులో శివాజీ గణేశన్, సౌందర్య,నాజర్,అబ్బాస్ తదితరులు నటించారు. తమిళ్లో సంచలన విజయం అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నుంచి రజనీకాంత్‌కు ఇక్కడ మార్కెట్ కూడా పెరిగింది.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ (Narasimha) సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పుడు థియటర్స్లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ, ఈ చిత్రం 2025 ఆగష్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది. రజనీ నటించిన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 18న విడుదలైంది. దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ సమయానికి నరసింహ సినిమాను రీరిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్లీ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేశాయి. అందులో భాషా, బాబా, దళపతి ఉన్నాయి. ఇప్పుడు నరసింహ మూవీ మళ్లీ విడుదల కానున్నడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నరసింహ సినిమా 1999లో 200 ప్రింట్స్‌తో విడుదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 86 థియేటర్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా ప్రాంతాలలో 200 రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లు రాబట్టింది. ఆ సమయంలో అమెరికాలో రూ. 3 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత రజనీ లుక్‌ను బీడీలు, సిగరెట్లు పొగాకు వంటి వాటిపై ట్రేడ్‌మార్క్‌గా రైట్స్ కొనుగోలు చేశారు. -
ఫ్యాన్స్ కు తలైవా విషెస్.
-
గుకేశ్‌ను సన్మానించిన రజనీకాంత్, శివకార్తికేయన్ (ఫోటోలు)
-
గుకేశ్‌కు రజనీకాంత్ సన్మానం.. గిఫ్ట్ ఇచ్చిన శివకార్తికేయన్
వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి గుకేశ్ (D Gukesh)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అతడిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) అభినందించారు. రజనీ.. గుకేశ్‌కు శాలువా కప్పడంతో పాటు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. పిలిచి మరీ తనకు సమయం కేటాయించినందుకు రజీకాంత్కు గుకేశ్ ధన్యవాదాలు తెలిపాడు.గిఫ్ట్ ఇచ్చిన హీరోఅటు శివకార్తికేయన్.. చెస్ ఛాంపియన్‌తో కేక్ కట్ చేయించి వాచ్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. అంతేకాదు, స్వయంగా తనే అతడి చేతికి వాచీ ధరింపజేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను గుకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శివకార్తికేయన్ సర్ ఎంత మంచివారో.. తన బిజీ షెడ్యూల్లోనూ నాతో పాటు నా కుటుంబంతో ఉండేందుకు సమయం కేటాయించారు అని ఎక్స్ (ట్విటర్)లో తన సంతోషాన్ని పంచుకున్నాడు.జగజ్జేతగా గుకేశ్కాగా సింగపూర్ సిటీలో జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో చెన్నైకి చెందిన 18 ఏళ్ల గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి చదరంగం రారాజుగా అవతరించాడు. Thanks Superstar @rajinikanth sir for your warm wishes and inviting ,spending time and sharing your wisdom with us 🙏 pic.twitter.com/l53dBCVVJH— Gukesh D (@DGukesh) December 26, 2024 Had a great time with @Siva_Kartikeyan sir and he was kind enough to spend time with me and my family despite his busy schedule and enjoyed a lot! pic.twitter.com/GnnGx3wDs4— Gukesh D (@DGukesh) December 26, 2024చదవండి: సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్ రాజు ప్లాన్ బెడిసికొట్టిందా? -
సంక్రాంతికి కొత్తకబురు
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ (2023) సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కావొచ్చాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ‘జైలర్ 2’ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి, రజనీకాంత్ పాల్గొనగా నెల్సన్ అండ్ టీమ్ ఓ వీడియోను రికార్డు చేసిందని, సంక్రాంతికి ‘జైలర్ 2’ అధికారిక ప్రకటన రానుందని టాక్. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల జైపూర్‌లో పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ను కోయంబత్తూర్‌లో ఆరంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. -
జైలర్ మూవీ కమెడియన్‌తో నటి పెళ్లి.. అదే నాన్న చివరి కోరిక (ఫోటోలు)
-
‘ఒరే తలైవర్’ అంటూ బర్త్‌డే విషెస్.. హీరోయిన్‌పై రజనీ ఫ్యాన్స్ ఫైర్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన పుట్టినరోజు జరుపుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి దుషారా విజయన్ ‘ఒరే తలైవర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్‌కి చెప్పిన శుభాకాంక్షలు వివాదాస్పదం అయ్యాయి. రజనీకాంత్ గౌరవం తగ్గించి ఒరే తలైవర్ అంటూ పోస్ట్ చేయడాన్ని తెలుగు నెటిజన్స్ తప్పుబట్టారు. ఒరే అంటే ఒరేయ్ అని తెలుగువాళ్లు అనుకున్నారు. అయితే తమిళంలో ‘ఒరే’ అంటే ఒక్కరే అని అర్థం. అందుకే ‘ఒరే తలైవర్’ (సూపర్‌స్టార్ ఒక్కరే) అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు దుషారా. అంతేకానీ రజనీని అవమానించే విధంగా ఒరే అనే పదాన్ని ఎక్కడా వాడలేదంటూ తమిళ్ తెలిసిన వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఫ్యాషన్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుషారా ‘బోదై ఏరి బుదద్ధి మారి’ (2019) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ సమయంలోనే రజనీకాంత్ (వేట్టయాన్), ధనుశ్ (రాయన్), విక్రమ్ (వీర ధీర శూరన్ 2) వంటి స్టార్ హీరోల సినిమాలల్లో నటించే అవకాశం అందుకున్నారు దుషారా. ఇలా కెరీర్ పరంగా ఈ బ్యూటీ దూసుకెళుతున్నారు. View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో రజినీకాంత్.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్.. గురువారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే కొందరు మాత్రం టెక్నాలజీ ఉపయోగించి తలైవాని సరికొత్తగా చూపించారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్)ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. సాధ్యం కాని వాటిని కూడా ఈ సాంకేతికత ఉపయోగించి సృష్టిస్తున్నారు. ఇలానే ఇప్పుడు రజినీకాంత్‌ని కూడా హాలీవుడ్ క్లాసిక్ సినిమాలు-వెబ్ సిరీసులైన 'పీకీ బ్లండర్స్', 'రాకీ', 'టాప్ గన్', 'గ్లాడియేటర్', 'గాడ్ ఫాదర్', 'స్టార్ వార్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'టైటానిక్', 'మ్యాట్రిక్స్' సినిమాల హీరోల గెటప్స్‌లో రజినీ కనిపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది.(ఇదీ చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)Mass😍😍😍😍#Thalaivar #ThalaivarBirthday #Superstar #SuperstarRajinikanth #ThalaivarForLife pic.twitter.com/I6lbDKjLqw— Dr.Ravi (@imravee) December 12, 2024 -
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
థర్టీ ఇయర్స్ తర్వాత...
‘కూలీ’ సినిమా కోసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ , సత్యరాజ్, రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో ఆమిర్‌ఖాన్ నటిస్తున్నారు. ‘కూలీ’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జైపూర్‌లో మొదలైందని కోలీవుడ్ సమాచారం.రజనీ, ఆమిర్‌తో పాటుగా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌ఖాన్ నటిస్తారనే ప్రచారం గతంలో సాగింది. తాజాగా ఆయన జైపూర్‌కు వెళ్లడంతో ఈ మూవీలో ఓ రోల్లో నటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. 1995లో వచ్చిన ‘అతంక్ హీ అతంక్’ సినిమాలో రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ లీడ్ రోల్స్‌లో నటించిన సంగతి తెలిసిందే. థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ‘కూలీ’ కోసం రజనీకాంత్, ఆమిర్‌ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ మే 1న రిలీజ్ కానుందని టాక్. -
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
-
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
'జైలర్' అభిమానులకు శుభవార్త
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్‌లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం తరువాత రజనీకాంత్ కోసం మరో చిత్రం ఎదురు చూస్తోంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన అందులో నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌కు భార్యగా నటించగా, నటి తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా జైలర్ చిత్రం నిర్మా ణ దశలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ పేర్కొన్నారు. దీంతో ఈయన జైలర్– 2 చిత్ర కథను తయారు చేసే పనిలో ఉన్నారు. తా జాగా కథను రెడీ చేసి నెల్సన్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి 'హుకూమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాకపోయినా ప్రస్తుతం 'హుకూమ్' చిత్రం గురించి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిశంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన పనులు స్థానిక పూందమల్లిలోని ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియోను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే రజనీకాంత్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
రజినీకాంత్ VS కమల్ హాసన్ బాక్సాఫీస్ ఫైట్
-
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు. -
అమరన్‌కి ప్రశంసలు
శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రబృందాన్ని హీరో రజనీకాంత్ ప్రశంసించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి రిలీజ్ చేశారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అమరన్’ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి, అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే హీరో శివ కార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్, నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిలని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకథ, కథనం, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నాయని రజనీకాంత్ ప్రశంసించారు. -
ఓటీటీలో వేట్టయాన్.. దీపావళి కానుక ప్రకటించిన మేకర్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టైయన్ నవంబర్ 8న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను పంచుకుంది. అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సోషల్‌మీడియాలో ట్రెండింగ్ సాంగ్.. వీడియో చూశారా..?
రజనీకాంత్ వేట్టయాన్ సినిమాలో సూపర్ హిట్ అయిన సాంగ్ 'మనసిలాయో'. తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషించారు. చాలా సింపుల్ కొరియోగ్రఫీతో దినేశ్ ఈ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. సోషల్‌మీడియాలో ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.ఈ పాటలో రజనీకాంత్‌తో మంజు వారియర్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మలయాళంలో చాలా పాటలు ఆమె చేసినప్పటికీ ఇంత క్రేజ్ రాలేదని చెప్పవచ్చు. తన కెరీర్లో ఇంత పెద్ద హిట్ అయిన పాట ఇదేనని మంజు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
వేట్టయాన్ కలెక్షన్స్.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. 18 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఇంతటి కలెక్షన్స్ రావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.వేట్టయాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా భారత్‌లో రోజుకు రూ. 2 కోట్ల కలెక్షన్స్ వేట్టయాన్ రాబడుతుంది. అయితే, ఓవర్సీస్లో ఎక్కువగా ఈ మూవీ సత్తా చాటుతుంది. కేవలం భారత్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ సినిమా అంతటి పాజిటివ్ టాక్ వేట్టయాన్‌కు రాలేదు. అయినా, కలెక్షన్స్ పరంగా మెరుగ్గానే రాబడుతుంది.వేట్టైయన్ నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అన్ని భాషలలో డిజిటల్ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. -
జైలర్‌తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
రజినీకాంత్ వేట్టయాన్.. ఓటీటీకి అంత త్వరగానా?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడంతో చిత్రబృందం సెలబ్రేట్ చేసుకుంది.తాజాగా వేట్టయాన్ మూవీ ఓటీటీ విడుదలపై అప్పుడే టాక్ మొదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీకి రానుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వేట్టయాన్ బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగుపెట్టింది. విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీ నవంబర్ 7న లేదా 9న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!)కాగా.. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోకి దక్కించుకుంది. దసరా సందర్భంగా అక్టోబరు 10న వెట్టయాన్ తెరపైకి వచ్చింది. నాలుగు వారాల తర్వాత అంటే ఈ దీపావళి తర్వాత ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్
‘నాటు నాటు’సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆ ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం రాహుల్‌లో ఉంది. ఆస్కార్ అవార్డు సాధించినా.. ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్పాడు. నాకు రజకాంత్ అంటే చాలా ఇష్టం. రంగమార్తాండ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ గార్లతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూట్లో ఉన్నప్పుడు.. నేను రజనీ ఫ్యాన్ అని ప్రకాశ్ రాజ్‌కు చెప్పాను. దీంతో ఓ సారి ప్రకాశ్ రాజ్ నన్ను పిలిచి రజనికాంత్ మూవీ షూటింగ్‌కి వెళ్తున్నా రమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్లిపోయాను. అప్పుడు అన్నాత్తే షూటింగ్ జరుగుతోంది. విరామం సమయంలో రజనీకాంత్ సర్కి నన్ను పరిచయం చేశారు. అయితే అప్పుడు ఆయన ఆ మూవీ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. అయినా కూడా నాకు ఫోటో దిగే అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఆ సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా విడుదల కాలేదు. ఈ విషయం నాకు చెప్పి సినిమా రిలీజ్ వరకు ఆ ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. ఓ పది రోజుల తర్వాత ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశా. అది వైరల్‌గా మారింది. హీరో లుక్ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను: జ్ఞానవేల్
‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.→ రజనీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.వెట్టయన్'కి ప్రీక్వెల్‌ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్ఫార్మర్గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.→ నిజ-జీవిత ఎన్కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను. -
'వేట్టయాన్' భారీ ఆఫర్.. టికెట్ల రేట్లు తగ్గింపు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయని చెప్పవచ్చు. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.దసరా సెలవులు ముగియడంతో వేట్టయాన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు. ఈమేరకు అధికారికంగా తెలిపారు. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో వేట్టయాన్‌కు మళ్లీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. అయితే, ఈ ఆఫర్ తెలంగాణలో మాత్రమే ఉండనుంది. ఏసియన్ ఎంటర్టైన్మెంట్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో మాత్రం శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేశారు.కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు.ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే -
వేట్టయాన్‌లో నానికి ఆఫర్ ఆ రోల్.. చివరికీ!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నానికి ఓ పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నాని ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే నాని ప్లేస్‌లో పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్‌ను ఎంపిక చేశారు. అయితే నాని నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. కానీ వీరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ అభిమాని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి నాని తప్పించుకున్నాడని రాసుకొచ్చారు. -
కోలుకున్న రజినీకాంత్.. 'వేట్టయన్' టీమ్‌తో ఇలా
సూపర్‌స్టార్ రజినీకాంత్.. కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తగ్గిపోతుందిలే అనుకున్నారు. కానీ అది సీరియస్ అయి, గుండెకి ఇబ్బందిగా మారింది. దీంతో డాక్టర్స్ స్టెంట్ వేశారు. ఇంతలోనే ఆయన నటించిన 'వేట్టయన్' సినిమా రిలీజైంది. తాజాగా మూవీ టీమ్ రజినీని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అలా రజినీ కొత్త ఫొటోలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?)ఈ ఫొటోల్లో రజినీని చూస్తే అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తున్నారు. త్వరలో 'కూలీ' మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. ఇకపోతే 'వేట్టయన్' చిత్రానికి 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగానే రజినీని చిత్రబృందం అంతా కలిసి విషెస్ చెప్పారు.తమిళంలో 'వేట్టయన్'కి హిట్ టాక్ వచ్చింది. కానీ తెలుగులో మాత్రం మిశ్రమ స్పందన లభించింది. దసరా టైంలో అది కూడా నాలుగైదు చిత్రాలతో కలిసి రావడం తెలుగులో ఈ చిత్రానికి కాస్త మైనస్ అయింది. పండగకు రిలీజైన ఏ చిత్రం కూడా తెలుగు ప్రేక్షకుల్ని సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్) -
ఒకే వేదికపై ప్రభాస్,రజనీ,సూర్య.. ఎందుకో తెలుసా..?
సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కంగువ'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సూర్యతో పాటు ప్రభాస్, రజనీకాంత్ వేదక పంచుకోనున్నారని ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్టోబరు 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం రజనీకాంత్ వెట్టయాన్ కోసం వాయిదా పడింది. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవంబరు 14న సినిమా విడుదల కానుంది.కంగువ కోసం ప్రభాస్, రజనీకాంత్రజనీకాంత్ వేట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదల కావడంలో సూర్య పాత్ర ఎక్కువ ఉంది. తలైవా మీద ఉన్న గౌరవంతో అక్టోబర్ 10న విడుదల కావాల్సిన కంగువ చిత్రాన్ని సూర్య వాయిదా వేసుకున్నారు. దీంతో రజనీకాంత్ కూడా కంగువ విజయం కోసం తన వంతుగా సపోర్ట్ ఇచ్చేందుకు ప్రీరిలీజ్ కార్యక్రమానికి వస్తున్నారట. ఇకపోతే ఇదే కార్యక్రమానికి ప్రభాస్ కూడా రానున్నారని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం యూవీ క్రియేషన్స్ అని చెప్పవచ్చు. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి కంగువ సినిమాను వారు నిర్మించారు. యూవీ బ్యానర్ అధినేతలు వంశీ, ప్రమోద్‌లు ఇద్దరూ ప్రభాస్‌కు మంచి స్నేహితులు. దీంతో ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మరింత ప్రమోషన్ కల్పించేందుకు పెంచేలా ప్రభాస్ కూడా భాగం కానున్నారని సమాచారం.రూ. 2000 కోట్లపై టార్గెట్కంగువ సినిమాను 3,500 థియేటర్లలో ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత జ్ఞానవేల్ క్లారిటీ ఇచ్చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, చైనీస్, స్పానిష్లోనూ ఈ మూవీ వస్తుందని వెల్లడించారు. ఏఐ సాయంతో ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. రూ. 1000 కోట్ల టార్గెట్‌తో దిగుతున్న ఈ సినిమా రూ. 2000 కోట్లు రాబడుతుందని నిర్మాత అంచనా వేశారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు 14న సినిమా విడుదల కానుంది. -
రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్, కబాలి, జైలర్, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్లో చేరాయి. కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు. -
ఫేట్ మార్చిన రజనీ, ధనుష్ సినిమాలు.. అదృష్టమంటే ఈ డస్కీ బ్యూటీదే (ఫొటోలు)
-
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
వేట్టయాన్‌కు ఊహించని రెస్పాన్స్.. మేకర్స్ కీలక నిర్ణయం!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. దసరా సందర్బంగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ ఫస్ట్ రోజే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ది గోట్(రూ. 44 కోట్లు) తర్వాత సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.అయితే రజనీకాంత్ వేట్టైయాన్కు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెట్టయాన్ కోసం మరిన్ని థియేటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అదనపు స్క్రీన్లలో వేట్టయాన్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్న చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోందని.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా..టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయాన్ యాక్షన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, అభిరామి, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. -
వేట్టయాన్ కలెక్షన్స్.. మ్యాజిక్ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.రజనీకాంత్ వేట్టయాన్ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ145.80 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ సంస్థ తెలిపింది. మ్యాజిక్ నంబర్ రూ. 150 కోట్లకు చాలా దగ్గరలో కలెక్షన్లు ఉన్నాయి. నేటి కలెక్షన్లతో సులువుగా దానిని రజనీ అదిగమిస్తాడని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో 2024లో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా వేట్టయాన్ 5వ స్థానంలో ఉంది. దసరా సందర్భంగా రజనీకాంత్ సినిమాకు శనివారం నాడు మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.కోలీవుడ్‌లో సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా వేట్టయాన్ కలెక్షన్ల గురించి ఒక ట్వీట్ చేశాడు. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో రూ. 17 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిందని పేర్కొన్నాడు. అమెరికాలో ఇప్పటి వరకు ఈ మార్క్‌ను అందుకున్న రజనీ సినిమాలు రోబో,2.0,కబాలి,పేట,దర్బార్, జైలర్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో వేట్టయాన్ కూడా చేరిందని ఆయన తెలిపాడు. ఈ చిత్రం సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేయవచ్చని ఆయన తెలిపాడు. -
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
రజనీకాంత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ చిత్రంలో తమ ప్రాంత పాఠశాలను, విద్యార్థులను తప్పుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని కోవిల్పట్టి గాంధీనగర్ వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సౌత్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి నటీనటులతో తెరకెక్కిన వేట్టయన్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో తమ ప్రాంతంలోని ఉత్తమ పాఠశాల, అందులో విద్యార్థులను తప్పుగా చూపించారంటూ తెన్కాశి జిల్లా, కోవిల్పట్టి గాంధీనగర్‌కు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.డ్రగ్స్ విషయంలో తమ పాఠశాలకు వ్యతిరేకంగా దృశ్యాలున్నాయని, వాటిని తొలగించకుంటే ప్రదర్శనను అడ్డుకుంటామని స్థానికంగా ఉన్న లక్ష్మీ థియేటర్‌ను ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సంబంధిత సినీ వర్గాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వేట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా నటించారు. మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. చదవండి: రజనీకాంత్ వేట్టయన్ సినిమా ఎలా ఉంది.. మూవీ రివ్యూ -
రజినీ 'వేట్టయన్'.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ క్రేజ్ ఉంటుంది. ఈసారి తమిళనాడు వరకు ఓకే గానీ తెలుగులో పెద్దగా హడావుడి లేకుండానే 'వేట్టయన్' రిలీజైపోయింది. దసరా కానుకగా ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే మిక్స్డ్ టాక్ వినిపించింది. వీకెండ్ గడిస్తేగాని అసలు టాక్ ఏంటనేది బయటపడదు.(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మరోవైపు 'వేట్టయన్' చిత్రానికి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. తెలుగు వరకు అయితే దాదాపు రూ.3 కోట్లు వరకు వచ్చిన సమాచారం.తెలుగులో అయితే 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలానే 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తాజాగా థియేటర్లలో రిలీజయ్యాయి. వీటని దాటుకుని 'వేట్టయన్' తెలుగులో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తొలిరోజు అయితే పర్లేదనిపించింది గానీ వీకెండ్ ముగిసేసరికి ఎన్ని డబ్బులు వస్తాయనే దానిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!) -
ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ చేసుకున్న వెట్టయాన్.. భారీ ధరకు రైట్స్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. వేట్టయాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రం విడుదలైన ఆరు వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురానున్నారు. అంటే నవంబర్ చివర్లో ఓటీటీకి వచ్చే అవకాశముంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. -
వెట్టయాన్ ఫస్ట్ షో వీక్షించిన స్టార్ హీరో.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.అయితే రజినీకాంత్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తమిళ అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ మొదటి రోజే ఫస్ట్ షో చూడాలనే ఆతృత అభిమానులకు ఉంటుంది. కానీ ఒక స్టార్ హీరో మూవీ ఫస్ట్ షో చూడడం చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. ఇవాళ అలాంటి అరుదైన సంఘటనే చోటు చేసుకుంది.ఇటీవల ది గోట్ మూవీ అభిమానులను మెప్పంచిన విజయ్.. రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ ఫస్ట్ షోను వీక్షించారు. ఆయనతో పాటు ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్.. రజనీకాంత్‌కు అభిమాని కావడంతో మొదటి ఆటను చెన్నైలో ఓ థియేటర్లో చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. வேட்டையன் படம் பார்த்த விஜய்... தலைவருக்காக வந்த தளபதி..!#Chennai #ThalapathyVijay #Vijay #Vettaiyan #VettaiyyanMovie #VettaiyanFDFS #VettaiyanReviews #Rajinikanth #DeviTheatre #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/csFT8A3FUB— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 10, 2024 -
'మన దేశ కుమారుడిని కోల్పోయాం'.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. తన విజన్, అభిరుచితో మనదేశాన్ని ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటన్నారు. ఈ మేరకు ఆయనతో ఉన్న ఫోటోను రజినీకాంత్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ తన ట్వీట్లో.. 'తన విజన్, అభిరుచితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిచారు. వేలాది మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చి, ఎన్నో తరాలుగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందరి అభిమానం, గౌరవం పొందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తితో గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను. భారతదేశానికి నిజమైన కుమారుడు ఇక లేడు. .. మీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.A great legendary icon who put India on the global map with his vision and passion ..The man who inspired thousands of industrialist .. The man who created lakhs and lakhs of jobs for many generations ..The man who was loved and respected by all .. My deepest salutations to… pic.twitter.com/S3yG1G7QtK— Rajinikanth (@rajinikanth) October 10, 2024 -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్‌తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్‌కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ
సూపర్‌స్టార్ రజినీకాంత్ కొత్త మూవీ 'వేట్టయన్' థియేటర్లలోకి వచ్చేసింది. 'మనసిలాయో' పాటతో ట్రెండ్ అయిపోయిన ఈ చిత్రంలో రజినీతో పాటు అమితాబ్ బచ్చన్, రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. చాలాచోట్ల ఎర్లీ మార్నింగ్ షోలు, ఓవర్సీస్ షోలు పడ్డాయి. దీంతో ట్విటర్లో పలువురు నెటిజన్లు రివ్యూ పోస్ట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్)రజినీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయిందని, అనిరుధ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడని అంటున్నారు. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని అంటున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథని, ఆలోచన రేకెత్తించే సోషల్ మెసేజ్‌తో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా చూపించాడని తెగ పొగిడేస్తున్నారు.(ఇదీ చదవండి: రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్!)#Vettaiyan - Superstar Rajinikanth & FaFa scenes are super Funny & Refreshing 😁❤️So nice to see #FahadhFaasil in this kind of character🌟 pic.twitter.com/fLjFzUiGHU— AmuthaBharathi (@CinemaWithAB) October 10, 2024First Half #Vettaiyan(4/5) : Intriguing Investigate Thriller#Rajinikanth & his mass moments🔥racy a screenplay filled with investigation of crime#Fafa super fun@anirudhofficial's BGM & song👌Emotions are well connected@officialdushara plays a crucial role@tjgnan 👍 pic.twitter.com/Qv4TvXaypk— Kollywood Updates (@KollyUpdates) October 10, 2024#Vettaiyan First half 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Content la mass illa , mass la thaan content🔥🔥🔥 First 25 minutes, absolute goosebumps with Thalaivar 🔥🔥🔥🔥🔥🔥 Ani bgm and RR is his career best. That intro theme music, thaaaa🔥🔥🔥🔥🔥 Intriguing crime thriller investigation… pic.twitter.com/nfQB5tOu1i— Achilles (@Searching4ligh1) October 9, 2024#Vettaiyan First Half - SUPERB❤️🔥- First 20 mins to celebrate Superstar #Rajinikanth & his mass moments😎- After half an hour moves towards racy a screenplay filled with investigation of crime 👌- Anirudh BGM & song is so good🎶- Emotions are well connected ❤️- Dushara plays… pic.twitter.com/2V7AcPr2Q0— AmuthaBharathi (@CinemaWithAB) October 10, 2024Thaaaaaaaa! Terrific screenplay writing! Unbelievable TWIST! Absolute banger of a first half! TJ Gnanavel - you won biggggg! Just 50% more to show the world you are bigger than NELSON or KARTHIK SUBBARAJ! One of the best first half ever! #Vettaiyan IS GOING TO BE HUGE!— 𝔻𝕣. 𝔹𝕠𝕙𝕣𝕒 𝕄𝔻. 𝔸𝕀ℝ𝔻 (@Vasheegaran) October 9, 2024#manasilaayo? Glad to be here with loads of #ThalaivarRajinikanth fans! 🔥🔥❤️❤️ #VettaiyanVibes #Vettaiyanfdfs #Vettaiyan pic.twitter.com/Uz8yqxc9wv— Prasanna (@IamprasannaGA) October 9, 2024#Vettaiyan First Half - SUPER GRIPPING & ENGAGING 🔥Fully on content based👌 pic.twitter.com/rkmf8YMF7f— AmuthaBharathi (@CinemaWithAB) October 9, 2024#Vettaiyan Review - Intriguing investigative thriller raising moral questions. Engaging first half sets the stage for a promising second half.TJ Gnanavel blends commercial elements with social justice & human biasLaw vs. Encounter. Amitabh is a fitting match up to Rajini. pic.twitter.com/GIJtFFEbO3— MovieCrow (@MovieCrow) October 9, 2024Thalaivar fans coming out of theatres after watching the climax twist in #Vettaiyan 🔥🔥😭😭😭pic.twitter.com/BKPclWfHOH— Agastya🦕 (@Salaar4k) October 9, 2024#Vettaiyan first half 🔥🔥🔥 thalaivar semma!!!! pic.twitter.com/1Mq2vYLdtf— Anup Krishnia (@CKrishnia) October 10, 2024#Vettaiyan First Half : “Excellent First Half”🔥🔥👉Starts off a bit alow in the first 30mins,but once the story gains momentum, it transforma into an engaging crime thriller that keeps you on the edge of the seat.👉The film leans more towards the director’s film than merely…— PaniPuri (@THEPANIPURI) October 10, 2024 -
సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్లో రజినీకాంత్‌కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంది. దీంతో టాలీవుడ్‌లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్‌రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు. -
రజినీకాంత్ వెట్టైయాన్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బిగ్ షాక్!
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు తమిళ వర్షన్ కేవలం రూ.10.2 కోట్ల మేర టికెట్స్ బుకింగ్స్ మాత్రమే పూర్తయ్యాయి. తెలుగులో అయితే ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం రూ.74 లక్షలు మాత్రమే వసూళ్లు రానున్నాయి. హిందీలో మరింత దారుణంగా రూ.93 వేల అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియా వ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు ముందస్తు టికెట్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లో వెట్టైయాన్‌కు క్రేజ్ తగ్గడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ట్విటర్లో ఏకంగా వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై నెట్టింట తెగ చర్చ మొదలైంది. అసలే ఈ మూవీ కోసం సూర్య నటించిన కంగువా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగకపోవడంపై ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మొదటి రోజు వంద కోట్ల రాబట్టడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రానా.. నన్ను చూపుతో భయపెట్టాడు: రజనీకాంత్
రానా పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'బాహుబలి'. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎప్పుడో ఒకటి అనేంతలా నటిస్తున్నాడు. రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'లోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా రానా గురించి స్వయానా రజినీకాంత్ ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్)'రానా.. రామానాయుడి మనవడిగా చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పట్లోనే షూటింగ్‌కి వచ్చేవాడు. ఫుల్ జాలీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేవాడు. అప్పుడు నిజంగా నేను భయపడేవాడిని' అని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. సూపర్‌స్టారే యాక్టింగ్ గురించి ప్రశంసించారంటే.. రానాకి ఇంతకంటే బెటర్ ఎలివేషన్ ఉండదేమో?'జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయన్' సినిమాలో రజినీతో పాటు అమితాబ్, రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుసరా విజయన్.. ఇలా భారీ తారాగణం ఉంది. అనిరుధ్ ఇచ్చిన పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అక్టోబరు 10న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 7 నెలల తర్వాత ఓటీటీలోకి పూరీ తమ్ముడి సినిమా)Imagine the level of Achievement when SUPER STAR himself talks something like this!🤯🤯🔥🔥🔥#RanaDaggubati #Vettaiyan #Rajinikanth pic.twitter.com/KMMKTrWa2s— Filmy Bowl (@FilmyBowl) October 8, 2024 -
గ్రాఫిక్స్‌కి సమయం ఇవ్వలేదు!
హీరో రజనీకాంత్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ముత్తు’(1995) చిత్రం సూపర్ హిట్ కాగా, ‘నరసింహా’(1999) మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే వీరికాంబోలో వచ్చిన ‘లింగ’(2014) చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారంటూ కేఎస్ రవికుమార్ తాజాగా ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ–‘‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. ద్వితీయార్ధం మొత్తం మార్చేశారు.కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి నాకు సమయం ఇవ్వలేదు. అనుష్కతో ఉండే ఒక పాటని, పతాక సన్నివేశంలో వచ్చే ఓ ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ని యాడ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని గందరగోళం చేశారు’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌పై కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.అయితే ‘లింగ’ సినిమా గురించి 2016లో కేఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలను కొందరు గుర్తు చేస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా(లింగ) రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మా సినిమా సూపర్‌హిట్’’ అంటూ గతంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడేమో ‘లింగ’ పరాజయానికి రజనీకాంత్ కారణమని చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు. -
రజినీకాంత్ వేలు పెట్టారు.. అందుకే సినిమా ఫ్లాప్: డైరెక్టర్
దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. చిన్న హీరోలకు అయితే చెల్లుబాటు అవుతుంది గానీ పెద్ద హీరోల్లో కొందరు మాత్రం ప్రతి దానిలో వేలు పెడుతుంటారు. హిట్ కొడితే తమ క్రెడిట్ అన్నట్లు చెప్పుకొంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిదే తప్పు అన్నట్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తుంటారు. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన పని గురించి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ నిజాలు బయటపెట్టారు. ఇప్పుడు ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్‌తో 'ముత్తు', 'నరసింహా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కేఎస్ రవికుమార్.. ముచ్చటగా మూడోసారి కలిసి 'లింగా' తీశారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. 2014లో రిలీజైన ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్ర సెకండాఫ్‌లో రజినీకాంత్ వేలు పెట్టారని, ఎడిటింగ్ పూర్తిగా మార్చేశారని అందుకే పోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి)'ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారు. గ్రాఫిక్స్ చేసేందుకు నాకు టైమ్ కూడా ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని మార్చేశారు. అనుష్కతో ఉండే పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ తొలగించేశారు. బెలూన్ జంపింగ్ సీన్ జోడించారు. మొత్తానికి 'లింగా'ని గందరగోళం చేశారు' అని కేఎస్ రవికుమార్ తన ఆవేదనని దాదాపు పదేళ్ల తర్వాత బయటపెట్టారు.2016లో ఇదే సినిమా గురించి ఇదే దర్శకుడు మాట్లాడుతూ.. రూ.150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి, సూపర్ హిట్ అని చెప్పారు. ఇప్పుడేమో సినిమాని రజినీకాంత్ గందరగోళం చేశారని అసలు నిజాలు బయటపెట్టారు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్లో 30 శాతం మాత్రమే వసూళ్ల రూపంలో రిటర్న్ వచ్చాయని, దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లకు తిరిగి డబ్బులిచ్చారని టాక్.ఇకపోతే రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'వేట్టయన్'.. మరో మూడు రోజుల్లో అంటే అక్టోబరు 10న దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
మూడు దశాబ్దాల తర్వాత..?
హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన ‘దళపతి’ (1991) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే (మమ్ముట్టి, అరవింద్ స్వామి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు). ఆ చిత్రం తర్వాత రజనీకాంత్–మణిరత్నం మరో సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాలని మణిరత్నం ఓ కథ రెడీ చేశారని, మణిరత్నంతో సినిమా చేసేందుకు రజనీ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. రజనీకాంత్ బర్త్ డే (డిసెంబరు 12) సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని కోలీవుడ్ భోగట్టా. మరి మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ – మణిరత్నం కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
మళ్ళీ అనిరుద్ ట్వీట్.. ఫుల్ జోష్ లో తలైవా ఫ్యాన్స్
-
రజనీకాంత్... స్టెంట్ కథ
అయోర్టిక్ అన్యురిజమ్ గురించి తెలుసుకునే ముందర అసలు అన్యురిజమ్స్ అంటే ఏమిటో చూద్దాం. బెలూన్ ఊదినప్పుడు అంతటా అది సాఫీగా సాగుతుంది. కానీ ఎక్కడైనా బెలూన్ గోడలు పలుచగా ఉన్నచోట అక్కడ అది ఉబ్బినట్లు అవుతుంది. అదే తరహాలో రక్తనాళాలు కూడా పలుచబారినచోట బలహీనంగా ఉండి ఉబ్బినట్లుగా అయిపోతాయి. ఇలా రక్తనాళాలు పరచబారి ఉబ్బినట్లుగా అయి΄ోవడాన్ని అన్యురిజమ్స్ అంటారు. ఉబ్బిన చోటను బట్టి పేరు... మెదడు, కడుపు మొదలుకొని, కాళ్లవరకూ రక్తనాళాలు ఎక్కడైనా బెలూన్లా ఉబ్బవచ్చు. ఉబ్బిన చోటును బట్టి డాక్టర్లు వాటికి పేరు పెడతారు. ఉదాహరణకు మెదడులో ఉబ్బితే సెరిబ్రల్ అన్యురిజమ్స్ లేదా మామూలుగా అన్యురిజమ్స్ అని వ్యవహరిస్తారు. కడుపు భాగంలో ఉబ్బడాన్ని ‘అబ్డామినల్ అన్యురిజమ్’ అని, ఛాతీలో జరిగితే ‘థొరాసిక్ అన్యురిజమ్’గా పేర్కొంటారు. ఇప్పుడు రజనీకాంత్ విషయంలో ‘అయోర్టా’లోని రక్తనాళాలు ఉబ్బడం వల్ల దాన్ని అయోర్టిక్ అన్యురిజమ్గా పేర్కొంటారు. అన్యురిజమ్ ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలిలా...గొంతు బొంగురుపోవడం ∙మింగడంలో ఇబ్బంది గొంతు వాపు ఛాతీపై భాగంలో లేదా ఛాతీ వెనకాల వీపు భాగంలో నొప్పి వికారం, వాంతులు ∙గుండె వేగంగా కొట్టుకోవడం (టాకికార్డియా). నిర్ధారణ... అయోర్టిక్ అన్యురిజమ్ని గుర్తించడానికి అల్ట్రాసౌండ్ మొదటి పరీక్ష. ఇందులో అయోర్టిక్ అన్యురిజమ్ కనిపిస్తే దాన్ని నిర్ధారణ చేయడానికి సీటీ స్కాన్ గాని, ఎమ్మారై గాని, యాంజియోగ్రామ్ గాని చేస్తారు. వాటి సరైన పరిమాణం, ఎంతభాగం ఉబ్బింది అనే విషయాలు సీటీస్కాన్ లేదా ఎమ్మారైలో తెలుస్తాయి. చికిత్సలు : ∙అన్యురిజమ్ కనుగొనగానే దీనికి తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండదు. అయితే అది చిట్లిపోకుండా జాగ్రత్త కోసం రక్త΄ోటును నియంత్రణలో ఉంచేందుకు మందులు వాడతారు. అప్పటి నుంచి డాక్టర్లు అన్యురిజమ్ పెరుగుదలను తరచూ సీటీ స్కాన్ చేస్తూ గమనిస్తూ ఉంటారు. ఏడాదిలో అది 0.5 సెం.మీ. నుంచి 1 సెం.మీ. పెరిగితే, అప్పుడు దానికి రిపేరు చేయాల్సి ఉంటుంది. (సైజు ఎంతన్నది కాకుండా దాని పెరుగుదల రేటును బట్టి ఈ రిపేరు జరగాలి). ∙ఐదు సెంటీమీటర్ల లోపు ఉండే అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్ కి మందులతోనే చికిత్స చేస్తారు. 5.5 సెంటీమీటర్ల పరిమాణం దాటినప్పుడు వాటికి ఆపరేషన్ గాని లేదా స్టెంట్ గాని ఉపయోగించి చికిత్స చేస్తారు. అయోర్టిక్ అన్యురిజమ్ పరిమాణం ఆరు నెలల్లో 0.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లేదా అయోర్టిక్ అన్యురిజమ్ వల్ల లక్షణాలు కనబడుతున్నప్పుడు లేదా అన్యురిజమ్ పగిలిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. స్టెంటింగ్ విధానం: ఈ ప్రక్రియలో కాలు ద్వారా ఒక లోహపు స్టెంట్ ని అయోర్టిక్ అన్యురిజమ్ లోకి ప్రవేశపెట్టడం ద్వారా అన్యురిజమ్ చికిత్స చేస్తారు. సుమారుగా రెండు గంటలు పట్టే ఈ ప్రక్రియని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు నిర్వర్తిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తయిన రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. తర్వాత రక్తం పల్చగా అయ్యే మందులు కొంత కాలం ΄ాటు వాడాలి. ప్రక్రియ సజావుగా సాగితే కాంప్లికేషన్ ఉండే అవకాశం బాగా తక్కువ. ప్రస్తుతం రజనీకాంత్‌కు చేసిన చికిత్స ఇదే. శస్త్రచికిత్స ఎప్పుడంటే... ∙బాధితులు భారీ బరువులెత్తడం, ఫర్నిచర్ కదపడం, ఛాతీపై బరువు పడే పని చేయడం వంటి అంశాలు అన్యురిజమ్పై ప్రభావం చూపవచ్చు. ఈ సమయాల్లోగానీ లేదా ఇతరత్రాగానీ అన్యురిజమ్ హఠాత్తుగా చిట్లితే కార్డియోథొరాసిక్ సర్జన్లు అప్పటికప్పుడు శస్త్రచికిత్స నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సను కొంతకాలం వాయిదా వేసేందుకు కూడా స్టెంటింగ్, ఆర్టిఫిషియల్ గ్రాఫ్టింగ్ వంటి ప్రత్యామ్నాయ చికిత్సలను డాక్టర్లు ఎంచుకుంటారు. అంటే బాధితుల పరిస్థితిని బట్టి ఏ ప్రక్రియను అనుసరించాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ∙కారణాలు... హైపర్‌టెన్షన్ (హైబీపీ) ∙రక్తనాళాల గోడలు మందంగా మారడం (అథెరోస్కి›్లరోసిస్); అలాగే రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడంవల్ల రక్తనాళం గోడపై ఒత్తిడి పడి ఉబ్బు వచ్చే అవకాశం / ముప్పు ఎక్కువ ∙వృద్ధాప్యం (వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల గోడల్లో మార్పులు వస్తూ అవి బిరుసుగా, మందంగా మారుతుంటాయి) ∙కొన్ని కనెక్టివ్ టిష్యూ జబ్బులు పోగతాగే అలవాటు (దీనివల్ల అయోర్టా గోడకు గాయమై చిట్లే ప్రమాదం ఎక్కువ) జన్యుపరమైన కారణాలతో పుట్టుకతోనే వచ్చే మార్ఫన్ లేదా ఎహ్లర్–డాన్లోస్ సిండ్రోమ్ వంటి వ్యాధుల కారణంగా.లక్షణాలు... నిజానికి తొలిదశల్లో అన్యురిజమ్స్తో ఎలాంటి లక్షణాలూ... అంటే నొప్పి, ఇతరత్రా ఇబ్బందులు కనిపించకపోవచ్చు. పలచబడిన చోట మరింత బలహీనపడుతూ, ఉబ్బిన భాగంలో ఉబ్బు మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా ఇతర ఆరోగ్యసమస్యల గురించి వెదుకుతున్నప్పుడు ఇవి అనుకోకుండా బయటపడవచ్చు. అన్యురిజమ్స్ బాగా పెరిగి, పక్కనున్న అవయవాలపై ఒత్తిడి కలిగించవచ్చు లేదా బాగా పలుచబడిపోయిన రక్తనాళం అకస్మాత్తుగా చిట్లవచ్చు. దీన్ని అయోర్టిక్ డిసెక్షన్ అంటారు. ఈ అన్యురిజమ్ పగిలి తీవ్ర రక్తస్రావం జరిగి, ప్రాణాపాయ పరిస్థితీ ఏర్పడవచ్చు. -
అందరికీ ధన్యవాదాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్ అమర్చారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు రజనీ. వైద్యులు ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, చెన్నైఆస్పత్రి నుంచి గోవిందా డిశ్చార్జ్బాలీవుడ్ నటుడు గోవిందా ఈ నెల 1న తన వ్యక్తిగత తుపాకీ పొరపాటున పేలడంతో కాలికి గాయాలై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేసి, కొన్ని రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గోవిందాను పలువురు అభిమానులు పరామర్శించారు. ‘‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలనిప్రార్థించినవారికి కృతజ్ఞతలు’’ అని గోవిందా తెలిపారు. -
ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్.. విశ్రాంతి సూచించిన వైద్యులు
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సెప్టెంబర్ 30న రాత్రి అనూహ్యంగా అనారోగ్యం కారణంగా చైన్నెలోని అపోలో హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే, పూర్తి ఆరోగ్యంతో శుక్రవారం ఆయన ఇంటికి చేరుకున్నారు. రజనీకాంత్ గుండె రక్తనాళంలో వాపు రావడంతో వైద్యులు అత్యవసర విభాగంలో వైద్య చికిత్స నిర్వహించారు. అనంతరం రజనీకాంత్ సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో పలువురు సినీ రాజకీయ నాయకులు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆందోళనకు గురైన రజనీకాంత్ అభిమానులు తమ అభిమాన నటుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముఖ్యంగా తూత్తుకుడికి చెందిన రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు ఆలయాల్లోనూ, చర్చిల్లోనూ, పాఠశాలలోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అపోలో వైద్య బృందం తాజాగా మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. దీంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జి అయ్యారు. అయితే ఆయన మరో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్ర షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్‌లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
రజినీకాంత్ 'వెట్టైయాన్'.. ట్రైలర్ వచ్చేసింది!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానలేల్ డైరెక్షన్లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరెకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే రిలీజైన 'మనసియాలో' అనే సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. తాజాగా వేట్టైయాన్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!) కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా ాకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దసరాకు అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ మూవీలో ఫాహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ ముఖ్య పాత్రల్లో నటించారు.