
దేశంలోనే అతిపెద్ద సూపర్‌హిట్ సినిమాలైన నిలిచిన రాజమౌళి ‘బాహుబలి-2’, శంకర్ ‘2.O’కు చైనాలో మాత్రం డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. చైనా మార్కెట్‌లో పాగా వేయాలన్న ఈ రెండు సినిమాల ఆశలు అడియాసలయ్యాయి.
రజనీకాంత్, అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.O భారత్‌లోని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. హిందీ, తమిళం, తెలుగు వెర్షన్‌లలో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. కానీ, సెప్టెంబర్ 6వ తేదీన చైనాలో విడుదలైన ఈ సినిమాకు చేదు ఫలితం ఎదురైంది. ఎంతగా ఈ సినిమాకు ప్రచారం చేసినా.. చైనా బాక్సాఫీస్ వద్ద తొలివారం ఈ సినిమా కేవలం రూ. 22 కోట్లు వసూలుచేసింది.
బాహుబలి-2 సినిమాకు కూడా చైనాలో ఇదే తరహా ఫలితం ఎదురైన సంగతి తెలిసిందే. 2018 మేలో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా చైనాలో తొలివారం రూ. 52 కోట్లు మాత్రమే వసూలు చేసి చతికిలపడింది. విజువల్ వండర్స్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు చైనా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టలేకపోయాయి. బలమైన కథ కలిగిన భారత సినిమాలకు మాత్రం చైనీయులు బ్రహ్మరథం పడుతున్నారు. భజరంగీ భాయ్‌జాన్, దంగల్, అంధాధూన్, సీక్రెట్ సూపర్ స్టార్, ఇంగ్లిష్ మీడియాం వంటి బలమైన కథాకథనాలతో కూడిన సినిమాలు చైనాలో సంచలన వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment