
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. వచ్చే ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయన క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆదివారం ఈ అంశంపై స్పందించారు.
‘రాజకీయాల్లోకి వస్తే నేను నేనుగానే ఉంటా. నేటి రాజకీయ నాయకుల్లాగా మారిపోను’ అని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావటమే తన లక్ష్యమని చెప్పారు. తన జీవితం వేరు, సినిమాలు వేరు అని, రెండు కలిస్తే ఎలా ఉంటుందో అనేద ప్రశ్న అని చెప్పారు. రజనీ తాజాగా నటించిన ‘2.వో’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment