సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ చిత్రంలో తమ ప్రాంత పాఠశాలను, విద్యార్థులను తప్పుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని కోవిల్‌పట్టి గాంధీనగర్ వాసులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సౌత్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి నటీనటులతో తెరకెక్కిన వేట్టయన్ చిత్రం గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో తమ ప్రాంతంలోని ఉత్తమ పాఠశాల, అందులో విద్యార్థులను తప్పుగా చూపించారంటూ తెన్‌కాశి జిల్లా, కోవిల్‌పట్టి గాంధీనగర్‌కు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ విషయంలో తమ పాఠశాలకు వ్యతిరేకంగా దృశ్యాలున్నాయని, వాటిని తొలగించకుంటే ప్రదర్శనను అడ్డుకుంటామని స్థానికంగా ఉన్న లక్ష్మీ థియేటర్‌ను ముట్టడించడంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి వారిని బుజ్జగించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సంబంధిత సినీ వర్గాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వేట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నటించారు. మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.
చదవండి: రజనీకాంత్ వేట్టయన్ సినిమా ఎలా ఉంది.. మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment