స్త్రీలకు చీరే సింగారం | Actress Amy Jackson says sari is the most beautiful thing a woman | Sakshi
Sakshi News home page

స్త్రీలకు చీరే సింగారం

Published Sat, Apr 7 2018 4:47 AM | Last Updated on Sat, Apr 7 2018 5:19 PM

Actress Amy Jackson says sari is the most beautiful thing a woman - Sakshi

తమిళసినిమా: స్త్రీలకు చీరే సింగారం. ఇలా అన్నది ఎవరో తెలుసా? ఇంగ్లిష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? కొందరి మాటలకు, చేతలకు అసలు సంబంధం ఉండదంటారు. ఈ ఇంగ్లాండ్‌ భామ అలాంటి వారిలో ముందుంటుందని చెప్పవచ్చు. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా శంకర్‌ దర్శకత్వం వహించిన ఐ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసింది. ఆ తరువాత పలు గ్లామరస్‌ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసి సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. అదేమంటే తాను విదేశీ అమ్మాయిని మా కల్చర్‌ అంతే అంటూ ఎలాంటి తడబాటు లేకుండా బదులిచ్చేసింది.

ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రం విడుదల కావలసి ఉండగా ఈ అమ్మడు యూరప్‌ దేశంలో సెటిల్‌ అవనున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్విట్‌ ప్రేక్షకులకు మరో షాక్‌ అవుతోంది. అదేంటో చూద్దాం. స్త్రీలకు చీరలే సింగారం. సంప్రదాయబద్ధమైన ఆ దుస్తులే స్త్రీల్లో అణుకువను ప్రదర్శిస్తాయి.కొన్ని సమయాల్లో లెహన్కా దుస్తులు మహిళల అందాలను మెరుగుపరుస్తాయి. ఇకపోతే ఇండియా అంటే నా మనసులో ఎప్పుడూ ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇది లేటెస్ట్‌ ఎమీ ట్వీట్‌. నటి ఎమీ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది అయితే భారతీయ నారీ సంప్రదాయ చీరకట్టు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను ఆకర్షిస్తుందన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement