![rajinikanth 20 released on november 29 - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/1/Rajanikanth.jpg.webp?itok=-h1fGCgm)
రజనీకాంత్
చిట్టి చేయబోయే సాహసాలను ఆల్రెడీ చిన్న శ్యాంపిల్‌లా గత నెలలో టీజర్ ద్వారా చూపించారు దర్శకుడు శంకర్. ఇప్పుడీ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను మరింత టీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ‘2.ఓ’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం ‘2.ఓ’. 2010లో రిలీజ్ అయిన ‘రోబో’ చిత్రానికి ఇది సీక్వెల్. అక్షయ్ కుమార్ విలన్‌గా కనిపిస్తారు. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం చెన్నైలో పలువురు ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ అదిరిపోయేలా ఉందని టాక్. ఈ నెల 29న చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment