
తలైవా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2. ఓ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 13న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు 2. ఓ దర్శకుడు శంకర్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘సెప్టెంబరు 13న 2.ఓ టీజర్.. త్రీడీ వర్షన్‌లో చూడండి’ అంటూ మూవీ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కాగా సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో 2.ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 2.ఓలో రజనీకి ధీటైన ప్రతినాయక పాత్రలో ఆయన కనిపించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
— Shankar Shanmugham (@shankarshanmugh) September 7, 2018
Comments
Please login to add a commentAdd a comment