
హృతిక్ రోషన్
కావాలనుకుంటే కాళ్ల ముందుకొచ్చి ఆగుతాయి కార్లు. అనుకుంటే అకాశయానం ఈజీ. ఫిక్స్ అయితే చార్టెడ్ ఫ్లైట్‌లో సింగిల్‌గా ఫ్లై అవ్వగలడు. కానీ.. గల్లీ గల్లీ తిరిగి అప్పడాలు అమ్ముతున్నారు హృతిక్ రోషన్. డబ్బులు కోసం ఎండను కూడా లెక్క చేయకుండా చెప్పులరిగేలా సైకిల్ సవారీ చేస్తున్నారు బస్‌స్టాండ్‌లో. అతనికెందుకంత కష్టం? అంటే కాదు ఇష్టం. యాక్టింగ్ అంటే ప్యాషన్. బిహారీ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా హిందీలో దర్శకుడు వికాశ్ బాల్ రూపొందిస్తున్న చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు.
నిజజీవితంలో ఆనంద్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పడాలు అమ్మారు. ఆ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా. హృతిక్ అప్పడాలు అమ్మింది సినిమా కోసమని. ఆరడగుల అందగాడు హృతిక్ రోషన్ ఫొటోలో చూస్తున్నట్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఇదే తొలిసారి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన హృతిక్ రియల్ లైఫ్‌లో కూడా ఇలా కనిపించలేదు. సో.. ఈ గెటప్‌లో ఆకట్టుకోవడంతో పాటు నటనతో మెస్మరైజ్ చేస్తారని ఊహించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment