
కంగనా రనౌత్
స్వాతంత్య్ర సమరయోధుల్లో ఝాన్సీ లక్ష్మిభాయ్ ముఖ్యులు. ఆమె జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘మణికర్ణిక’. ‘ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనేది ట్యాగ్‌లైన్. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహించారు. దేశభక్తికి సంబంధించిన చిత్రం కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుందన్న వార్తలు వచ్చాయి. కానీ ‘మణికర్ణిక’ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నది తాజా ఖబర్.
ఇదే రోజున హృతిక్ రోషన్ తొలిసారి నటిస్తోన్న బయోపిక్ ‘సూపర్ 30’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. వికాశ్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మరి.. ‘మణికర్ణిక, సూపర్ 30’ సినిమాలు ఒకే రోజున థియేటర్స్‌లోకి వస్తాయా? లేక ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment