
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ పాత్రలో నటించిన సూపర్ 30 బాక్సాఫీస్ వద్ద నిలకడగా దూసుకుపోతోంది. పదిరోజుల్లో ఈ మూవీ రూ 100 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. పలు స్ధానిక, హాలీవుడ్ చిత్రాల నుంచి పోటీ ఎదురైనా బాక్సాఫీస్ వద్ద సూపర్ 30 దూకుడుకు బ్రేక్ పడలేదని రెండో వారాంతంలోనూ మూవీ మెరుగైన వసూళ్లు రాబట్టి రూ 100 కోట్ల మార్క్‌ను దాటిందని ప్రముఖ సినీ క్రిటిక్, ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
సూపర్ 30 రెండవ వారాంతంలో శనివారం రూ 8.53 కోట్లు, ఆదివారం రూ 11.68 కోట్లు రాబట్టి మొత్తం ఇండియాలో రూ 100.58 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. సూపర్ 30లో హృతిక్‌తో పాటు నందిష్ సంధూ, ఆదిత్య శ్రీవాస్తవ, వీరేంద్ర సక్సేనా, పంకజ్ త్రిపాఠి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment