హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | Hrithik Roshan Wins Dada Saheb Phalke Foundation Awards 2020 | Sakshi
Sakshi News home page

హృతిక్‌రోషన్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ అవార్డు

Published Sat, Feb 22 2020 10:38 AM | Last Updated on Sat, Feb 22 2020 10:49 AM

Hrithik Roshan Wins Dada Saheb Phalke Foundation Awards 2020 - Sakshi

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించిన చిత్రం సూపర్‌ 30. ఈ మూవీలో ఆనంద్‌ కుమార్‌ పాత్రలో హృతిక్‌​ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా సూపర్‌ 30 మూవీలోని నటనకు దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ అవార్డును 2020గాను హృతిక్‌రోషన్‌ గెలుచుకున్నారు. వికాస్ బల్  దర్శకత్వం వహించిన సూపర్‌ 30లో టీవీ నటి మృణాల్‌ ఠాకూర్‌, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్‌, పంకజ్‌ త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. (స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’)

అనంద్‌ కుమార్‌ పాత్రలో హృతిక్‌ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా గణిత విద్యను అందించి ఐఐటీ- జేఈఈ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విధంగా తయారు చేస్తారు. కండలతో  ఉండే హృతిక్‌ ఈ మూవీలో పూర్తి భిన్నంగా కనిపించి తన అద్భుత నటనతో ప్రేక్షాదారణ పొందారు. కాగా హృతిక్‌ ఇటీవల వార్‌ చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వార్‌ చిత్రం సైతం విమర్శకుల మన్ననలు పొందింన సంగతి తెలిసిందే.ఆనంద్‌ మహీంద్రా సాయం తిరస్కరించిన ఆనంద్‌ కుమార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement