dada saheb phalke academy award
-
హృతిక్‌రోషన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ పాత్రలో నటించిన చిత్రం సూపర్ 30. ఈ మూవీలో ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా సూపర్ 30 మూవీలోని నటనకు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డును 2020గాను హృతిక్‌రోషన్ గెలుచుకున్నారు. వికాస్ బల్ దర్శకత్వం వహించిన సూపర్ 30లో టీవీ నటి మృణాల్ ఠాకూర్, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్, పంకజ్ త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. (స్ఫూర్తినింపే ‘సూపర్ 30’) అనంద్ కుమార్ పాత్రలో హృతిక్ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా గణిత విద్యను అందించి ఐఐటీ- జేఈఈ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విధంగా తయారు చేస్తారు. కండలతో ఉండే హృతిక్ ఈ మూవీలో పూర్తి భిన్నంగా కనిపించి తన అద్భుత నటనతో ప్రేక్షాదారణ పొందారు. కాగా హృతిక్ ఇటీవల వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వార్ చిత్రం సైతం విమర్శకుల మన్ననలు పొందింన సంగతి తెలిసిందే.( ఆనంద్ మహీంద్రా సాయం తిరస్కరించిన ఆనంద్ కుమార్) -
అనుష్క ఎక్స్‌లెన్స్
బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ అటు నటిగా, ఇటు నిర్మాతగా వరుస హిట్స్‌తో దూసుకెళుతున్నారు. ‘దాదాసాహెబ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బహూకరించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు’ ఈ ఏడాది అనుష్కని వరించబోతోంది. తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’ బ్యానర్‌ను స్థాపించిన అనుష్క ప్రేక్షకులు మెచ్చే చిత్రాలను నిర్మించారు. చిన్న వయసులోనే ప్రొడక్షన్ స్థాపించి పలు అర్థవంతమైన, చక్కటి వినోదాత్మక సినిమాలను ప్రేక్షకులకు అందించినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కొత్త నటులకు అవకాశం ఇస్తూ మరో మూడు సినిమాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారామె. ఇటీవలే ‘పరి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అనుష్క. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఫౌండేష¯Œ వారు ఆమెను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు 2018’తో సత్కరించాలని నిర్ణయించారట. అవార్డు ప్రదానోత్సవం ఎప్పుడు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అనుష్కా శర్మ ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో ‘సూయీ ధాగా’, షారుక్‌ఖాన్‌తో ‘జీరో’ చిత్రాల్లో నటిస్తున్నారు. -
ప్రియాంకకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు!
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం దక్కుతోంది. హాలీవుడ్లో కూడా అడుగుపెట్టి అక్కడ క్వాంటికో సిరీస్ చేయడంతో పాటు బేవాచ్ సినిమా కూడా చేసిన ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డును త్వరలో ఇవ్వనున్నారు. 'అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి' విభాగంలో ఆమెకు ఈ అవార్డు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది. ఈ విభాగాన్ని ఈ సారే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. గతంలో స్పోర్ట్స్ డ్రామా 'మేరీకోమ్' బయోపిక్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రియాంక.. అంతర్జాతీయంగా కూడా తన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు ఈ అవార్డు పొందుతున్న మొదటి మహిళగా ప్రియాంక నిలవబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా ఆమె స్వయంగా నిర్ధారించాల్సి ఉంది. ట్విట్టర్లో కూడా ప్రియాంక దీని గురించి ఏమీ వ్యాఖ్యానించలేదు. జూన్ ఒకటో తేదీన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమం జరగనుంది. అంతేకాదు.. ప్రియాంక తల్లి మధు చోప్రాకు కూడా ఒక అవార్డు రాబోతోంది. తొలిసారి ఆమె నిర్మాతగా వ్యవహరించి తీసిన 'వెంటిలేటర్' సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. హీరో సిద్దార్థ మండిపాటు అయితే ఈ అవార్డు విషయంలో ఒక వర్గం జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై హీరో సిద్దార్థ తీవ్రంగా మండిపడ్డాడు. శీర్షికలో 'అకాడమీ' అనే పేరును తీసేసి కేవలం దాదాసాహెబ్ ఫాల్కే అని మాత్రమే పెట్టడం పట్ల అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధ్యతారహితమైన జర్నలిజం అన్నాడు. The word academy has been swallowed in the headline. Click bait. Irresponsible journalism. pic.twitter.com/gb46N93GJn — Siddharth (@Actor_Siddharth) 29 May 2017