
హృతిక్ రోషన్
వారణాసి వెళ్లారు హృతిక్ రోషన్. వారం రోజులు అక్కడే ఉంటారట. పర్సనల్ లైఫ్ కోసం కాదు. ప్రొఫెషనల్ లైఫ్ కోసం. బీహార్ గణిత శాస్త్రవేత్త, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా విశాల్ బాల్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సూపర్ 30’. గత నెల 22న ఆరంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసిలో జరుగుతోంది. ఇందులో హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. సినిమా టైటిల్‌ని మార్చి సూపర్ 100 అని లుక్‌ని హృతిక్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. బీహార్, పాట్నా బ్యాక్‌డ్రాప్ సీన్స్‌ని అక్కడ తీయడంతో పాటు ముంబైలో తయారు చేయించనున్న బీహార్, పాట్నా సెట్స్‌లోనూ తీయాలనుకుంటున్నారట.
మే కల్లా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి, తన ఇద్దరు కుమారులతో హాలిడేస్‌ను ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేశారట హృతిక్. ఈ ట్రిప్ తర్వాతనే సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ముఖ్య తారలుగా రూపొందనున్న సినిమా షూటింగ్ మొదలవుతుందని బీటౌన్ టాక్. ‘సూపర్ 30’ని వచ్చే ఏడాది జవనరి 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటించనున్నారట.