‘ఆ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడు’ | Hrithik Roshan Is The Perfect Choice To Play My Role Says Anandkumar | Sakshi
Sakshi News home page

‘హృతిక్‌ మాత్రమే న్యాయం చేయగలడు’

Published Tue, Mar 27 2018 3:42 PM | Last Updated on Tue, Mar 27 2018 6:56 PM

Hritik Roshans Super 30 - Sakshi

బాలీవుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సూపర్‌30’. గణిత ఉపాధ్యాయుడి నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది ఈ  చిత్రం. బీహార్‌లోని ఆనంద్‌ కుమార్‌ అనే మ్యాథ్స్‌ టీచర్‌ తన విద్యార్థులకు ఐఐటీ దిశగా శిక్షణనిచ్చేవాడు. ఆయన విద్యార్థులందరూ ఐఐటీలోనే చదువుతున్నారు. అయితే అంతటి మేధావి ఆ స్థాయికి చేరుకున్న ప్రయాణాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాపై ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ...‘ఎనిమిదేళ్ల క్రితం రచయిత సంజీవ్‌ దత్తా నా వద్దకు వచ్చాడు. సూపర్‌ 30 పేరుతో మీ గురించి సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పాడు. హృతిక్‌ నా పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. తనను నేను కలిసాను. నా పాత్రకోసం తను పడే కష్టాన్ని చూశాను. నేను క్లాస్‌రూంలో చెప్పిన వీడియోలను చూస్తున్నాడు. నా పాత్రపై పట్టు సాధించేందుకు చాలా శ్రమిస్తున్నాడు. హృతిక్‌ నా పాత్రను చాలా బాగా చేస్తున్నాడు. ఈ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడు’ అని తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 25న సూపర్‌30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement