
సూపర్ 30
హీరో హృతిక్ రోషన్ 30 మంది మెరికల్లాంటి పేద విద్యార్థుల కోసం గాలిస్తున్నారట.
హీరో హృతిక్ రోషన్ 30 మంది మెరికల్లాంటి పేద విద్యార్థుల కోసం గాలిస్తున్నారట. వాళ్లందర్నీ ఐఐటీ సంస్థల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారట. అందుకు వారందరూ రాయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు తానే గైడ్‌గా ఉండాలని డిసైడ్ అయ్యారని బాలీవుడ్ సమాచారం. కానీ, ఇదంతా రియల్ లైఫ్‌లో అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే హృతిక్ ఇదంతా చేయబోయేది రీల్ లైఫ్‌లో. మ్యాటర్ ఏంటంటే ప్రముఖ మేథమ్యాటిషియన్ ఆనంద్‌కుమార్ బయోపిక్‌లో హృతిక్ నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. ఈ సినిమాకు ‘సూపర్ 30’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ‘క్వీన్’, ‘షాందార్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వికాస్ బాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 2002లో బీహార్‌లోని పాట్నాలో ‘సూపర్ 30’ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసిన ఆనంద్‌కుమార్ ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పి, వాళ్లందరూ ఇండియాలోని ప్రముఖ ఐఐటీ సంస్థల్లో అడ్మిషన్ పొందేలా కృషి చేశారు.