
ముంబై : హృతిక్ రోషన్ హీరోగా గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్ సూపర్ 30 కలెక్షన్లలోనూ దీటుగా నిలిచింది. మిశ్రమ స్పందనతో ఓపెన్ అయిన మూవీ తొలిరోజు రూ 11.83 కోట్లు వసూలు చేసి డీసెంట్ వసూళ్లు రాబట్టిన సూపర్ 30 శనివారం రెండో రోజు ఏకంగా రూ 18.19 కోట్లు వసూలు చేసింది.
రెండు రోజుల్లో సూపర్ 30 బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ 30.20 కోట్లు కలెక్ట్ చేసింది. శనివారం మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్ర్కీన్స్‌లోనూ మెరుగైన వసూళ్లు సాధించడంతో ఆదివారం మూవీ రూ 20 కోట్లు కలెక్ట్ చేసి తొలి వారాంతంలో రూ 50 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment