మరోసారి కేబీసీకి ‘సూపర్‌ 30’ ఆనంద్‌ | KBC Calls super 30 Anand Kumar For Show | Sakshi
Sakshi News home page

మరోసారి కేబీసీకి ‘సూపర్‌ 30’ ఆనంద్‌

Published Sat, Dec 5 2020 7:03 PM | Last Updated on Sat, Dec 5 2020 8:59 PM

KBC Calls super 30 Anand Kumar For Show - Sakshi

ముంబై : సూపర్‌ 30 వ్యవస్థాపకుడు, ‍‍ప్రముఖ మ్యాథ‌మెటీషియ‌న్ ఆనంద్‌ కుమార్..‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌‌పతి’ షోలో మరోసారి పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న ఎపిసోడ్‌ 51, 61,62లలో పాల్గొనవల్సిందిగా కేబీసీ ఆనంద్‌ను ఆహ్వానించనుంది. ఈ మేరకు సూపర్‌ 30 శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2017లో మొదటిసారి ఆయన కేబీసీలో పాల్గొన్నారు. గేమ్‌ ఆడి 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు. అంతేకాకుండా ‘అరక్షణ్‌’ సినిమాలో పాత్రకు సంబంధించి అమితాబ్‌ బచ్చన్‌కు ఆనంద్‌ కొన్ని సలహాలను కూడా ఇచ్చారు.

చదవండి : ‌అక్షయ్‌ బాటలో మిలింద్‌.. తొలిసారి ఆ పాత్రలో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement