Krrish 3
-
క్రిష్-4: తండ్రితో హృతిక్ విభేదాలు!
హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'క్రిష్'కి అభిమానులు కాని వారుండరు. 2006లో వచ్చిన ఆ చిత్రం హిందీలోనే కాదు.. తెలుగులోనూ అనువాద రూపంలో మంచి విజయం సాధించింది. తరువాత వచ్చిన 'క్రిష్ 3' (2013) కూడా మంచి విజయమే సాధించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో నాలుగో భాగం వస్తున్న విషయం తెలిసిందే. అయితే గత చిత్రాల కంటే భారీగా ‘క్రిష్ 4′ ను రూపొందించాలన్నది హృతిక్ ఆలోచిస్తున్నాడట. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ భారీ ఎత్తున ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో తండ్రి రాకేశ్ రోషన్ సలహాను హృతిక్ పాటించడం లేదట. ఈ సినిమాకి సంబంధించి హృతిక్‌కి కొన్ని ఆలోచనలు ఉన్నాయట. ఏఏ ఆర్టిస్టులను తీసుకోవాలి. ఎలాంటి గ్రాఫిక్స్‌ను వాడాలని అనే విషయాలను హృతిక్యే చూసుకుంటున్నాడట. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్ సినిమాలో పెట్టాలనే అంశాన్ని కూడా అతనే చూసుకుంటున్నాడట. తండ్రి రాకేశ్ రోషన్ కంటే హృతిక్ కే నేటితరం ప్రేక్షకులపై మంచి అవగాహన ఉంది. ఎలాంటి గ్రాఫిక్స్ సన్నివేశాలయితే ప్రేక్షకులకు నచ్చుతాయో హృతిక్ బాగా తెలుసు. అందుకే సినిమా సంబంధించిన విషయాల్లో తండ్రి మాట వినడం లేదని బాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఏదేమైనా భారీ హంగులతో 2020లో క్రిష్-4 సినిమాను విడుదల చేయాలని తండ్రీ-కొడుకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
అతను పంపినవి డిలిట్ చేసేశాడు!
చినికి చినికి గాలివానగా మారినట్లు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం అలానే మారింది. ‘క్రిష్-3’లో నటించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ సమయంలో తన భార్య సుజానే ఖాన్ నుంచి విడిపోవడానికి హృతిక్ ఇష్టపడకపోవడంతో కంగన, అతనికి దూరమయ్యారట. ఇటు హృతిక్ కానీ, అటు కంగన కానీ తమ గురించి వచ్చిన వార్తలకు అప్పట్లో స్పందించలేదు. అంత సెలైంట్‌గా ఉండిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా రచ్చ... రచ్చ చేసుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరంలీగల్ నోటీసులు పంపించుకునే దాకా వివాదం ముదిరిపోయింది. ఆ నోటీసుల్లో ఇద్దరూ చేసిన ఆరోపణల విషయానికొస్తే... హృతిక్‌కి దీటుగా సమాధానం చెప్పాలనుకున్న కంగనా రనౌత్ తన లాయర్ ద్వారా జవాబు నోటీసు పంపించారు. అందులో ఆమె కూడా ఘాటుగానే స్పందించారు. కంగన పంపించినదానిలో ఏముందంటే.. ♦ నా క్లయింట్ (కంగన) ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిసిటీ కోసం మీ (హృతిక్ లాయర్ని ఉద్దేశించి) క్లయింట్ పేరుని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చారామె. ఈ నిజాన్ని ఒప్పుకుని, మీ క్లయింట్ నోటీసుని ఉపసంహరించుకోవాలి. ఆధారం లేని ఆరోపణలు, మితిమీరిన నిందలు చేయడం తగదు. ♦ నా క్లయింట్ అమాంతంగా ఆకర్షితురాలు కావడానికి టీనేజర్ కాదు. ఇద్దరి మధ్య ఏమేం జరిగాయో అవన్నీ ఇద్దరి సమ్మతంతోనే జరిగాయి. మీ క్లయింట్ అండదండలు నా క్లయింట్‌కి ఉన్నాయనడం ఆమోదనీయం కాదు. భార్యతో విడాకుల వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో మీ క్లయింటే ఒక కొత్త ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసి, నా క్లయింట్‌తో కమ్యూనికేట్ కావాలనుకున్నారు. అలా చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూసుకోవాలనుకున్నారు. చివరికి నా క్లయింట్ ఐడీని హ్యాక్ చేసి, ఆయన పంపించిన మెయిల్స్‌ను తొలగించేశారు. నా క్లయింట్ నుంచి వచ్చే ఇ-మెయి ల్స్‌ని నిరాకరిస్తున్నట్లు మీ క్లయింట్ నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు. నా క్లయింట్‌ను ‘బ్లాక్’ చేసే ప్రయత్నమూ చేయలేదు. ఇ- మెయిల్స్ మీ క్లయింట్ ఆమోదంతోనే అందాయనే ఋజువు అది. ♦ మీ క్లయింట్ (హృతిక్) తనదైన ఊహల్లో బతుకుతున్నారు. అందులో భాగంగానే తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటు న్నారు. ఇంటర్వ్యూలో నా క్లయింట్ ‘సిల్లీ ఎక్స్‌లు’ అని పేర్కొన్నారే తప్ప, మీ క్లయింట్ పేరెక్కడా ప్రస్తావించలేదు. ఆ మాట తనను ఉద్దేశించినదే అని మీ క్లయింటే తనకు ఆపాదించుకున్నారు. మీ క్లయింట్ ఆపాదించి నట్లు నా క్లయింట్ ‘యాస్పర్జెర్’తో బాధపడట్లేదు. ఆమెకు మానసిక రుగ్మత లేదు. -
రోజుకు 50 మెయిల్స్ పంపింది!
చినికి చినికి గాలివానగా మారినట్లు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల వ్యవహారం అలానే మారింది. ‘క్రిష్-3’లో నటించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్త ప్రచారమైంది. అయితే, ఆ సమయంలో తన భార్య సుజానే ఖాన్ నుంచి విడిపోవడానికి హృతిక్ ఇష్టపడకపోవడంతో కంగన, అతనికి దూరమయ్యారట. ఇటు హృతిక్ కానీ, అటు కంగన కానీ తమ గురించి వచ్చిన వార్తలకు అప్పట్లో స్పందించలేదు. అంత సెలైంట్‌గా ఉండిపోయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా రచ్చ... రచ్చ చేసుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరంలీగల్ నోటీసులు పంపించుకునే దాకా వివాదం ముదిరిపోయింది. ఆ నోటీసుల్లో ఇద్దరూ చేసిన ఆరోపణల విషయానికొస్తే... ♦ ‘‘మన దృష్టిని ఆకర్షించడానికి ‘సిల్లీ ఎక్స్‌లు’ లేనిపోనివి ప్రచారం చేస్తారు?’’ అని రెండు నెలల క్రితం ప్రచురితమైన ఓ ఇంటర్వ్యూలో కంగన అన్నారు. ఆ మాట హృతిక్‌ను ఆగ్రహానికి గురి చేసింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కంగనతో చట్టపరంగా డీల్ చేయాలనుకున్నారు. అంతే... కంగనా రనౌత్‌కు లాయర్ నోటీసు పంపించారు. ఆ నోటీసులో ఏముందంటే... ♦ కొంతకాలంగా ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా హృతిక్కీ, మీకూ (కంగన) మధ్య ఏదో ఉందని సంకేతం అందేలా మాట్లాడుతున్నారు. మీకు, తనకూ మధ్య ఏమీ లేదనీ, తనను అవమానాల పాలు చేయడానికీ, పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నా రనీ నా క్లయింట్ అంటున్నారు. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, హృతి క్కీ, మీకూ మధ్య ఏమీ లేదని బాహాటంగా స్పష్టం చేయాలి. ♦ ‘క్వీన్’ సినిమాలో మీరు అద్భుతంగా నటించారంటూ హృతిక్ నుంచి మీకు ఇ-మెయిల్ వచ్చిందంటూ కరణ్ జోహార్ (దర్శక- నిర్మాత) బర్త్‌డే పార్టీలో మీరు హృతిక్‌కి ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు హృతిక్ అది తన ఇ-మెయిల్ కాదనీ, తన అసలైన మెయిల్ ఐడీని మీకిచ్చారు. అంతకు ముందు మీరు పేర్కొన్న ఐడీ తనది కాదని అప్పట్లో ఆయన సిటీ పోలీసుల ‘సైబర్ సెల్’కి ఫిర్యాదు చేశారు. ఇక... హృతిక్ అసలు మెయిల్ ఐడీ తెలుసు కున్న మీరు అప్పట్నుంచీ ఆయనకు కుప్పలు తెప్పలుగా మెయి ల్స్ పంపారు. మొత్తం 1,439 మెయిల్స్ మీ నుంచి వచ్చాయి. రోజుకి 50 మెయిల్స్ పంపారని నా క్లయింట్ పేర్కొన్నారు. వాటిని పట్టించుకోకపోయినా ఆయన మానసిక ఒత్తిడికి గుర య్యారు. మెయిల్స్ పంపడమే కాక, నా క్లయింట్‌తో మీకు ఎఫైర్ ఉందని ప్రచారం చేశారు. పైగా ‘సిల్లీ ఎక్స్’ అని పేర్కొన్నారు. ♦ ‘క్రిష్ 3’ షూటింగ్ అప్పుడు మద్యం మత్తులో మీరు రచ్చ చేసి నప్పుడు మీ సిస్టర్ రంగోలీ క్షమాపణలు చెప్పడంతో పాటు, మీరు ‘యాస్పర్జెర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని పేర్కొన్నారని నా క్లయింట్ చెప్పారు. మీలోని ఆ లోపాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమె కోరుకున్నారు. ఇప్పటివరకూ నా క్లయింట్ ఆ మాట మీద నిలబడ్డారు. -
దుమ్ము రేపుతున్న దూమ్ 3
-
రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న ధూమ్-3
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజునే భారత్ లో 36 కోట్ల రూపాయలు, ప్రపంచ వ్యాప్తంగా 56.80 కోట్లను వసూలు చేసింది. రిలీజైన తొలి రోజునే క్రిష్-3 నమోదు చేసిన 35.91 కోట్ల రికార్డును అధిగమించింది. తొలి ఆట నుంచే సక్సెస్ టాక్ ను సంపాదించుకున్న ధూమ్-3 భారీ కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ అనలిస్ట్ లు భావిస్తున్నారు. వివిధ దేశాల్లో ధూమ్-3 వసూళ్లు కింది విధంగా ఉన్నాయి. యూఏఈ, గల్ప్ దేశాల్లో 1,279,000 అమెరికన్ డాలర్లు యూఎస్, కెనడా 11,00,000 డాలర్లు యూకే 4,00,000 డాలర్లు ఆస్ట్రేలియా 1,72,300 డాలర్లు పాకిస్థాన్ 2,10,000 డాలర్లు -
బాలీవుడ్ తెరపై భారీ హంగామా!
దీపావళి పండగ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది. ఆ సెలబ్రేషన్ మూడ్‌లోంచి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు, ఇప్పుడు సినిమాల పరంగా పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే, బాలీవుడ్లో ఈ నెల మొత్తం పండగ వాతావరణమే. ఈ మధ్యకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆరు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. అన్నీ అగ్ర తారల చిత్రాలే. ఆసక్తికరమైన కథాంశాలే. ప్రేక్షకుల చెంతకు ఇప్పటికే ‘క్రిష్ 3’ చేరి, భారీ వసూళ్లు రాబడుతోంది. మిగతా చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. సత్య-2: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘సత్య 2’ చిత్రం వాస్తవానికి అక్టోబర్ 25న విడుదల కావాల్సి ఉండగా, చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మతో వివాదం కారణంగా ఈ చిత్రాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. మాములుగా వర్మ సినిమా అంటేనే అంచనాలు భారీ ఎత్తున ఉంటాయి. ఇక, చాక్లెట్ బోయ్‌లా ఉండే శర్వానంద్‌తో (హిందీలో పునీత్ సింగ్) ఈ చిత్రంలో మాస్ పాత్ర చేయించడం, అతని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండటం ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ తీసిన ‘సత్య’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా కూడా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వర్మ రూపొందించిన ఈ ‘సత్య 2’పై భారీ అంచనాలున్నాయి. రామ్‌లీలా: చరిత్రాత్మక నేపథ్యంతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘రామ్‌లీలా’ చిత్రానికి షేక్స్పియర్ విరచిత ప్రేమకథ ‘రోమియో జూలియట్’ అధారం. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె నాయకా నాయికలు. ప్రియాంక చోప్రా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు క్రేజ్ లభించింది. అలాగే, ఈ చిత్రం ఫస్ట్ లుక్, పోస్టర్స్ అంచనాలు పెంచాయి. ఫొటోల్లో రణ్వీర్, దీపికాల రొమాంటిక్ దృశ్యాలు హాట్ టాపిక్ అయ్యాయి.రియల్ లైఫ్‌లో ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ రీల్‌పై తమ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారని ఈ ఫొటోలు చూసినవాళ్లు అంటున్నారు. ఇక, రొమాంటిక్ లవ్‌స్టోరీస్ తెరకెక్కించడంలో భన్సాలీ స్టయిలే వేరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంవల్ల, దీపికా, రణ్‌వీర్‌ల జంట కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 15న రామ్లీలాల ప్రేమకహానీ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. గోరి తేరే ప్యార్ మే: పునీత్ మల్హోత్రా దర్శ కత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన చిత్రం ‘గోరి తేరే ప్యార్ మే’. వాస్తవానికి 2011లో ఈ సినిమా ఎనౌన్స్మెంట్ జరిగింది. ముందుగా షాహిద్‌కపూర్, సోనమ్కపూర్లను హీరో హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రకథ పట్ల సంతృప్తి చెందక, ఈ ఇద్దరూ తప్పుకున్నారనే వార్త అప్పట్లో హల్చల్ చేసింది. ఆ తర్వాత సీన్లోకి ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ వచ్చారు. మరి... కథలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారో లేక పునీత్ చెప్పిన కథ నచ్చే ఒప్పుకున్నారో అనే విషయం బయటికి రాలేదు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఈ తరహా సినిమాలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. కథ బాగుంటే చాలు.. వసూళ్ల వర్షం కురిపించేస్తాయ్. మరి.. ఈ ప్రేమకథ బాక్సాఫీస్ ఖజానాని నింపగలుగుతుందో లేదో? ఈ 22న తెలిసిపోతుంది. రజ్జో: ఇటీవల బాలీవుడ్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాల్లో ‘రజ్జో’ ఒకటి. దానికి కారణం ఈ చిత్రం కథాంశం. రజ్జో అనే ముస్లిం యువతి, చందు అనే బ్రాహ్మణ యువకుడి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కదా అనుకుంటున్నారా? ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. కుర్రాడు టీనేజ్‌లో ఉంటాడు. ఆ యువతికి పాతికేళ్లు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత విశ్వాస్ పాటిల్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో కంగనా రనౌత్, పరాస్ అరోరా హీరో, హీరోయిన్లు. కీలక పాత్రలను ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద లాంటి అగ్రతారలు పోషించారు. 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రామ్‌లీలా’తో ఈ ‘రజ్జో’ పోటీ పడనుంది. నిందలు మిగులుతాయో, అభినందనలు దక్కుతాయో వేచి చూడాల్సిందే! సింగ్ సాబ్ ది గ్రేట్: కొంత విరామం తర్వాత సన్నీ డియోల్ నటించిన చిత్రం ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. టైటిల్‌ని బట్టి ఓ శక్తిమంతమైన సింగ్ సాబ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సింగ్‌గా సన్నీ లుక్‌కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. ‘గదర్’లోని సన్నీ లుక్‌ని తలపిస్తుందని బాలీవుడ్‌వారు అంటున్నారు. సంచలనాత్మక విజయం సాధించిన ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ శర్మ తాజా చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. వాస్తవానికి అనిల్ కాంబినేషన్లో సన్నీ చేసిన నాలుగో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో వచ్చిన గదర్, హీరో: లవ్‌స్టోరీ ఆఫ్ ల సై్ప, అప్నే చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కారణంగా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ 22న సింగ్ సాహెబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుల్లెట్ రాజా: సైఫ్ అలీఖాన్, సొనాక్షి సిన్హా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బుల్లెట్ రాజా’. తిగ్మాన్షు ధూలియా దర్శకత్వం వహించారు. వెస్ట్ బెంగాల్ బేస్డ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఇందులో బుల్లెట్ రాజాగా సైఫ్ రఫ్ లుక్‌లో కనిపించబోతున్నారు. కాక్టైల్, గో గోవా గాన్... ఇలా ఇటీవల కాలంలో సైఫ్ నటించిన చిత్రాలు విజయాన్ని చవి చూశాయి. దాంతో ‘బుల్లెట్ రాజా’ కూడా సక్సెస్ ట్రాక్ మీదే వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. 29న ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. ఈ అరడజను చిత్రాల్లో అదరహో అనిపించే వసూళ్లని ఏ చిత్రం రాబడుతుందనేది వెయిట్ అండ్ సీ. - రాజాబాబు అనుముల -
నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిన 'క్రిష్ 3'
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ నటించిన 'క్రిష్ ౩' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును అధిగమించి రికార్డు వసూళ్ల దిశగా దూసుకు పోతోంది. దీపావళికి రెండు రోజులు ముందుగా నవంబర్ 1న విడుదలయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 100 కోట్ల పైగా వసూళ్లు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా సోమవారం నాటికి 108.6 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఒక్కరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా 'క్రిష్ 3' నిలిచిందని వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే ఈ సినిమా రూ. 35.91 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిందని తెలిపారు. ఇంతవరకు ఏ సినిమా కూడా ఒక్కరోజులో ఇంత కలెక్షన్ సాధించలేదని వివరించారు. -
సీక్వెల్స్ లో హృతిక్ టాప్
-
నాకు నచ్చిన వ్యక్తి ఇంకా లభించలేదు: ప్రియాంక చోప్రా
'నాకు నచ్చే విధంగా ఉండే జీవిత భాగస్వామి ఇంకా లభించలేదు' అని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. అయినా ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలను కోవడం లేదు అని అన్నారు. తాను లైఫ్ లో ఇంకా స్ఠిరపడలేదు.. నాకు కావాల్సిన ప్రత్యేకమైన వ్యక్తి తారసపడలేదు అని ప్రియాంక తెలిపింది. నా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం నిశ్చయమైంది. గత మూడేళ్లుగా తాను ప్రేమిస్తున్న కనిక మాథూర్ తోనే వివాహం జరుపడానికి తన తల్లితండ్రులు ఒప్పుకున్నారని మీడియాకు వెల్లడించింది. సోదరుడి పెళ్లి విషయం మీడియాలో రావడంతో తన పెళ్లిపై కూడా రూమర్లు వస్తున్నాయన్నారు. పెళ్లి విషయంపై తనపై ఎలాంటి ఒత్తిడి లేదు అని ప్రియాంక వెల్లడించింది. ప్రియాంక చోప్రా నటించిన 'క్రిష్ 3' చిత్రం ఇటీవల విడుదలైంది. 'గూండే', బాక్సర్ మేరికామ్ జీవిత కథ అధారంగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న చిత్రంలోనూ, జోయా అక్తర్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. -
'క్రిష్ 3'ని కథ ఓడించింది!
రోహిత్ మెహ్రా గొప్ప సైంటిస్ట్. నిర్జీవమైన వాటిలో మళ్లీ జీవం నింపడానికి రోహిత్ పరిశోధన చేస్తుంటాడు. రోహిత్ కుమారుడు క్రిష్ అలియాస్ కృష్ణ. ఎవరికి ఆపదవచ్చినా.. క్రిష్ రూపంలో ఆదుకుంటాడు కృష్ణ. రోహిత్ డీఎన్ఏ ద్వారా జన్మించిన కాల్.. ఒక ఫార్మా కంపెనీకి అధినేత. భయంకరమైన వైరస్ సృష్టించి ప్రపంచాన్ని నాశనం చేయాలని ఓ పన్నాగం పన్నుతాడు. అయితే రోహిత్ తన అనుభవాన్ని రంగరించి.. వైరస్‌ను ఆపివేయడంలో సఫలీకృతమవుతాడు. తన ప్లాన్లను భగ్నం చేసిన రోహిత్‌పై పగ తీర్చుకోవడానికి గర్భిణిగా ఉన్న క్రిష్ భార్యను కాల్ ఎత్తుకెళ్లుతాడు. తన భార్యను క్రిష్ ఎలా రక్షించుకుంటాడు? కాల్ దుష్ట ప్రయత్నాలను ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే ’క్రిష్ 3’ చిత్రం. రోహిత్ మెహ్రా, క్రిష్, కృష్ణ రెండు విభిన్న షేడ్స్ ఉన్న హృతిక్ పోషించాడు. కథలో పస లేకపోవడంతో రోహిత్, కృష్ణ పాత్రల ద్వారా నటనను ప్రదర్శించేందుకు అంతగా స్కోప్ లేకపోయింది. క్రిష్ పాత్ర ద్వారా హీరోయిజం చూపించడానికి కొంత అవకాశం కలిగింది. ఇటీవల కాలంలో మీడియాలో ఈ చిత్రంలో తానే ఫస్ట్ హీరోయిన్ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన ప్రియాంక చోప్రా పాత్రకు పెద్దగా ప్రాధ్యాన్యత లేకపోయింది. కాల్ సృష్టించిన నలుగురు దుష్ట శక్తుల్లో ఒకరైన కాయా(కంగనా రనౌత్) విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కొంత మెరుగ్గా ఉందన్న ఫీలింగ్ కలిగినప్పటికి.. క్రిష్3 కి ఎలాంటి అదనపు ఆకర్షణ కాలేకపోయింది. ప్రియాంక కంటే కంగనా రనౌత్ అందాల ఆరబోతలో కాస్తా పైచేయి సాధించింది. కాల్ పాత్ర ద్వారా విలన్ గా దర్శనమిచ్చిన వివేక్ ఒబెరాయ్‌కి మంచి మార్కులే పడ్డాయి. క్రిష్ 3 చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు లేకపోవడానికి దర్శకుడు రాకేశ్ రోషన్ తప్పటడుగులే ప్రధాన కారణం. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటం ఆద్యంతం ప్రేక్షకుడిని విసిగించింది. చిత్ర కథ ఫ్లాట్ గా ఉండటంతో ఎక్కడ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ స్థాయిలో క్రిష్ ను తీర్చి దిద్దాలనుకున్న రాకేశ్ రోషన్ ఆప్రయత్నంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. థియేటర్లో విసిగిన ప్రేక్షకుడికి క్లైమాక్స్‌లో యాక్షన్ స్వీక్వెన్స్, గ్రాఫిక్ పనితీరు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉన్నప్పట్టికి..చిత్రాన్ని గట్టెంక్కించేంత శక్తి లేకపోయింది. సాంకేతిక వర్గ పనితీరు, గ్రాఫిక్ వర్క్ భారతీయ చిత్రాలను మించేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి కొంత పాజిటి వ్ అంశమే అయినప్పటికి..పాటలు ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలో బలవంతుడైన క్రిష్3ని పసలేని కథ సునాయాసంగా ఓడించింది. ఓవరాల్‌గా వినోదాన్ని ఆశించి, కొత్తదనం కోసం థియేటర్కెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే మిగలడం ఖాయం. -
'క్రిస్ 3' చిత్రం వర్కింగ్ స్టిల్స్
-
విలన్ పాత్ర చేద్దామనుకున్నా: హృతిక్
ఇండోర్: సోషియా ఫాంటసీ సినిమా 'క్రిస్ 3'లో సూపర్ హీరో పాత్ర పోషించిన హృతిక్ రోషన్ విలన్ క్యారెక్టర్లో నటించాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమాలో విలన్ వేషం వేయాలకున్నానని, కానీ తన తండ్రి రాకేష్ రోషన్ అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఈ పాత్రను వివేక్ ఒబరాయ్తో చేయించారని చెప్పాడు. తన తండ్రి నమ్మకాన్ని వివేక్ వమ్ము చేయలేదని అన్నాడు. 'కాల్' పాత్రలో వివేక్ నటన చూసిన తర్వాత తన తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్టని అనిపించిందని హృతిక్ వివరించాడు. ఇండోర్‌లో 'క్రిస్ 3' ప్రమోషన్ కార్యక్రమంలో హృతిక్, రాకేష్ రోషన్ పాల్గొన్నారు. నవంబర్ 1న 'క్రిస్ 3' చిత్రం విడుదలకానుంది. -
పోలిక మంచిదే: హృతిక్ రోషన్
ముంబై: పోలిక మంచిదే అంటున్నాడు బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్. తన క్రిష్ ౩ సినిమాను హాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ 'ఎక్స్ మెన్'తో పోల్చడాన్ని హృతిక్ స్వాగతిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాలతో పోల్చడం బాలీవుడ్ సినిమాలకు మంచిదేనని పేర్కొన్నాడు. సూపర్ హీరో తరహా సినిమాలను భారతీయులకు ఏవిధంగా తెరకెక్కిస్తారనే ఉత్సుకత ప్రపంచమంతా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మనదేశంలో తెరకెక్కిన తొలి సూపర్ హీరో సినిమా ఇదని తెలిపాడు. కాస్ట్యూమ్స్‌తో మొత్తంగా చూస్తే క్రిష్ 3... 'ఎక్స్ మెన్'ను పోలివుంది. ఇక కంగనా రౌనత్ పోషించిన పాత్ర 'ఎక్స్ మెన్'లో హలీబెరీ పాత్రను తలపిస్తోంది. వివేక్ ఒబరాయ్ విలన్ పాత్రలో నటించాడు. కాల్ పాత్రను అతడు పోషించాడు. -
'హృతిక్ భార్యను నేనే'
బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు తారల మధ్య వివాదానికి కారణం 'క్రిష్ 3' చిత్రమైంది. క్రిష్3 చిత్ర ఆరంభంలోనే ప్రియాంకతో నటించేందుకు కంగనా విముఖత చూపింది. అయితే క్రిష్3 చిత్రంలో తానే హీరోయిన్ అని.. నేను హృతిక్ భార్యగా నటిస్తున్నాను అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాక జాక్వలైన్ ఫెర్నాండేజ్, చిత్రంగద సింగ్ రిజెక్ట్ చేసిన పాత్రను కంగనా పోషించింది అని వివాదస్పద వ్యాఖ్య చేయడంతో అసలు విషయం మొదలైంది. ప్రియాంక వ్యాఖ్యలపై కంగనా మాట్లాడుతూ.. క్రిష్3 చిత్రంలో తనది ప్రాధాన్యత ఉన్న పాత్రనేనని అన్నారు. తనను రెండవ హీరోయిన్ అని ప్రియాంక అనడం ఒప్పుకోనని కంగనా తెలిపింది. ఈ చిత్రం ఇద్దరు హీరోయిన్ల చిత్రం కాదని.. ఎవరి పాత్రలు వారికి ప్రాధాన్యతతో ఉన్నవే అని కంగనా తెలిపింది. -
మాధురీ వీరాభిమానిని: హృతిక్
ముంబయి: అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌కు తాను వీరాభిమానినని బాలీవుడ్ నటి హీరో హృతిక్ రోషన్ అన్నారు. హృతిక్ నటించిన క్రిష్ 3 ప్రమోషన్లో భాగంగా మాధురీతో కలసి 'జలక్ దిఖ్లా ఝా 6' అనే గ్రాండ్‌ఫైనల్ కార్యక్రమంలో స్టేజిపై కనువిందు చేయనున్నారు. 'నేను చిన్నప్పటి నుంచి మాధురీ అభిమానిని. ఆమె నవ్వు చాలా బాగుంటుంది. అత్యంత ప్రభావంతులైన మహిళల్లలో ఆమె ఒకరు' అని హృతిక్ చెప్పారు. హృతిక్, మాధురీ నటించిన సినిమాల్లోని కొన్ని సూపర్ హిట్ పాటలకు ఈ జోడి డ్యాన్ చేశారు. క్రిష్3లో నటించిన అందాల తార ప్రియాంక చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. హృతిక్, ప్రియాంక కూడా తాజా సినిమాలోని ఓ పాటకు నర్తించారు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్లో ఈరోజు (శనివారం) ప్రసారం కానుంది. -
జీవిత కథను తెరకెక్కిస్తా
ముంబై: కంగనా రనౌత్ ఇప్పటిదాకా కెమెరా ముందు నటించిన కథానాయిక మాత్రమే. ఇకపై ఈమెను నటి కంగనా.. అనేకంటే దర్శకురాలు కంగనా అనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సుందరి త్వరలో దర్శకురాలిగా మారనుంది. దర్శకురాలిగా ఈమెకు అనుభవం కూడా ఉందండోయ్. అమెరికాలో ఓ లఘు చిత్రానికి దర్శకత్వం వహించింది. నాలుగేళ్ల చిన్నారి, ఓ కుక్కను కథావస్తువుగా తీసుకొని తెరకెక్కించిన ఈ లఘుచిత్రానికి మంచి స్పందనే వచ్చింది. అయితే ఈసారి ఈ చిన్నాచితకా సినిమాలు తీయడం కాకుండా ఓ జీవితకథను పూర్తిస్థాయి సినిమాగా తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతోంది. ఎవరి జీవితకథను తెరకెక్కిస్తున్నారు? అనే ప్రశ్నను అడిగితే.. ‘అది మాత్రం సస్పెన్స్’ అని చెబుతోంది. అయితే దర్శకురాలిగా మారేందుకు ఇంకా సమయముందని, తానిప్పుడు రెండు పలు చిత్రాల చిత్రీకరణతో తీరికలేకుండా గడుపుతున్నానని చెప్పింది. దర్శకత్వం వహించేందుకు ముందు కాస్తా సిద్ధం కావాల్సి ఉంటుందని, అందుకు తనకు కనీసం ఏడాదైనా అవసరమని చెబుతోంది. అయితే బాలీవుడ్లో చాలామంది తారలు నిర్మాతలుగా స్థిరపడ్డారని, తనకు మాత్రం అలాంటి ఆలోచన లేదని చెప్పింది. నిర్మాతగా మారడం చాలా సులభమైన విషయమని, దర్శకురాలిగా మారాలంటే మాత్రం భారీగానే కసరత్తు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఇక ‘క్రిష్-3’ చిత్రంలో తన పాత్ర విశేషాలను వివరిస్తూ... ‘చిత్రంలో నా పాత్ర భిన్నమైంది. ఓ రకంగా సూపర్ ఉమెన్ పాత్ర. గ్రహాంతరవాసిని పోలి ఉంటుంది. ఇందులో నా పేరు కాయా. ఈ పాత్ర కోసం బాగానే శ్రమించాల్సి వచ్చింది. సవాలు విసిరే ఇటువంటి పాత్రలంటే నాకెంతో ఇష్టమ’ని చెప్పింది. -
క్రిష్-3 లేటెస్ట్ స్టిల్స్
-
క్రిష్-3లో అమితాబ్ బచ్చన్!
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో వాయిస్ ఓవర్ ట్రేండ్ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మహేశ్ బాబు, రవితేజ, సునీల్ లు వాయిస్ ఓవర్లలో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ చిత్రాలకు క్రేజ్ కూడా సంపాదించిపెట్టారు. అయితే అదే ట్రేండ్ బాలీవుడ్ లో కొనసాగుతోంది. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రిష్-3 చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్-3 చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పాత్రకు బిగ్ బీ అమితాబ్ గొంతును అరువు ఇచ్చినట్టు తెలిసింది. వివేక్ ఒబెరాయ్ పాత్రను పరిచయం చేస్తూ, ఆపాత్రకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు అమితాబ్ గొంతును దర్శకుడు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. వాయిస్ ఓవర్ వార్తలను అమితాబ్ ధృవీకరించారు. క్రిష్-3 చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉందని.. మొత్తం మూడు చిత్రాలకు సంబంధించిన అంశమని.. అందుకే వాయిస్ ఓవర్ కు ఒప్పుకున్నానని బిగ్ తెలిపారు. క్రిష్-3 చిత్రంలో వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడని దర్శకుడు రాకేశ్ రోషన్ వెల్లడించారు. -
పాదరక్షల విలువ లక్షా పాతిక వేలు!
విలాసవంతమైన జీవితం రాసి పెట్టి ఉంటే.. విలువైన వస్తువులు సైతం కాళ్ల దగ్గరకొస్తాయి. అవి దక్కించుకున్నవాళ్లు ఆనందంలో తేలిపోతే, పరాయివాళ్లు మాత్రం కుళ్లుకుంటారు. ప్రస్తుతం కంగనా రనౌత్ కాళ్లను అలంకరించిన పాదరక్షలు చూసి, కొంతమంది అసూయపడుతున్నారు. కారణం వాటి విలువ అక్షరాలా లక్షా పాతికవేల రూపాయలు. మీరు చదివింది నిజమే. అయితే అవి కంగనా సొంత డబ్బుతో కొనుక్కున్నవి కాదు. ‘క్రిష్ 3’ సినిమా కోసం కొన్నవి. హృతిక్‌రోషన్, ప్రియాంకచోప్రా, కంగనా రనౌత్ తదితరుల కాంబినేషన్లో స్వీయ దర్శకత్వంలో రాకేష్ రోషన్ రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇందులో కంగనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నారట. ఓ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తారట కంగనా.డ్రెస్‌లు, నగలు, పాదరక్షలు.. ఇలా అన్నీ వెరైటీగా ఉంటాయని సమాచారం. ఈ చిత్రంలో కంగనా రకరకాల పాదరక్షలతో కనిపిస్తారట. వాటిలో లక్షా పాతిక వేల పాదరక్షలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని ఊహించవచ్చు. ఇప్పటికే ఇవి బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. -
షారుక్ రికార్డును అమీర్, హృతిక్ బ్రేక్ చేస్తారా!
బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చంతా 'బాద్ షా' షారుక్ ఖాన్ పైనే జరుగుతోంది. తాజాగా దీపికా పదుకొనేతో కలిసి షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం అందరి అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ లో అతివేగంగా 100 కోట్లను వసూలు చేసిన చిత్రంగా చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలోనే కాకుండా పాకిస్థాన్, యూఎస్, బ్రిటన్, కెనడాతోపాటు మరికొన్ని దేశాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డులను తిరగ రాస్తోంది. వంద కోట్లను కొల్లగొట్టిన షారుక్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లపై కన్నేసింది. అయితే షారుక్ రికార్డులను అధిగమించే సత్తా ఎవరికుంది అని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ లాంటి అగ్రతారలు నటించిన 'సత్యగ్రహ' చిత్రం ఆగస్టు 30 తేదిన విడుదలకు సిద్దమవుతోంది. రణ్ బీర్ కపూర్ బేషరమ్ అక్డోబర్ 2 తేదిన, హృతిక్ రోషన్ 'క్రిష్ 3' నవంబర్ 4, ఆమీర్ ఖాన్ 'ధూమ్ 3' క్రిస్మస్ కు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం 75 కోట్ల వ్యయంతో తెరకెక్కగా, సత్యగ్రహ 40 కోట్లు, బేషరమ్ 50 కోట్లు, క్రిష్-3 90 కోట్ల, ధూమ్ 3 చిత్రం వంద కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది. తొలుత అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు నటించిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి ధీటుగా నిలుస్తుందని సినీ విమర్శకులు అంచనా వేశారు. అయితే అందర్ని అంచనాలను తలకిందులు చేసి.. ఆ చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ ముందు తేలిపోయింది. ఇక చెన్నై ఎక్ప్ ప్రెస్ చిత్ర రికార్డులను ఏ చిత్రం తడిచిపెడుతుందా ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో పెరిగింది. అన్నా హజారే స్పూర్తితో నిర్మించిన సత్యగ్రహ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర రికార్డులను తిరగరాసే సత్తా క్రిష్-3, ధూమ్-3 చిత్రాలకే ఉందని బాలీవుడ్ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ధూమ్, క్రిష్ చిత్రానలు అన్ని రకాల, అన్ని వయస్సుల వారు ఆదరించడానికి అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పెద్దగా అంచనాలు లేకుండా ఈద్ సందర్భంగా విడుదలైన షారుక్ 'చెన్నై ఎక్ప్ ప్రెస్' బాలీవుడ్ కు పెద్ద సవాలే విసిరింది. ఇక షారుక్ విసిరిన సవాల్ ను అమితాబ్, రణబీర్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లలో ఎవరు అధిగమిస్తారో వేచి చూడాల్సిందే! -
క్రిష్ 3 పోస్టర్స్
కోయి మిల్ గయా, క్రిష్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం క్రిష్ 3 హృతిక్ రోహన్, ప్రియాంక చోప్రా, కంగనా రౌనత్ ముఖ్యపాత్రల్లో నటించారు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించారు