షారుక్ రికార్డును అమీర్, హృతిక్ బ్రేక్ చేస్తారా!
షారుక్ రికార్డును అమీర్, హృతిక్ బ్రేక్ చేస్తారా!
Published Thu, Aug 22 2013 7:09 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చంతా 'బాద్ షా' షారుక్ ఖాన్ పైనే జరుగుతోంది. తాజాగా దీపికా పదుకొనేతో కలిసి షారుక్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం అందరి అంచనాలను మించి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ లో అతివేగంగా 100 కోట్లను వసూలు చేసిన చిత్రంగా చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డును సొంతం చేసుకుంది. స్వదేశంలోనే కాకుండా పాకిస్థాన్, యూఎస్, బ్రిటన్, కెనడాతోపాటు మరికొన్ని దేశాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డులను తిరగ రాస్తోంది. వంద కోట్లను కొల్లగొట్టిన షారుక్ చిత్రం 200 కోట్ల కలెక్షన్లపై కన్నేసింది.
అయితే షారుక్ రికార్డులను అధిగమించే సత్తా ఎవరికుంది అని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ లాంటి అగ్రతారలు నటించిన 'సత్యగ్రహ' చిత్రం ఆగస్టు 30 తేదిన విడుదలకు సిద్దమవుతోంది. రణ్ బీర్ కపూర్ బేషరమ్ అక్డోబర్ 2 తేదిన, హృతిక్ రోషన్ 'క్రిష్ 3' నవంబర్ 4, ఆమీర్ ఖాన్ 'ధూమ్ 3' క్రిస్మస్ కు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం 75 కోట్ల వ్యయంతో తెరకెక్కగా, సత్యగ్రహ 40 కోట్లు, బేషరమ్ 50 కోట్లు, క్రిష్-3 90 కోట్ల, ధూమ్ 3 చిత్రం వంద కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది.
తొలుత అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు నటించిన వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రానికి ధీటుగా నిలుస్తుందని సినీ విమర్శకులు అంచనా వేశారు. అయితే అందర్ని అంచనాలను తలకిందులు చేసి.. ఆ చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్ ముందు తేలిపోయింది. ఇక చెన్నై ఎక్ప్ ప్రెస్ చిత్ర రికార్డులను ఏ చిత్రం తడిచిపెడుతుందా ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో పెరిగింది.
అన్నా హజారే స్పూర్తితో నిర్మించిన సత్యగ్రహ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర రికార్డులను తిరగరాసే సత్తా క్రిష్-3, ధూమ్-3 చిత్రాలకే ఉందని బాలీవుడ్ బలంగా నమ్ముతోంది. ఎందుకంటే ధూమ్, క్రిష్ చిత్రానలు అన్ని రకాల, అన్ని వయస్సుల వారు ఆదరించడానికి అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పెద్దగా అంచనాలు లేకుండా ఈద్ సందర్భంగా విడుదలైన షారుక్ 'చెన్నై ఎక్ప్ ప్రెస్' బాలీవుడ్ కు పెద్ద సవాలే విసిరింది. ఇక షారుక్ విసిరిన సవాల్ ను అమితాబ్, రణబీర్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లలో ఎవరు అధిగమిస్తారో వేచి చూడాల్సిందే!
Advertisement
Advertisement